Watch: Man Kissing King Cobra On Its Head, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Video Viral: భయానక స్టంట్‌: ఏకంగా కింగ్‌ కోబ్రా తలపై ముద్దు

Oct 21 2022 3:38 PM | Updated on Oct 21 2022 6:07 PM

Viral Video: Man Kissing King Cobra On Its Head - Sakshi

ఇటీవల కాలంలో పాములతో రకరకాల స్టంట్‌లు చేస్తున్నారు. ఆ స్టంట్‌లలో చాలా వరకు బెడిసి కొట్టిన ఘటనలే చూశాం. అదీగాక విషసర్పలతో కామెడీ చేస్తే ప్రాణాలకే ముప్పు అని చాలా విషయాల్లో ప్రూవ్‌ అయ్యింది కూడా. ఇటీవలే ఒక వ్యక్తి నాగుపాము నుదుట ముద్దు పెట్టుకోబోతే రివర్స్‌లో కాటేసిన సంఘటన చూశాం. అయిన పలువురు స్నేక్‌ క్యాచర్లు ఇలాంటి స్టంట్‌లే చేస్తున్నారు. ఇక్కడొక స్నేక్‌ క్యాచర్‌ ఏకంగా కింగ్‌ కోబ్రా తలపై ముద్దు పెట్టే స్టంట్‌ చేశాడు. 

వివరాల్లోకెళ్తే..ఈ హార్ట్‌ రైజింగ్‌ స్టంట్‌ వీడియోని సౌరబ్‌ జాదవ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ వీడియోలో ఒక వ్యక్తి కింగ్‌ కోబ్రా తలపై ముద్దు పెట్టుకునే స్టంట్‌ చేశాడు. ఈ స్టంట్‌ చేసిన వ్యక్తి వావా సురేష్‌ అనే కేరళ వాసి. అతను ఇప్పటివకరకు సుమారు 38 వేల విషసర్పాలను పట్టుకున్నాడు. మూడువేల సార్లుకు పైగా పాము కాటుకి గురయ్యాడు. అంతేగాదు సుమారు 190కి పైగా కింగ్‌ కోబ్రాలను రక్షించాడు. దీంతో అతన్ని అందరూ కేరళ స్నేక్‌ మ్యాన్‌గా పిలుస్తుంటారు. అసలు ఈ వీడియో చూస్తే.. అతను ఎలా ఉన్నా టెన్షన్‌తో చూస్తున్న మనకు గుండె ఆగిపోయినంత భయం వేస్తుంది. 

(చదవండి: మానవత్వం అంటే ఇది కదా! రోడ్లపై చెత్త కాగితాలు ఏరుకుంటున్న ఆమెను..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement