ఆయన్ను పార్టీ కాపాడుకుంటుందని వెల్లడి.. ఆయన అభ్యంతరాలను అధిష్టానం పరిశీలించాలని వినతి
జీవన్‌రెడ్డిని కలిసి పరామర్శించిన యాష్కీ.. ప్రకటన విడుదల చేసిన జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత టి. జీవన్‌రెడ్డికి ఆ పార్టీలోని పలువురు నేతలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. అనుచరుడి హత్యతో తీవ్ర ఆవేదనలో ఉన్న ఆయన్ను టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ హైదరాబాద్‌లోని జీవన్‌రెడ్డి నివాసంలో శుక్రవారం కలిసి పరామర్శించారు. అనుచరుడి హత్యకు సంబంధించిన వివరాలు తెలుసుకొని సానుభూతి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో జీవన్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి ఎనలేని సేవ చేశారని... ఆయన సేవలు పారీ్టకి మరింత అవసర మని అభిప్రాయపడ్డారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినా ఆ తర్వాత జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డి గెలిచారని గుర్తుచేశారు. అప్పుడే ఆయనకున్న ప్రజాబలం ఏమిటో అర్థమైందన్నారు. జీవన్‌రెడ్డిని పార్టీ కాపాడుకుంటుందని.. ప్రస్తుత రాజకీయ పరిణామాలతోపాటు ప్రభుత్వ పాలనలో ఆయన తెలిపిన అభ్యంతరాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని యాష్కీగౌడ్ చెప్పారు.
ఆయన ఆవేదన చూసి బాధపడ్డా: జగ్గారెడ్డి
జీవన్‌రెడ్డి ఆవేదనపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా స్పందించారు. జీవన్‌రెడ్డి ఆవేదన చూసి తాను చాలా బాధపడ్డానని.. మనసు కలుక్కుమందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘మీకు అండగా ఉన్నానని చెప్పడానికి ఈ ప్రకటన మీడియా ద్వారా చేస్తున్నా. నేను ఎవరినీ తప్పుబట్టట్లేదు. కానీ పారీ్టలో మీరు ఒంటరినని అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు నేను మీ వెంట ఉంటా. ఎప్పుడూ జనంలో ఉండే మిమ్మల్ని జగిత్యాల, సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావట్లేదు. మీ సమస్యకు అధిష్టానం పరిష్కారం చూపాలని సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాం«దీని కోరుతున్నా’అని జగ్గారెడ్డి ఆ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు
Comments
Please login to add a commentAdd a comment