సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్‌ను పెంచాయి. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై అటు కాంగ్రెస్ పార్టీ నేతలు, బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు స్పందిస్తూ కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌తో పొత్తకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. కాంగ్రెస్‌లో ముఖ్య నాయకుడు.. పార్టీలో కోవర్డులు ఉన్నారని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో స్టార్లు, సూపర్ స్టార్లు ఇలా మాట్లాడుతుంటే ఎవరికీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు. కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాహుల్ గాంధీ చెప్పిందే ఫైనల్. బీజేపీకి మాపై ఆరోపణలు చేస్తే అర్హత లేదు. కేంద్రం తెచ్చిన బిల్లులకు బీఆర్‌ఎస్ మద్దతు ఇచ్చింది. బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి పనిచేశాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తోనే కాంగ్రెస్ పోరాటం అని స్పష్టం చేశారు.
మరోవైపు.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై మల్లు రవి కూడా స్పందించారు. మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తుందనడం హాస్యాస్పదం. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం. గతంలో కోమటిరెడ్డికి షోకాజ్‌నోటీసులు ఇస్తే చెత్తబుట్టలో వేశారు. రాజగోపాల్ రెడ్డి బీజేపీ తరఫున పోటీ చేసినప్పుడు కాంగ్రెస్‌కు నష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ సాధిస్తుంది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌కు నష్టం చేసేలా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ కేడర్‌ను గందరగోళంలో పడేశాయి. పార్టీని రక్షించాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇదిలా ఉండగా.. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా తప్పుపట్టారు. అటు టీపీసీసీ రేవంత్ రెడ్డి వర్గం కూడా కోమటిరెడ్డి వ్యాఖ్యలను ఖండించింది.
Comments
Please login to add a commentAdd a comment