కరీంనగర్ :ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థంగా మారిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారంలోకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
-
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
కరీంనగర్ :ప్రభుత్వ నిర్వాకంతోనే విద్యారంగం అస్తవ్యస్థంగా మారిందని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి అన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, అధికారంలోకొచ్చి రెండేళ్లు గడుస్తున్నా స్పష్టత ఇవ్వడం లేదని తెలిపారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలోని అర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకుండా ప్రైవేట్ విద్యాసంస్థలకు కొమ్ముకాసేలా వ్యవహరించడం దుర్మార్గమని, బోధన, బోధనేతర సిబ్బందిని నియమించకుండా, సర్వీసు రూల్స్‌పై తేల్చకుండా ఉపాధ్యాయులపై మంత్రి కడియం శ్రీహరి వ్యాఖ్యలు విడ్డూరమని అభిప్రాయపడ్డారు. కేంద్రం నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు. కరువులో రైతులను ఆదుకునేందుకు ఇన్‌పుట్ సబ్సిడీగా ఇచ్చిన రూ.700 కోట్లను దారిమళ్లించిందని పేర్కొన్నారు. రుణమాఫీపై స్పష్టత కొరవడిందని, రుణాల కోసం రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని తెలిపారు.