
జగ్గారెడ్డి
మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి) పై సంగారెడ్డి కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
హైదరాబాద్: మెదక్ లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగ్గారెడ్డి(తూర్పు జయప్రకాశ్ రెడ్డి) పై సంగారెడ్డి కోర్టు నాన్బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. టిఆర్ఎస్ కార్యకర్తలపై దాడి కేసులో ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో వారెంట్ జారీ చేశారు.
సదాశివపేటలో ఒక వ్యక్తిని కొట్టినందుకు, సంగారెడ్డిలో టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినందుకు, సిద్దిపేటలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై కేసులు నమోదయ్యాయి. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు జగ్గారెడ్డిపై సిద్దిపేటలో కూడా ఓ కేసు నమోదైంది.
**