
జగ్గారెడ్డి ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలింపు
పటాన్‌చెరు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన అనుచరులను పోలీసులు జి.ఎం.ఆర్ ఫంక్షన్‌హాల్ వద్ద అరెస్టు చేశారు.
పటాన్‌చెరు టౌన్ : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు పటాన్‌చెరు వచ్చిన కాంగ్రెస్ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఆయన అనుచరులను పోలీసులు జి.ఎం.ఆర్ ఫంక్షన్‌హాల్ వద్ద అరెస్టు చేశారు. మల్లన సాగర్ నిర్వాసితులతో ప్రధాని మోడీని కలిసేందుకు తమకు అనుమతి ఇవ్వకపోతే ప్రధాని పర్యటనను అడ్డుకుంటానని జగ్గారెడ్డి గతంలో చేసిన ప్రకటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మోడీ పర్యటనకు ఎటువంటి విఘాతం కలుగకుండా జగ్గారెడ్డితోపాటూ ఆయన అనుచరులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని, ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జగ్గారెడ్డి అరెస్టు వార్త విన్న ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంద్రకరణ్ పోలీస్‌స్టేషన్‌కు తరలివెళ్లారు.