
తలసాని, తుమ్మల తెలంగాణ భక్తులా : జగ్గారెడ్డి
కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ భక్తుడా అని కాంగ్రెస్ నేత జయప్రకాశ్‌రెడ్డి (జగ్గారెడ్డి) ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా పనిచేసిన తుమ్మల నాగేశ్వర్‌రావు, మహేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి వంటి వారిని మంత్రివర్గంలో చేర్చుకున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు అసలైన తెలంగాణ ద్రోహి అని విమర్శించారు. తెలంగాణ వచ్చాక కూడా ఆంధ్రా కాంట్రాక్టర్లకు భారీ కాంట్రాక్టులు ఇస్తూ, తెలంగాణలో నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులకు మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. మల్లన్నసాగర్‌లో భూములు కోల్పోతున్నవారికి న్యాయం చేయాలని కోరితే పట్టించుకోకుండా నిర్బంధించాల్సిన అవసరం ఏముదందని ప్రశ్నించారు.