సాక్షి,జగిత్యాల జిల్లా: తెలంగాణలో సీఎం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. తన ప్రత్యర్థి బీఆర్‌ఎస్ ల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సోమవారం ఆయన ఇంటికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ చేరుకున్నారు.
అక్కడికి చేరుకోగానే వారిద్దరినీ కాంగ్రెస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి క్యాడర్ చుట్టుముట్టింది. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై విప్స్ ఇద్దరినీ కార్యకర్తలంతా నిలదీశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్ చేయనున్నట్లు సమాచారం.
కాగా, జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో మరో ప్రత్యర్థినేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్‌రెడ్డి అలకబూనారు. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమయ్యారు.
దీనిపై ఆయనను బుజ్జగించేందుకే పార్టీ తరపున ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్‌లు జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్‌కుమార్ మీద జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment