సాక్షి,హైదరాబాద్: జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి వ్యవహారంపై మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(అక్టోబర్ 23) స్పందించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి మర్డర్‌పై సీరియస్‌గా ఉన్నామన్నారు. మర్డర్ ఎవరు చేసినా ఎవరు చేయించినా వదిలేది లేదన్నారు. జిల్లా ఎస్పీతో ఈ విషయమై ఇప్పటికే మాట్లాడామన్నారు.
‘జీవన్ రెడ్డితో ఇప్పటికే పీసీసీ చీఫ్ మాట్లాడారు. జీవన్‌రెడ్డితో నేను కూడా మాట్లాడుతా. జీవన్‌రెడ్డి పార్టీలో అత్యంత సీనియర్ నేత.. ఆయన సేవలను మేము వినియోగించుకుంటాం. పార్టీలో జీవన్ రెడ్డి గౌరవానికి భంగం కలిగించం. చనిపోయిన గంగారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. అందరితో సమన్యాయం చేసుకోని మాట్లాడాలని పీసీసీ చీఫ్ నాకు సూచించారు’అని శ్రీధర్‌బాబు తెలిపారు.
ఇదీ చదవండి: అవమానాలు చాలు ఇకనైనా బతకనివ్వండి : జీవన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment