తూర్పు అటు... చాగండ్ల ఇటు!
హైదరాబాద్: మెదక్ ఉప ఎన్నిక నేపథ్యంలో రాజకీయ నాయకుల వలసలు ఊపందుకున్నాయి. నేతలు అటు ఇటు పార్టీలు మారుతున్నారు. చివరి నిమిషంలో పార్టీ మారి తూర్పు జయప్రకాష్ రెడ్డి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. పార్టీ మారిమారగానే ఎంపీ అభ్యర్థిగా కూడా నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆయనకు బీజేపీ 'టిక్కెట్'తో స్వాగతం పలికింది.
జగ్గారెడ్డి ఇచ్చిన షాకుతో బీజేపీ నాయకులు కారు ఎక్కారు. సాధారణ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన చాంగడ్ల నరేంద్రనాథ్- గులాబీ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ సీరియర్ నేత ఫరీదుద్దీన్, స్వామిచరణ్ కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.