తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గన్న! | Turpu Jayaprakash Reddy to join congress soon! | Sakshi
Sakshi News home page

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గన్న!

Published Thu, Apr 23 2015 2:17 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గన్న! - Sakshi

తిరిగి కాంగ్రెస్ గూటికి జగ్గన్న!

మెదక్ : మెదక్‌ జిల్లా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరనున్నారు. మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలపుడు ఆయన కాంగ్రెస్‌ను వీడి  బిజెపిలో చేరి ఎంపీగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలో టిఆర్‌ఎస్‌ గెలుపొందగా రెండో స్ధానంలో కాంగ్రెస్‌ నిలిచింది. దాంతో బిజెపిలో జగ్గారెడ్డికి ప్రాధాన్యత తగ్గింది.

ఈ నేపథ్యంలో మెదక్‌ ఉపఎన్నిక కోసం బిజెపి తన ఇమేజ్‌ను వాడుకొని వదిలేసిందని వాపోతున్న జగ్గారెడ్డి  కొంత కాలంగా తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మెదక్‌ డిసిసి చీఫ్‌గా ఉన్న మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి కూడా జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరడానికి అంగీకరించారని సమాచారం. ఈ నెల 29న పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్‌కు వస్తున్నందున అదే రోజు గాంధీ భవన్‌లో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement