సభ్యత్వ నమోదుపై జరిగిన సమావేశంలో అంజన్, బోసురాజు, రేవంత్, మహేశ్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేర్పించిన సభ్యత్వాల సంఖ్యను చూసి సీఎం కేసీఆర్ భయపడ్డారని, అందుకే ప్రశాంత్‌కిశోర్ (పీకే)ను తెచ్చుకున్నారని, కేసీఆర్‌కు పీకే ఉంటే కాంగ్రెస్ పార్టీలో 40 లక్షల మంది ఏకే 47 లాంటి వాళ్లు న్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఇక్కడి గాంధీభవన్‌లో ఆయన సమీక్షించారు. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్నారని, పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పడానికి ఇదే తార్కాణమని, ఈ పరిస్థితిని అందిపుచ్చుకునేందుకు నేతలు సిద్ధం కావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో, దేశంలో నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదయ్యాయని చెప్పారు. ఇప్పటివరకు అయిన 40 లక్షల సభ్యత్వాలను 50 లక్షల వరకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కనీసం 30 వేల మందిని పార్టీ సభ్యులుగా చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.
చదవండి: (సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ షర్మిల ట్వీట్)
80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్‌దే అధికారం
రాష్ట్రవ్యాప్తంగా 80 లక్షల ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని రేవంత్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశా రు. పార్టీ సభ్యులకు రూ.2 లక్షల బీమా సౌకర్యం ఉంటుందని చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించేందుకు సభ్యత్వ నమోదును ప్రామాణికంగా తీసుకుంటున్నామని, ఇందులో క్రియాశీల కంగా లేని వారికి ఎలాంటి పదవులు రాబోవని చెప్పారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి వంద మంది సభ్యులు ఉంటేనే ఆ నియోజకవర్గం నుంచి పీసీసీ సభ్యులు ఉంటారన్నారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, లోక్‌సభ నియోజకవర్గాల సమన్వయకర్తలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment