మొన్న పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అత్యాచారం సంఘటన మరవక ముందే మళ్లీ పెద్ద అంబర్‌పేటలో అత్యాచారం!
మొన్న పహాడీ షరీఫ్ స్నేక్ గ్యాంగ్ అత్యాచారం సంఘటన మరవక ముందే మళ్లీ పెద్ద అంబర్‌పేటలో అత్యాచారం! నగరంలో రోజూ ఏదో ఒక అత్యాచారమో, కాల్పులో, దోపిడీయో వరుసగా జరుగుతుండటం తో నగర ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదేరీతిలో పోలీసులకు కూడా కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు. ఇక్కడా అక్కడా అని తేడా లేకుండా నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇక మహిళలపై జరిగే అకృ త్యాలు చెప్పనక్కరలేదు. మరోప్రక్క పిల్లల కిడ్నాప్‌లు, ఇలా చెప్పు కుంటూపోతే నేరాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఎక్కడి కేసులక్కడే! ఏ క్షణాన, ఏమి ఆపద ముంచుకొస్తోందో అని ప్రజలు భయ భ్రాంతుల వుతున్నారు. పైగా సిబ్బంది కొరతను అవకాశంగా తీసుకుని నేరగాళ్లు రెచ్చిపోవడం, పోలీసులకు పెనుసవాలుగా మారింది. ఎన్ని చట్టాలు చేసినా, ఎక్కడి కేసులు అక్కడే మూలుగుతున్నాయి. పోలీసుశాఖలో ఖాళీలను భర్తీ చేస్తే నేరాల సంఖ్య కొంత వరకూ అరికట్టవచ్చు.
శొంటి విశ్వనాధం, చిక్కడపల్లి, హైదరాబాద్