నగరంలో సంచలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ వెనక ఎంఐఎం హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్ : నగరంలో సంచలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ వెనక ఎంఐఎం హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. స్నేక్గ్యాంగ్కు బతికే హక్కు లేదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో పరిపాలనకు జ్వరం వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి తెలంగాణ వాది అని, అక్కడ ప్రజలు, రైతులు తమకు ఉండగా ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. ఇక ప్రధానమంత్రి 'జన్ధన్' యోజన పథకం అద్భుతమైనదని కిషన్ రెడ్డి ప్రశంసించారు.