snake gang
-
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పాములు కలకలం
-
పాము తన దారిలో వెళ్తూ ఉండగా...
ప్రకాశం: ఓ పాము తన దారిలో వెళ్తూ ఉండగా శునకాలు ఆ పామును గమనించి నిలవరించాయి. ఈ సంఘటన కొమరోలు మండలంలోని తాటిచెర్ల గ్రామంలో చోటు చేసుకుంది. నాగుపాము తాటిచెర్ల గ్రామ సమీపంలోని పొలాల వద్ద తన దారిలో తాను వెళుతూ ఉండగా ఆ పామును గమనించిన రెండు కుక్కలు దాని వద్దకు వెళ్లి మొరుగుతుండటంతో పాము అలాగే స్తబ్దుగా నిలబడింది. స్థానికంగా ఉన్న వారు ఈ సంఘటనను తమ కెమెరాలలో బంధించారు. పామును నిలువరించడానికి కుక్కలు దాదాపు ఓ గంటసేపు మొరగడంతో పాము వెనుదిరిగి వెళ్లిపోయింది. -
భయానక స్టంట్: ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు: వీడియో వైరల్
ఇటీవల కాలంలో పాములతో రకరకాల స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చాలా విషయాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. ఇటీవలే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్‌లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్ క్యాచర్లు ఇలాంటి స్టంట్లే చేస్తున్నారు. ఇక్కడొక స్నేక్ క్యాచర్ ఏకంగా కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టే స్టంట్ చేశాడు. వివరాల్లోకెళ్తే..ఈ హార్ట్ రైజింగ్ స్టంట్ వీడియోని సౌరబ్ జాదవ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్ కోబ్రా తలపై ముద్దు పెట్టుకునే స్టంట్ చేశాడు. ఈ స్టంట్ చేసిన వ్యక్తి వావా సురేష్ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్ మ్యాన్‌గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా టెన్షన్‌తో చూస్తున్న మనకు గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. View this post on Instagram A post shared by Saurabh Jadhav Jadhav (@10_viper_21) (చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..) -
అదృష్ట పాములంటు విక్రయం .. స్నేక్ గ్యాంగ్ అరెస్ట్ : గుంటూరు
-
ఖమ్మం జిల్లాలో స్నేక్ గ్యాంగ్
-
'ఇలాంటి శిక్షలతో నేరాలు అదుపులోకి'
హైదరాబాద్: మహిళలపై అకృత్యాలకు పాల్పడ్డ స్నేక్ గ్యాంగ్ దోషులకు రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షలు విధించడాన్ని ఐద్వా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు కె. ఎన్ ఆశాలత, కార్యదర్శి బి. హైమావతిలు స్వాగతిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇది అరుదైన మంచి తీర్పు అని, ఇటువంటి శిక్షల ద్వారా నేరాలు కొంతవరకు అదుపులోకి వస్తాయన్నారు. నేరాల నివారణకు ప్రభుత్వం మరిన్ని భద్రతా చర్యలు చేపట్టాలనీ, జిల్లా కొక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఇటువంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో విచారణ వేగంగా పూర్తయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, మహిళల గౌరవాన్ని పెంపొందించే విధంగా ప్రసార మాధ్యమాలలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, సినిమాలలో, టీ.వీ చానళ్లలో మహిళల అసభ్య, అశ్లీల చిత్రీకరణను నివారించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
‘స్నేక్‌గ్యాంగ్’ అకృత్యాలపై నేడు తీర్పు
రంగారెడ్డి జిల్లా కోర్టులు (హైదరాబాద్‌సిటీ): నగరంలో పలు అత్యాచారాలు పాల్పడిన స్నేక్ గ్యాంగ్‌పై రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. 2014 జులై నెలలో నగర శివారు ప్రాంతంలోని పహాడీషరీప్‌లో పాముతో బెదిరించి ఓ యువతి పై స్నేక్ గ్యాంగ్ సామూహిక అత్యాచారం చేసింది. బాధిత యువతి ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసును విచారించిన పోలీసులు ఈ కేసులో తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులు దయాని, ఖాదర్ బరాక్బ, తయ్యబ్ బసలమ, మహమ్మద్ పర్వేజ్, సయద్ అన్వర్, ఖజా అహ్మద్, మహమ్మద్ ఇబ్రహీం, అలీ బరాక్బ, సలామ్ హాండిలపై కోర్టు అభియోగ పత్రాలను పోలీసుల దాఖలు చేశారు. ఇందులో ఏడుగురు చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీలుగా ఉన్నారు. మరో ఇద్దరు బెయిల్‌పై ఉన్నారు. పాములతో బెదిరించి 37 మంది అకృత్యాలకు పాల్పడిన ఈ స్నేక్‌గ్యాంగ్ కేసును విచారించిన రంగారెడ్డి జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇవ్వనున్నది. -
'స్నేక్‌గ్యాంగ్' బాధితురాలి సోదరుడిపై దాడి
