సాక్షి, హైదరాబాద్ : రిజిస్ట్రేషన్ శాఖను రీసెర్చ్ సెంటర్ లాగా మార్చుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. గత పది నెలలుగా తెలంగాణలో రిజిస్ట్రేషన్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. ఆస్తులను కాపాడేందుకు ధరణి తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. అయితే గతంలో బ్రిటిష్, నిజాం కాలం నుంచి ఆస్తులకు భద్రత లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. . ఆస్తుల వివరాలు మీకెందుకు అని అధికారులను జనం నిలదీశారని, సీఎం తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. అధికార యంత్రాంగం ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తోందని, అధికారులు పిచ్చి ఆలోచనలు మానుకోవాలని హితవు పలికారు. అధికారుల మాటలు విని సీఎం చెడ్డ పేరు తెచ్చకోవద్దని, ఎల్‌ఆర్‌ఎస్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. (‘సొంతిల్లు స్వంతమవుతుందని అనుకోలేదు’)
కరోనా కాలంలో ట్రీట్‌మెంట్‌కు ఆస్తులను కుదవ పెట్టుకుందామన్నా, ఆఖరికి పెళ్లిలకు కూడా డబ్బు అవసరమైతే.. ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని ధ్వజమెత్తారు. ధరణి లోని ఆస్తులను చూపించి.. అప్పులు తెస్తారేమోనని అనుమానం కలుగుతోందని జగ్గారెడ్డి అన్నారు. పాత పద్ధతి లో రిజిస్ట్రేషన్ ఉంటదని చెప్పి జీవోలో వంద కండీషన్లు పెట్టారు..ప్రభుత్వ తీరుతో రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిందని ఆరోపించారు. తక్షణమే రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎల్.ఆర్.ఎస్ విషయంలో కూడా ప్రజల బాధలను అర్థం చేసుకోవాలని, లేదంటే ప్రజల ఉసురు తగిలి ప్రభుత్వం కుప్పకూలుతుందని మండిపడ్డారు. (సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట)
Comments
Please login to add a commentAdd a comment