ఆ ప్రాజెక్టును మళ్లీ తెప్పించాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, సంజయ్‌లదే
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్‌లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు.
ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్‌ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్‌తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు.
Comments
Please login to add a commentAdd a comment