రంగారెడ్డి: స్నేక్ గ్యాంగ్ అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చిన బాధితురాలి సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీసుస్టేషన్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. దుండగుల దాడి నుంచి తప్పించుకున్న సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. గతేడాది జూలైలో ఓ ఫాంహౌస్‌కు వెళ్లిన ప్రేమ జంటను స్నేక్‌గ్యాంగ్ నిర్బంధించి... యువతిపై అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. బాధితురాలు అప్పట్లో పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో స్నేక్ గ్యాంగ్ అకృత్యాలు వెలుగు చూడడమే కాకుండా... ముఠాలోని సభ్యులు కటకటాల పాలయ్యారు. కాగా, బాధితురాలి సోదరుడు షంషీర్‌ఖాన్(18) తన బాబాయితో కలిసి కారులో శనివారం రాత్రి మెహదీపట్నం నుంచి చాంద్రాయణగుట్ట బయలు దేరారు. అదే సమయంలో అరాంఘర్ బైపాస్ రోడ్డులోని మార్కండేయనగర్ వద్ద పది మంది గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించి కత్తులతో దాడి చేసేందుకు యత్నించారు. బాధితుడు వారి నుంచి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించాడు. తనపై గుర్తు తెలియని వ్యక్తులు మరణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ కిరాతకులను అరెస్ట్ చేసిన పోలీసులు
హైదరాబాద్: నగరంలో కలకలం సృష్టించిన కిరాతక స్నేక్ గ్యాంగ్ నిందితులును పోలీసులు పీడీ యాక్టు కింద గురువారం అరెస్ట్ చేశారు. పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక నేరాలకు పాల్పడిన మహమ్మద్ పర్వేజ్(25), తాయబ్ బసాలామా(20)లకు కోర్టు బెయిల్ నిరాకరించింది. స్నేక్ గ్యాంగ్ యువతులను పాములతో బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 37 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. పహాడీ షరీఫ్ షాహీన్‌నగర్‌లో స్నేక్ గ్యాంగ్ అనేక అకృత్యాలకు పాల్పడింది. పర్వేజ్ పరీదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేసుల్లో నిందితుడు. తాయబ్ అదే పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కేసుల్లో ప్రధాన నిందితుడు. నగరంలో అత్యంత ప్రమాదకరమైన నిందితులుగా భావించే వీరిని పీడీ యాక్టు ద్వారా సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
ఈ అకృత్యాలు ఆగవా?
మొన్న పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అత్యాచారం సంఘటన మరవక ముందే మళ్లీ పెద్ద అంబర్‌పేటలో అత్యాచారం! నగరంలో రోజూ ఏదో ఒక అత్యాచారమో, కాల్పులో, దోపిడీయో వరుసగా జరుగుతుండటం తో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేరీతిలో పోలీసులకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇక మహిళలపై జరిగే అకృ త్యాలు చెప్పనక్కరలేదు. మరోప్రక్క పిల్లల కిడ్నాప్‌లు, ఇలా చెప్పు కుంటూపోతే నేరాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడి కేసులక్కడే! ఏ క్షణాన, ఏమి ఆపద ముంచుకొస్తోందో అని ప్రజలు భయ భ్రాంతుల వుతున్నారు. పైగా సిబ్బంది కొరతను అవకాశంగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోవడం, పోలీసులకు పెనుసవాలుగా మారింది. ఎన్ని చట్టాలు చేసినా, ఎక్కడి కేసులు అక్కడే మూలుగుతున్నాయి. పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే నేరాల సంఖ్య కొంత వరకూ అరికట్టవచ్చు. శొంటి విశ్వనాధం, చిక్కడపల్లి, హైదరాబాద్ -
'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు'
-
'ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే చిత్రీకరించారు'
హైదరాబాద్: నగర శివార్లులోని సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమ జంటపై దాడి, నగ్న దృశ్యాలకు సంబంధించి ఏసీపీ భాస్కర్ స్పందించారు. ఈ ఘటనపై గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఆ జంట ఏకాంతంగా ఉన్న సమయంలోనే ఇద్దరు వ్యక్తులు వారిని సెల్ ఫోన్ లో చిత్రీకరించిన అనంతరం బెదిరింపులకు పాల్పడ్డారన్నారు. ఈ క్రమంలోనే ఆ యువతి కూడా వచ్చిన యువకుడు పారిపోవడంతో ఆమెపై ఇద్దరు నిందితులు అత్యారానికి ఒడిగట్టారన్నారు. ఈ విషయాన్ని బయటకు చెబితే ఇంటర్ నెట్ లో పెడతామని బెదిరించినట్లు ఏసీపీ తెలిపారు. తొలుత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడిందని.. ఆ తరువాత ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదు చేశామన్నారు. ఆ నిందితుల నుంచి సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రస్తుతం సెల్ ఫోన్ ను ఫోరెనిక్స్ ల్యాబ్ కు పంపామని.. ఆ నివేదిక వచ్చాక చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. ఆ నిందితులు పెద్ద అంబర్ పేటకు చెందిన వెల్డర్ నల్లబోను శ్రీనివాస్ రెడ్డి, మెకానిక్ బండి లింగారెడ్డిలుగా గుర్తించామన్నారు. వారిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశామని ఏసీపీ భాస్కర్ తెలిపారు. -
శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’
-
శివార్లలో మరో ‘స్నేక్ గ్యాంగ్’
సంఘీ టెంపుల్ సమీపంలో ప్రేమజంటపై దాడి యువతిపై సామూహిక అత్యాచారం.. నగ్న దృశ్యాలు చిత్రీకరించి బెదిరింపులు బాధితురాలి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి... ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: నగరంలో మహిళలపై స్నేక్ గ్యాంగ్ దురాగతాలు మరచిపోక ముందే శివార్లలో ఇలాంటి దారుణమే మరోటి చోటుచేసుకుంది. హయత్‌నగర్ సమీపంలోని సంఘీ టెంపుల్‌కు వెళ్తున్న ప్రేమజంటపై దాడి చేసిన దుండగులు యువకుడిని తాళ్లతో కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె నగ్నంగా ఉన్న దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌కు దిగారు. ఆ మృగాళ్ల వేధింపులు భరించలేక ఆ యువతి పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. హయత్‌నగర్ పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన యువతి (22), యువకుడు (26) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరు ద్విచక్రవాహనంపై సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు సంఘీ దేవాలయానికి వెళ్తున్నారు. గుడికి రెండు కిలో మీటర్ల దూరంలో ఉండగా వీరిని పెద్ద అంబర్‌పేట్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. కొద్దిదూరం వెళ్లాక వారిని అడ్డగించి పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లారు. యువకుడి కాళ్లు, చేతులను తాడుతో కట్టేసి అతని ముందే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను సెల్ఫోన్లో చిత్రీకరించారు. ‘మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మా కోరిక తీర్చాలి, లేకుంటే నీ ఫొటోలు ఇంటర్నెట్లో పెడతాం’ అని బెదిరించారు. ఆ మరుసటి రోజే యువతికి ఫోన్‌చేసి తమ దగ్గరికి రావాలని బెదిరించారు. వరుసగా బెదిరింపులు రావడంతో ఆమె బుధవారం హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులిద్దరినీ పెద్దంబర్పేటకు చెందినవారిగా గుర్తించారు. ఒకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వీటిని ఎవరికైనా పంపారా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. -
స్నేక్ గ్యాంగ్ తరహాలో గ్యాంగ్ రేప్
* ఒకరి అరెస్టు, పరారీలో మరొకరు * రాజీకి రావాలంటూ బాధిత కుటుంబానికి ఫోన్లు * లేకుంటే రేప్ దృశ్యాలు నెట్లో పెడతామని బెదిరింపు * గత నెలలో జరిగిన ఘటన సాక్షి, హైదరాబాద్: స్నేక్ గ్యాంగ్ రేప్ తరహాలోనే కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలో మరో ఘోరం చోటుచేసుకుంది. 15 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి ఒకరిని పోలీసుల అరెస్టు చేయగా మరొకరు పరారీలో ఉన్నారు. గ్యాంగ్‌రేప్ కేసు రాజీ కుదుర్చుకోవాలని లేకుంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని పరారీలో ఉన్న నిందితుడు.. బాధితులను బెదిరిస్తున్నాడు. అయితే వారి బెదిరింపులకు భయపడకుండా బాధితురాలు తన తల్లితో కలిసి ఆదివారం పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాబానగర్‌కు చెందిన ఓ మహిళకు భర్త చనిపోవడంతో దుబాయ్‌లో పనిమనిషిగా చేస్తుంది. ఆమె 15 ఏళ్ల కూతురు బాబానగర్లోనే ఉంటుంది. స్థానికంగా ఉన్న ఒక టైలరింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటుంది. కూతురు బాగోగులు చూసేందుకు బంధువైన అయూబ్‌కు నెలనెలా ఆమె డబ్బులు పంపేది. కాగా, గత నెల 5వ తేదీన బాలిక శిక్షణ ముగించుకుని ఇంటికి వస్తుండగా అషఫ్ అలీ అలియాస్ చందు, అయూబ్‌లు ఆటోలో బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. అత్యాచార దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. ఈ విషయం ఎవరికైనా చెబితే యాసిడ్ పోస్తామని, కుటుంబ సభ్యులను హతమారుస్తామని బెదిరించారు. దీం తో భయపడిన బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే గత నెల 14న దుబాయ్ నుంచి తల్లి రావడంతో జరిగిన విషయాన్ని ఆమెతో చెప్పింది. దీంతో ఆమె కంచన్‌బాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చందు ( అషఫ్ ్రఅలీ)ను మాత్రమే అరెస్టు చేశారు. అయూబ్‌ను ఇప్పటివరకు అదుపులోకి తీసుకోలేదు. నిందితుడు అయూబ్ అతని అనుచరులు షకీల్, అసద్‌లు పోలీసులకు చిక్కకుండా కేసు రాజీ కుదుర్చుకోవాలని లేదంటే అత్యాచార దృశ్యాలను ఇంటర్నెట్లో పెడతామని బాధితురాలి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. నెల రోజుల నుంచి వీరి బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆదివారం తల్లికూతుళ్లు మళ్లీ పోలీసులను ఆశ్రయించి మరో ఫిర్యాదు చేశారు. అయూబ్‌ను వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. మరికొందరు బాధితులు అయూబ్, చందు( అషఫ్ రఅలీ)ల అనుచరుల చేతిలో పలువురు బాలికలు గ్యాంగ్‌రేప్‌కు గురయ్యారని తల్లి ఆరోపించింది. బాధితులు భయంతో ముందు కు రావడం లేదని, వీరి అరాచకాలను ఇకనైనా అడ్డుకోవాలని కోరుతోంది. వీరి బారిన పడిన కొంత మంది బాధితుల వివరాలను పోలీసులకు కూడా చెప్పాను. -
స్నేక్ గ్యాంగ్ కేసులో మరో నలుగురి అరెస్టు
హైదరాబాద్: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్‌గ్యాంగ్ వీడియో క్లిప్పింగ్‌లను మొబైల్ అప్లికేషన్ ‘వాట్సాప్’ ద్వారా షేర్ చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ సీసీఎల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్లో స్నేక్ ముఠా సభ్యులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిందితులు వీడియో తీసుకున్నారు. వాటిని గత నెల 31న ఒక లోకల్ టీవీ చానల్లో ప్రసారం చేయడంతో దానికి అందజేసిన మహ్మద్ అక్బర్ షరీఫ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ నెల 8న వీడియో క్లిప్పింగ్స్ షేర్ చేసినందుకు సయ్యద్ ఇమ్రాన్ అలీ (26), మహ్మద్ అలీముద్దీన్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ బిన్ సాలం (34), మహ్మద్ బిన్ ఇబ్రహీం (40), మోసిన్ బిన్ అల్ జాబ్రీ (50), హబీబ్ ఉస్మాన్ అల్కాప్ (45)లను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. -
దయానీ తల్లి పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్ : స్నేక్‌గ్యాంగ్‌లో సభ్యుడంటూ అరెస్ట్ చేసిన తన కుమారుడు ఫైజల్ దయానీని కోర్టు ఎదుట హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలంటూ అతడి తల్లి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌ను హైకోర్టు మంగళవారం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తన కుమారుడు దయానీని పహాడీషరీఫ్ పోలీసులు అక్రమంగా నిర్భందించారని, అతనిని కోర్టు ఎదుట హాజరు పరిచేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ తల్లి హుస్సేనీ గతవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, వివరణ నిమిత్తం కోర్టు ముందు హాజరు కావాలని పహాడీఫరీఫ్ పోలీసులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు వారు మంగళవారం ధర్మాసనం ముందు హాజరై ఓ నివేదికను కోర్టు ముందుంచారు. స్నేక్‌గ్యాంగ్‌లో ఫైజల్ దయానీ కూడా నిందితుడని, అతనిని అరెస్ట్ చేసి కోర్టు ఎదుట హాజరుపరచగా, కోర్టు అతడికి జుడీషియల్ కస్టడీ విధించిందని అందులో వివరించారు. దీంతో సంతృప్తి చెందిన ధర్మాసనం, హెబియస్ కార్పస్ పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది -
చక్రబంధంలో పహాడీషరీఫ్
స్నేక్‌గ్యాంగ్ నిందితుడి ఇల్లు సోదా సెర్చ్‌లో పాల్గొన్న 412 మంది పోలీసులు అతడి ఆస్తులను చూసి ఆశ్చర్యపోయిన సీపీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: బుధవారం తెల్లవారుజాము... అందరు గాఢ నిద్రలో ఉన్నారు. సుమారు 412 మంది పోలీసు అధికారులు పహాడీషరీఫ్‌లోని షాహిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలను చుట్టుముట్టారు. ఏ గల్లీలో చూసిన బూట్ల చప్పుళ్లు, టార్చ్లైట్ల వెలుగులు. సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్వయంగా నిర్వహించిన కార్డర్ సెర్చ్ అది. తెల్లవారు జాము 3 గంటలకు ప్రారంభమైన ఈ సెర్చ్ ఆపరేషన్ నాలుగు గంటలపాటు సాగింది. సెర్చ్ మొదలైన 15 నిమిషాలకు బస్తీవాసులు మేల్కొన్నారు. ఏమైందోనని కంగారు పడ్డారు...అసలు విషయం తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నారు. రాజమహల్.... స్నేక్ గ్యాంగ్ రేప్ కేసులో ప్రధాన నిందితుడు ఫైసల్‌దయానీ నివాసంపై దాడి చేసిన పోలీసుల కళ్లు బైర్లుకమ్మాయి. రెండున్నర ఎకరాల విశాల ప్రదేశంలో ఫైసల్ దయానీ ఇల్లు ఉంది. ఇందులో గుర్రాలు, మేకలు, బాతులు, కొంగలకు ప్రత్యేక షెడ్డులు నిర్మించి ఉన్నాయి. పక్కనే దయానీ పేరుతో పెద్ద స్విమ్మింగ్ ఫూల్ కూడా ఉంది. కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఉండడంతో కమిషనరే ఆశ్చర్యపోయారు. పనీపాట లేని వీరికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో ఎవరికి అంతుపట్టలేదు. రహస్య కోట మాదిరి తలపించే దాంట్లోనే బాకీదారులను కూడా బంధించి చితకబాదిన సంఘటనలు కూడా ఉన్నాయని పోలీసులకు సమాచారం అందింది. సెటిల్మెట్లకు ఇదే అడ్డాగా చేసుకున్నారని విచారణలో తేలింది. భూ కబ్జాలు, సెటిల్మెంట్ల ద్వారా ఆస్తులు సంపాదించారని పోలీసులు అంటున్నారు. -
‘స్నేక్’ కోరల్లో మరో ముగ్గురు
వెలుగు చూస్తున్న స్నేక్ గ్యాంగ్ ఆగడాలు హైదరాబాద్: స్నేక్‌గ్యాంగ్ మరో ముగ్గురు మహిళలపై కూడా గ్యాంగ్‌రేప్‌కు పాల్పడినట్లు పోలీ సుల విచారణలో తేలింది. పోలీసుల దర్యాప్తులో ఈ గ్యాంగ్ సెటిల్మెంట్ల పేరుతో వేధించిన ఘటనలు వెలుగు చూడడంతో మరో ఐదు కేసులు నమోదు చేశారు. బాధితులు ఫిర్యాదు చేస్తే వివరాలు రహస్యంగా ఉంచుతామని, తా ము అండగా ఉంటామని సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ హామీ ఇచ్చారు. బుధవారం తెల్లవారుజామున పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని షాయిన్‌నగర్, ఎర్రకుంట బస్తీలలో సీవీ ఆనంద్ నేతృత్వంలో పోలీసు అధికారులు కార్డన్ సెర్చ్(చక్రబంధంలో తని ఖీలు) నిర్వహించారు. స్నేక్‌గ్యాంగ్‌కు సహా య సహకారాలు అందించిన మరో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కార్డన్ సెర్చ్ లో స్నేక్‌గ్యాంగ్ వినియోగించిన రెండు గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 131 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్నేక్‌గ్యాంగ్ ఇళ్ల తనిఖీ: ఎర్రకుంటలోని స్నేక్‌గ్యాంగ్ ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇంటికి సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ వెళ్లి తనిఖీలు చేపట్టారు. దయానీ సోదరులు హమీద్, కాలేద్లను అదుపులోకి తీసుకోవడంతో పాటు అతని ఇంట్లో ఉన్న స్కార్పియో, వెస్పా, ఆక్టివా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్నేక్‌గ్యాంగ్‌లోని అలీ బారక్ బా, ఖాదర్ బారక్ బా(తండ్రి-కొడుకులు) ఇంటికి వెళ్లి పోలీ సులు తలుపులు తట్టారు. తలుపులు తెరవకపోవడంతో శంషాబాద్ ఏసీపీ ఆర్.సుదర్శన్ ఆరడుగుల ఎత్తున్న ప్రహరీ దూకి ఇంట్లోకి ప్రవేశిం చారు. మిగిలిన ఏడుగురు నిందితుల ఇళ్లల్లో కూడా కమిషనర్ సోదాలు జరిపారు. కార్డన్ సెర్చ్‌లో 412 మంది అధికారులు బస్తీల చుట్టూ అవుటర్ కార్డన్స్ ఏర్పాటు చేసుకొని సెర్చ్ పార్టీలు ఈ గాలింపు ప్రక్రియను ప్రారంభించాయి. ఒక ఇన్స్పెక్టర్, ఇద్దరు ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లు, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు ఉండే ఒక్కో సెర్చ్ టీమ్ 30 ఇళ్ల వరకు సోదాలు చేసింది. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు ప్రారంభమైన ఈ సోదాలు ఉదయం 7 గంటల వరకు కొనసాగాయి. కమిషనర్ సి.వి.ఆనంద్‌తో పాటు శంషాబాద్ డీసీపీ కె.రమేష్ నాయుడు, క్రైమ్ ఇన్‌ఛార్జి డీసీపీ జానకీ షర్మీల, నలుగురు ఏసీపీలు, 40 మంది ఇన్స్పెక్టర్లు, 90 మంది ఎస్సైలు, 200 మంది కానిస్టేబుళ్లు, 80 మంది మహిళా కానిస్టేబుళ్లు ఈ సెర్చ్‌లో పాల్గొన్నారు. కార్డన్ సెర్చ్‌లో పట్టుబడ్డ వివరాలు... ప్రధాన నిందితుడు ఫైసల్ దయానీ ఇద్దరు సోదరులు హమీద్, కాలేద్ రోడ్డు పై వెళ్లే ఒంటరి జంటల సమాచారాన్ని స్నేక్‌గ్యాంగ్ కు అందించే ఇన్ఫార్మర్స్ హబీబ్, ఆబేద్, షా రూక్, నయీం, బాబీ డాల్‌ను అరెస్ట్ చేశారు. రౌడీషీటర్లు బాలాపూర్ ఎంపీటీసీ అలీ అమ్‌షాన్, రూబీ, రియల్ చానల్ యజమాని యెమానీసహా 8 మందిని బైండోవర్ చేశారు. పోలీసుల కళ్లు గప్పి పారిపోతున్న ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. స్నేక్ గ్యాంగ్ ముఠా సభ్యుల నుంచి రెండు గుర్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని గోశాలకు తరలించనున్నారు. రౌడీయిజం చేస్తే బుల్లెట్ దిగుద్ది: కమిషనర్ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్ గ్యాంగ్ బాధితులెవరైనా ఉంటే నిర్భయంగా ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్ అన్నారు. ఫిర్యాదు చేస్తే వారికి భద్రత, భరోసా కల్పిస్తామన్నారు. పహాడీషరీఫ్ ఠాణాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫైసల్ దయానీ కొంత మందితో కలసి ముఠాగా ఏర్పడి ఒంటరిగా వెళుతున్న జంటలపై దాడులకు పాల్పడినట్లు విచారణలో తేలిందన్నారు. భయంతో బాధితులు ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేకపోయారన్నారు. స్నేక్గ్యాంగ్పై ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ గ్యాంగ్‌లో ఇప్పటికే తొమ్మిది మందిని అరెస్ట్ చేయగా, మరో 13 మంది ముఠాలో పని చేస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. ఇప్పటి వరకు మూడు అత్యాచార ఘటనలు తమ దృష్టికి వచ్చాయన్నారు. కమిషనరేట్ పరిధి లో ఇప్పటి వరకు సూరారం కాలనీ, పాపిరెడ్డి కాలనీ, గబ్బిలాల్ పేట, శ్రీరాం కాలనీలలో కార్డన్ సెర్చ్ చేశామన్నారు. ఈ సెర్చ్ ద్వారా నేరస్తులలో భయం ఏర్పడుతుందన్నారు. ఎవరైనా రౌడీయిజానికి పాల్పడితే బుల్లెట్ రుచి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇలాంటి సెర్చింగ్లు మరిన్ని చేయాలని ఇన్స్పెక్టర్ పి.శ్రీధర్‌కు కమిషనర్ సూచించారు. -
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
-
స్నేక్ గ్యాంగ్ దయానీ సోదరులు అరెస్ట్
హైదరాబాద్: నేరస్థుల్లో భయం కల్పించేందుకే పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయినగర్‌లో గత అర్థరాత్రి నుంచి సోదాలు నిర్వహించినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. దాదాపు 420 మంది పోలీసులతో 800 నివాసాలను సోదా చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా పాములతో బెదిరించి మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న స్నేక్ గ్యాంగ్ ప్రధాన నిందితుడు దయానీ ఇంట్లో సోదా చేసినట్లు తెలిపారు. దయానీ సోదరులు అమీద్, కాలీజ్తోపాటు మరో ఐదుగురు అనుచరులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. స్నేక్ గ్యాంగ్‌తో సంబంధం ఉన్న కొంతమందిని గుర్తించామని చెప్పారు. వారిని సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామన్నారు. స్నేక్‌గ్యాంగ్ కేసులో ఇప్పటివరకు ఐదు ఫిర్యాదులు అందాయన్నారు. -
స్నేక్‌గ్యాంగ్ వీడియో క్లిప్పింగ్స్ కలకలం
హైదరాబాద్ : స్నేక్‌గ్యాంగ్ లైంగిక దాడులకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ ప్రసారం చేసిన మెగా టీవీ ఛానల్‌పై సైబర్ క్రైమ్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఇన్‌ఛార్జి డీసీపీ జానకీ షర్మిల తెలిపారు. అలాగే వీటిని "వాట్సప్"లో పంపిపవారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఈ దృశ్యాలు ఎవరి ఫోన్లో ఉన్నా వెంటనే డిలీట్ చేయాలని జానకీ షర్మిల హెచ్చరించారు. ఈ వీడియో క్లిప్పింగ్స్ ఎవరు పంపించారు? ఎవరెవరికి చేరాయి అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలపాలని జానకీ షర్మిల ప్రజలను కోరారు. -
అతివకు అభయమేదీ?
ఆగని అఘాయిత్యాలు మొన్న ఫామ్‌హౌస్‌లో స్నేక్‌గ్యాంగ్ అకృత్యం నిన్న మేడిపల్లిలో ఆటోగ్యాంగ్ దారుణం శనివారం అర్ధరాత్రి కూకట్‌పల్లిలో ఘోరం ఆందోళనరేకెత్తిస్తున్న ఘటనలు నేరాల అదుపులో పోలీస్ వైఫల్యం మూడేళ్లలో లైంగిక దాడులు 521 శిక్షలు పడింది నలుగురికే... సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో నేరగాళ్లు విజృంభిస్తున్నారు. అఘాయిత్యాలు, అకృత్యాలను నిరాటంకంగా కొనసాగిస్తూ పోలీసులకే సవాల్ విసురుతున్నారు. ఫలి తంగా మహిళలకు రక్షణ కరువైంది. గ్రేటర్ పరిధిలో నిత్యం చోటుచేసుకుంటున్న ఘటనలు జలదరింప చేస్తున్నాయి. పాలకులు హైదరాబాద్‌కు విశ్వఖ్యాతిని తీసుకొస్తామని.. నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నా అకృత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇటీవల పహాడీషరీఫ్ ఫామ్‌హౌస్‌లో ఓ యువతిపై... రెండు రోజుల క్రితం మేడిపల్లి అటవీ ప్రాంతంలో గిరిజన యువతిపై గ్యాంగ్ రేప్.. ఈ ఘటనలను మరువక ముందే శనివారం అర్ధరాత్రి కూకట్పల్లి ప్రాంతంలో ఓ మహిళపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది. అంతటితో ఆగకుండా దారుణంగా హత్య చేశారు. కఠిన శిక్షలు పడకపోవడంతో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. 2011 నుంచి 2013 వరకు జంట పోలీసు కమిషనరేట్లలో మహిళలపై జరిగిన దారుణాలకు సంబంధించి 10,557 కేసులు నమోదయ్యాయి. ఇందులో లైంగిక దాడికేసులు 521 ఉన్నాయి. మరోవైపు చోరీలు, చైన్ స్నాచింగ్‌లూ సర్వసాధారణంగా మారాయి. యువతులు, మహిళలు బయటకు వెళ్తే వారి ఒంటిపై ఉండే ఆభరణాలకే కాదు వారి ప్రాణాలకూ భద్రత లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా నివారించడంలో పోలీసులు విఫలమవుతున్నారు. నగరంలో 504 మంది మహిళా పోలీసులు అవసరం ఉండగా కేవలం 273 మంది మాత్రమే ఉన్నారు. సాగని కేసుల దర్యాప్తు.. నిర్భయ వంటి కఠిన చట్టాన్ని రూపొందించినా మృ గాళ్లలో మార్పు రావడం లేదు. అత్యాచారాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. అదే సమయంలో కేసుల దర్యాప్తులో తీవ్ర జాప్యం జరుగుతోంది. దుండగులకు సకాలంలో శిక్షలు పడకపోవడంతో వారు మరింత రెచ్చిపోతున్నారు. గత మూడేళ్లలో లైంగిక దాడులకు సంబంధించి 521 కేసులు నమోదు కాగా, కేవలం నలుగురికి మాత్రమే శిక్ష పడింది. పోలీసుల దర్యాప్తు తీరు సరిగా లేనందునే ఈ పరిస్థితి ఎదుర వుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరస్తులకు తగిన శిక్ష పడితే నేరాల శాతం తగ్గుతుందని వివిధ వర్గాల వారు అభిప్రాయ పడుతున్నారు. సంఘటన జరిగినప్పుడు పోలీసులు హడావుడి చేయడం, ఆ తరువాత సాక్ష్యాధారాలను సేకరించడంలో విఫలమవుతుండడంతో నిందితులు కేసుల నుంచి సులువుగా బయటపడుతున్నారనే వాదన ఉంది. -
స్నేక్గ్యాంగ్పై ఐదు కేసులు నమోదు
పాములు చూపించి బెదిరించి సామూహిక అత్యాచారం చేసిన స్నేక్గ్యాంగ్పై ఇప్పటి వరకు ఐదు కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఈ ముఠా సభ్యులను పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ ముఠాకు చెందిన దయానీతో పాటు మరో నిందితుడిని కూడా పహాడిషరీఫ్ పోలీసులు కోర్టుకు తీసుకెళ్లారు. స్నేక్‌గ్యాంగ్ మీద ఇప్పటివరకు ఐదు కేసులు నమోదుచేసినట్లు పహాడిషరీఫ్ పోలీసులు తెలిపారు. సామూహిక అత్యాచారం, వ్యక్తిని తీవ్రంగా కొట్టడం, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, బెదిరింపుల కేసు, భూ కబ్జా కేసులు ఈ గ్యాంగు మీద నమోదయ్యాయి. కాగా, స్నేక్‌గ్యాంగ్ సభ్యులకు వచ్చేనెల నాలుగో తేదీ వరకు రిమాండ్ విధించారు. -
స్నేక్ గ్యాంగ్‌పై ఐదు కేసులు నమోదు
-
స్నేక్‌గ్యాంగ్‌ను ఉరి తీయాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత లక్ష్మణ్ హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో 11 మంది మహిళలపై సామూహిక అత్యాచారాలకు పాల్పడిన స్నేక్‌గ్యాంగ్‌ను నిర్భయ కేసు మాదిరిగా నిర్దాక్షిణ్యంగా ఉరి తీయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్, అధికార ప్రతినిధి ప్రకాష్‌రెడ్డి, కార్పొరేటర్లు దిడ్డిరాంబాబు, జి.శంకర్‌యాదవ్‌లతో కలసి మాట్లాడారు. నగరంలో విచ్చలవిడిగా మహిళలపై అత్యాచారాలకు , కబ్జాలకు పాల్పడుతున్న స్నేక్‌గ్యాంగ్‌కు మజ్లిస్ పార్టీ అండ ఉన్నట్లు పత్రికల్లో వచ్చిన కథనాలతో స్పష్టమవుతుందన్నారు. నగరంలో ఎక్కడ జంటలు కనిపించినా వారిని వెంబడించి వారి జీవితాలను విషనాగుల్లా కాటేస్తున్న వీరు సమాజంలో జీవించే హక్కును కోల్పోయారని పేర్కొన్నారు. ఏ పార్టీ అడ్డు వచ్చినా, ఎవరు ఒత్తిడి తెచ్చినా భయపడకుండా స్నేక్‌గ్యాంగ్‌కు ఉరిశిక్షను అమలు చేయాలని, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇలాంటి దౌర్జన్యాలు, అత్యాచార ఘటనలు పునరావృతం కాకుండా నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నష్టాల వల్లే రైతుల ఆత్మహత్యలు నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాభావ పరిస్థితులకు తోడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నికల ముందు 8 గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, ఇంటింటికీ ఉద్యోగమిస్తామని వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. అధికారం చేపట్టిన తర్వాత చేసిన వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. అప్పులు తెచ్చి విత్తనాలు వేసిన రైతులు వర్షాభావ పరిస్థితులతో నష్టాల పాలై ఆందోళన తో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 120 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. కనీసం ఆత్మహత్యలకు పాల్పడిన బాధితుల కుటుంబాలను పరామర్శించే స్థితిలో కూడా ప్రభుత్వం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నికపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలను పరిష్కరించడంలో లేదన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల కారణంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు, పింఛన్లు, రైతుల రుణమాఫీ తదితర అన్ని పథకాలు వుూలన పడ్డాయుని ధ్వజమెత్తారు. నగరంలోని 30 ప్రాథమిక వైద్యశాలలతో పాటు అనేక ప్రభుత్వ పాఠశాలలు, ఎస్సీ, బీసీ హాస్టళ్లలో విద్యుత్ బిల్లులు కట్టలేదన్న కారణంగా విద్యుత్ సరఫరాను కట్ చేశారన్నారు. హాస్టళ్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోతే విద్యార్థులు చదువులెలా కొనసాగిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
స్నేక్ గ్యాంగ్ వెనక ఎంఐఎం హస్తం
హైదరాబాద్ : నగరంలో సంచలం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ వెనక ఎంఐఎం హస్తం ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. స్నేక్‌గ్యాంగ్‌కు బతికే హక్కు లేదని ఆయన గురువారమిక్కడ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిపాలనకు జ్వరం వచ్చిందని కిషన్ రెడ్డి విమర్శించారు. మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి తెలంగాణ వాది అని, అక్కడ ప్రజలు, రైతులు తమకు ఉండగా ఉంటారని ఆయన జోస్యం చెప్పారు. ఇక ప్రధానమంత్రి 'జన్‌ధన్' యోజన పథకం అద్భుతమైనదని కిషన్ రెడ్డి ప్రశంసించారు. -
నగరంలో మృగాళ్లు
నారపల్లిలో వివాహితపై సామూహిక అత్యాచారం హైదరాబాద్: పహాడీషరీఫ్‌లో స్నేక్ గ్యాంగ్ పాల్పడిన దారుణ ఉదంతాన్ని మరిచిపోక ముందే మరో అకృత్యం చోటుచేసుకుంది. ఉపాధి కోసం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి నగరానికి వచ్చిన ఓ అమాయక గిరిజన వివాహితపై ఐదుగురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వెంట ఉన్న భర్త, మరిదిలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి ఈ అకృత్యానికి ఒడిగట్టారు. రాత్రింబవళ్లు వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే హైదరాబాద్-వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో మంగళవారం ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎల్లంకి రవికిరణ్‌రెడ్డి కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా లింగాల గ్రామానికి చెందిన వివాహిత(21), ఆమె భర్త, మరిది కూలీ పని కోసం తమ పొరుగు గ్రామానికి చెందిన శ్రీనివాస్ సహకారంతో భువనగిరికి వచ్చారు. శ్రీనివాస్ వారం రోజుల క్రితం ఈ ముగ్గురుతోపాటు మరో నలుగురిని నగరంలోని ఉప్పల్‌కి తీసుకొచ్చాడు. ఏడుగురిని భువనగిరికి చెందిన బాలస్వామి అనే కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిర్చాడు. మంగళవారం భువనగిరిలో పనిలో చేరాల్సి ఉండడంతో, సోమవారం నలుగురు వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సోమవారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఒక ఆటోలో భువనగిరికి బయలుదేరారు. ఉప్పల్‌లో వీరి కదలికలను గమనిస్తున్న ఐదుగురు వ్యక్తులు ఆటోను వెంబడించినట్లు సమాచారం. నారపల్లికి చేరుకోగానే ఆ ఐదుగురు ఆటోను చుట్టుముట్టారు. ఆటోలో ఉన్న ముగ్గురిని బయటకు లాగారు. మరో ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం వెళ్లాక, భర్త, మరిదిని రోడ్డు పక్కకు తోసేశారు. అంతేగాక తీవ్రంగా భయపెట్టారు. యువతిని సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి ఐదుగురు యువకులు ఆమెపై అత్యాచారం చేసి పారిపోయారు. సంఘటన స్థలం నుంచి తిరిగి వచ్చిన ఆ యువతి తమ భర్త, మరిది ఉన్న స్థలానికి చేరుకుంది. జరిగిన దారుణాన్ని భర్త, మరిదిల సహాయంతో బోరున విలపిస్తూ స్థానికులకు చెప్పింది. దీంతో వారు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లిన మేడిపల్లి పోలీసులు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
స్నేక్ గ్యాంగ్ ఆగడాలు ఒక్కొక్కటిగా..
-
కుంభిపాకమే కరెక్ట్!
ఆ దుర్మార్గులను ఉరితీయండి. కాల్చి చంపడమే సరైన శిక్ష. కుంభిపాకమే(సలసల కాగే నూనెలో వేసి చంపడం) కరెక్ట్. విషనాగులతో కాటేయించి చంపాలి. చెన్నై స్నేక్ పార్కులో వదిలేయాలి. యాసిడ్ పోసి కాటికి పంపాలి. ఇలాంటి వాళ్లను ముందు చంపిన తర్వాతే మాట్లాడాలి... 'స్నేక్ గ్యాంగ్'పై సామాజిక సంబంధాల మాధ్యమంలో వెల్లువెత్తిన ఆగ్రహం ఇది. సభ్యసమాజం తల దించుకునేలా సామూహికంగా ఓ మగువ మానాన్ని మంటగలిపిన మదాంద కామాంధులను నేరుగా కాటికి పంపడమే సరైన శిక్ష ముక్తకంఠంతో నినదిస్తున్నారు జనం. హైదరాబాద్ పహాడీషరీఫ్‌లో కాబోయే భర్త ఎదుటే ఓ యువతిపై ఏడుగురు రాక్షకులు కీచక పర్వం సాగించారన్న వాస్తవం వెలుగులోకి రావడంతో జనం రగిలిపోతున్నారు. కాలనాగులతో బెదిరించి దుశ్శాసన పర్వానికి ఒడిగట్టిన పరమ దుర్మార్గులు- ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్‌బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్‌ల పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. గతంలోనే ఎన్నో దారుణాలకు పాల్పడ్డారన్న నిజం గగుర్పాటు గొల్పుతోంది. హత్యలు, దారి దోపిడీలు, దొంగతనాలు, దౌర్జన్యాలు వీరి ఖాతాలో ఉన్నాయంటే ఎంతగా బరి తెగించారో అర్థమవుతోంది. చేసిన అకృత్యాలకు సిగ్గుపడడం పోయి సెల్ఫోన్లలో వాటిని చిత్రీకరించడం 'స్నేక్ గ్యాంగ్'కు అలవాటు. నగ్నంగా ఫోటోలు తీసి బెదిరించడం, రౌడీయిజం చేయడం వీరి నైజం. ఎంతోమంది అబలలు వీరి ఆగడాలకు బలైపోయారు. బెదిరింపులకు భయపడి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఇన్నాళ్లకు వీరి పాపం పండింది. తనకు జరిగిన అవమానాన్ని దిగమించి బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పాపాల భైరవులకు సంకెళ్లు పడ్డాయి. చేసిన పాపాలకు కనీస పశ్చాత్తపం కూడా కనబరచని కాలనాగులకు కఠిన శిక్ష వేయాలని యావత్ జనం నినదిస్తున్నారు. రాక్షసానందంతో అత్యాచారకాండ సాగించిన అనకొండాలను అంతం చేయడమే సరైన శాస్తి అంటున్నారు!