హైదరాబాద్: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన స్నేక్‌గ్యాంగ్ వీడియో క్లిప్పింగ్‌లను మొబైల్ అప్లికేషన్ ‘వాట్సాప్’ ద్వారా షేర్ చేసుకుంటున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ సీసీఎల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. జూలై 31న పహాడీషరీఫ్ షాయిన్ నగర్‌లో స్నేక్ ముఠా సభ్యులు యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనను నిందితులు వీడియో తీసుకున్నారు.
వాటిని గత నెల 31న ఒక లోకల్ టీవీ చానల్‌లో ప్రసారం చేయడంతో దానికి అందజేసిన మహ్మద్ అక్బర్ షరీఫ్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అతనితో పాటు ఈ నెల 8న వీడియో క్లిప్పింగ్స్ షేర్ చేసినందుకు సయ్యద్ ఇమ్రాన్ అలీ (26), మహ్మద్ అలీముద్దీన్ (45)లను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా కింగ్‌కోఠికి చెందిన సయ్యద్ బిన్ సాలం (34), మహ్మద్ బిన్ ఇబ్రహీం (40), మోసిన్ బిన్ అల్ జాబ్రీ (50), హబీబ్ ఉస్మాన్ అల్కాప్ (45)లను సీసీఎస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
స్నేక్ గ్యాంగ్ కేసులో మరో నలుగురి అరెస్టు
Published Sat, Sep 13 2014 1:07 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement