
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదని, సంస్థాగతంగా ఇంకా బలంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి కోసం మొదటిసారి ఇలా అభిప్రాయ సేకరణ జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని తెలిపారు. ఈసారి పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా కాంపిటీషన్ ఉందని, రేసులో తనతో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు. మరోవైపు పీసీసీ అధ్యక్షుడి నియామకంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఈ విషయంపై నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ఇంచార్జ్ మానిక్కమ్ ఠాగూర్ హైదరాబాద్ రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కోర్ కమిటీ సమావేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయ సేకరణ తీసుకొని పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు. అనేకమంది అశావహులు ఉన్న నేపథ్యంలో పీసీసీ ఎవరికి వరిస్తుందనే ఆసక్తి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment