సమైక్యవాదులని అంటే చెప్పుతో కొడతాం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పైన, టీఆర్ఎస్ పార్టీ పైన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మరొక్కసారి తమను సమైక్యవాదులని అంటే చెప్పుతో కొడతామని హెచ్చరించారు. మెదక్ జిల్లా గజ్వేల్లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో వాళ్లు మాట్లాడారు.
మెదక్లో ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే, ఫాంహౌస్లో కేసీఆర్ ముందు సోడా పోయడానికే పనికొస్తాడని, కవిత బ్యాగులు మోయడానికే పనికొస్తాడు తప్ప.. పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారానికి పనికిరాడని అన్నారు. తమను ఎవరైనా విమర్శిస్తే బంతాడుకుంటామని జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి విమర్శించారు.