
జనం అవస్థలు ప్రధానికి పట్టవా?: జగ్గారెడ్డి
పెద్దనోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి అన్నారు.
సంగారెడ్డి రూరల్: పెద్దనోట్ల రద్దుతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి జగ్గారెడ్డి అన్నారు. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ శనివారం ఆయన సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి రాస్తారోకో నిర్వహిం చారు.
ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లా డుతూ.. బ్యాంకుల వద్ద ప్రజలు బారులు తీరి ఇబ్బందులు పడుతుంటే.. విదేశీ పర్యటనలతో ప్రధాని రాజభోగాన్ని అనుభవిస్తున్నారని విమర్శించారు. ఉభయ సభల్లో ప్రతిపక్షాలకు జవాబు చెప్పలేక తప్పించుకుంటున్నారని ఆరోపించారు. 28న నిర్వహించే భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.