jagitial
-
జీవన్‌రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత
సాక్షి,జగిత్యాల జిల్లా: తెలంగాణలో సీఎం రేవంత్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌తో జగిత్యాల జిల్లా కాంగ్రెస్‌లో ముసలం పుట్టింది. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ ల్యే సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు సోమవారం ఆయన ఇంటికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్, ఆది శ్రీనివాస్ చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే వారిద్దరినీ కాంగ్రెస్ శ్రేణులు, జీవన్‌రెడ్డి క్యాడర్ చుట్టుముట్టింది. జీవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై విప్స్ ఇద్దరినీ కార్యకర్తలంతా నిలదీశారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనకు ఫోన్ చేయనున్నట్లు సమాచారం. కాగా, జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తనను సంప్రదించకుండా తన నియోజకవర్గంలో మరో ప్రత్యర్థినేతను పార్టీలో ఎలా చేర్చుకుంటారని జీవన్‌రెడ్డి అలకబూనారు. అవసరమైతే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేందుకు జీవన్‌రెడ్డి సిద్ధమయ్యారు. దీనిపై ఆయనను బుజ్జగించేందుకే పార్టీ తరపున ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, లక్ష్మణ్‌కుమార్‌లు జీవన్‌రెడ్డి ఇంటికి వచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గంలో సంజయ్‌కుమార్ మీద జీవన్‌రెడ్డి ఓటమి పాలయ్యారు. అనంతరం ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. -
లెక్క తేలింది.. పోరు మిగిలింది..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.కరీంనగర్లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలుఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు2019లో పెద్దపల్లి లోక్‌సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్‌రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..! -
కొలిక్కి వచ్చిన ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ ఎపిసోడ్
-
తాళాల పంచాయతీ.. ‘ఇది కుట్ర ప్రకారమే జరిగింది..’
జగిత్యాల/జగిత్యాలటౌన్: జగిత్యాల జిల్లా మల్యాల మండలం నూకపల్లి వీఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం తాళపు చెవులు మాయం కావడంపై సోమవారం విచారణ జరగనుంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్, బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) నుంచి ప్రస్తుత మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీ చేశారు. ఇందులో 441 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలిచారు. అయితే ఈ ఫలితాలను సవాల్ చేస్తూ లక్ష్మణ్ కుమార్ అప్పట్లోనే హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ పిటిషన్ వేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీంతో ఎన్నికలకు సంబంధించిన సామగ్రి మొత్తం జగిత్యాలలోని వీఆర్కే కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలో భద్రపర్చారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి అందులోని డాక్యుమెంట్స్‌ను నిర్ణీత తేదీలోగా తమకు అందించాలని హైకోర్టు కలెక్టర్, ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. ఇక హైకోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ యాస్మిన్ బాషా, అప్పటి ఎన్నికల రిటర్నింగ్ అధికారితో కలిసి స్ట్రాంగ్‌రూమ్ తాళం తెరిచేందుకు ఈనెల 12న ప్రయత్నించారు. అయితే మూడు గదుల్లో రెండో గది తాళం తెరచుకోవడంతో అందులో పత్రాలు పరిశీలించి వీడియో తీశారు. ఇక మిగతా రెండు గదుల తాళాలు కనిపించలేదు. ఆ తాళాలను పగులగొట్టడం లేదా మారుతాళంతో తీయాలని ప్రయత్నాలు చేయగా వాటికి కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ అంగీకరించలేదు. దీంతో తెరచిన గదులతో పాటు మిగతా రెండు గదులకు సీల్ వేశారు. తాళాలు తెరచుకోలేని విషయాన్ని కోర్టుకు విన్నవిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఈ తాళాలు తెరచుకోకపోవడంపై లక్ష్మణ్ కుమార్ తప్పుబట్టారు. ఓటింగ్ యంత్రాల స్ట్రాంగ్ రూమ్ తాళాలను కుట్ర ప్రకారమే తీయలేదని లక్ష్మణ్ ఆరోపించారు. కలెక్టర్ లేదా, అదనపు కలెక్టర్ వద్ద ఉండాల్సిన తాళం చెవులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కోర్టు ఆదేశించి ఆరు రోజులు గడిచినా అధికారులు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవులు లేవని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. -
తెరుచుకున్న జగిత్యాల స్ట్రాంగ్ రూమ్..!
-
స్వదేశీ సాహివాల్‌కు అద్దె గర్భంతో కొత్త ఊపిరి
శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి: చేను, చెలకల్లో మళ్లీ స్వదేశీ గోజాతుల అంబారావాల సవ్వడి పెరిగిపోనుంది. అంతరించిపోతున్న అరుదైన దేశీ పశుసంపద సంరక్షణ బాధ్యతను తీసుకున్నవారితో పాటు, తాజాగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ‘రాష్ట్రీయ గోకుల్ మిషన్’ కొత్త చరిత్రను తెరమీదకు తెస్తోంది. నూటికి నూరుశాతం సాహివాల్ జన్యు లక్షణాలు కలిగిన కోడె వీర్యాన్ని, ఆవు నుండి తీసిన అండాలను జగిత్యాల ప్రభుత్వ వెటర్నరీ కాలేజీ ప్రయోగశాలలో ఫలదీకరణ చేసి ఆవుల గర్భంలో ప్రవేశపెట్టడం ద్వారా సాహివాల్ దూడలకు ఇటీవలే ఊపిరి పోశారు. కోస్నూరుపల్లె మూల మోహన్‌రెడ్డి, సింగారావుపేట బద్దం రాజశేఖరరెడ్డికి చెందిన ఆవులకు రెండు నెలల క్రితం పుట్టిన లేగదూడలు పూర్తి సాహివాల్ జన్యు లక్షణాలతో ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. గడిచిన ఆర్నెల్లలో వెటర్నరీ కళాశాల వైద్యులు ఈ విధంగా 172 అండాలు ఫలదీకరణ చేసి అందులో వంద వరకు ఆవుల గర్భంలో అమర్చారు. దీంతో వచ్చే రెండు మూడు నెలల్లో ఒక్క జగిత్యాల జిల్లాలోనే వందకు పైగా దేశీ సాహివాల్ దూడలు జన్మించనుండటం పశుసంపద రక్షణకు సంబంధించి గొప్ప మలుపు కానుంది. ఈ పద్ధతి (ఐవీఎఫ్)లో కాకుండా కృత్రిమ గర్భధారణ చేస్తే పూర్తి జన్యులక్షణాలతో దూడలు పుట్టేందుకు పదితరాలు (ముప్పై నుండి నలభై సంవత్సరాలు) సమయం తీసుకునే అవకాశం ఉండగా తాజా అద్దెగర్భ ప్రయోగం తొలి దశలోనే విజయవంతం కావడం స్వదేశీ పశు సంపద అభివృద్ధిపై ఆశలు రేకెత్తిస్తోంది. యాభై స్వదేశీ జాతుల్లో..ప్రస్తుతం పదే! ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్ పరిధిలోని బ్యూరో ఆఫ్ యానిమల్ జెనిటిక్ రీసోర్సెస్ (బీఏజీఆర్) దేశంలో 50 స్వదేశీ గోవు జాతులను గుర్తించగా, అందులో మెజారిటీ జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. 2012–19 మధ్య కాలంలో స్వదేశీ గోవులు 8.94 శాతం అంతరించాయి. ఈ నేపథ్యంలో రైతులు, ప్రభుత్వ సంస్థల సంరక్షణ చర్యలతో.. ప్రస్తుతం ఒంగోలు, పుంగనూరు (ఆంధ్రప్రదేశ్), పొడతురుపు (తెలంగాణ), గిర్ (రాజస్తాన్), సాహివాల్ (పంజాబ్, రాజస్తాన్), తార్పార్కర్ (రాజస్తాన్), డివోని (కర్ణాటక, మహారాష్ట్ర), వేచూర్, కాసరగోడ్ (కేరళ), కాంక్రేజ్ (గుజరాత్, రాజస్తాన్) గోవు జాతులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ఉన్నాయి. గోకుల్ మిషన్‌తో సంరక్షణ చర్యలు ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం కూడా స్వదేశీ జాతుల సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ‘గోకుల్ మిషన్’ను ప్రకటించింది. 2021 మొదలుకుని 2026 వరకు రాష్ట్రీయ పశుధాన్ వికాస్ యోజనను అమలు చేస్తోంది. అందులో భాగంగానే జగిత్యాల వెటర్నరీ కళాశాలలో రూ.5.26 కోట్లతో ఓ ల్యాబొరేటరీ ఏర్పాటు చేసి ఐవీఎఫ్ (ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్) పద్ధతిలో సాహివాల్ గోవుల సంరక్షణను ప్రారంభించింది. తెలంగాణ బ్రాండ్‌గా.. పొడతురుపు ‘పొడతురుపు’గోవులకు ఇటీవలే కేంద్రం తెలంగాణ బ్రాండ్‌గా గుర్తింపునిచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లాతో పాటు నల్లమల అటవీప్రాంతంలో ప్రస్తుతం ఇవి 15 వేల వరకు ఉన్నట్టు తేల్చారు. కొండల్లోనూ ఆహారం సంపాదిస్తాయి. క్రూర జంతువుల నుండి కాపాడుకుంటాయి. ఈ ఆవు పాలల్లో ఔషధ గుణాలుంటాయి. రోజంతా శ్రమించే గుణం ‘పొడతురుపు’సొంతం. జన్యుపరమైన గుర్తింపు రావటంతో ఈ జాతిని సంరక్షించే బాధ్యతను అధికార యంత్రాంగం చేపట్టింది. అంతటా చేపట్టాలి వెటర్నరీ కాలేజీలో ప్రయోగం విజయవంతం కావటం స్వదేశీ గోమిత్రుల్లో సంతోషం నింపుతోంది. అయితే సాంకేతిక కారణాల దృష్ట్యా జగిత్యాలకు 30 నుండి 40 కి.మీ దూరంలో ఉండే ప్రాంతాల్లోనే ఈ విధంగా చేసేందుకు అవకాశం ఉన్న దృష్ట్యా, ఈ పరిజ్ఞానం విస్తరణను వీలైనంత త్వరగా చేపట్టాలని ఇప్పటికే సొంతంగా స్వదేశీ గోజాతులను సంరక్షిస్తున్న రైతులు డిమాండ్ చేస్తున్నారు. (క్లిక్ చేయండి: వైఎస్సార్ రెండిస్తే.. నేను నలభై చేసిన) సేవ్ స్వదేశీ ఆవు దేశీ గోవులను యుద్ధ ప్రాతిపదికన సంరక్షించాలంటూ అల్లోల దివ్యారెడ్డి ఇటీవల సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన పిల్లలకు స్వచ్చమైన పాలను అందించేందుకు ఆమె పడిన తపన.. స్వదేశీ గో సంరక్షణ వైపు అడుగులు వేయించింది. సంగారెడ్డిలో వంద గోవులతో (గిర్) ప్రారంభమైన దివ్యారెడ్డి ఫామ్ ప్రస్తుతం 250 ఆవులు, కోడెలతో నిండిపోయింది. చాలాకాలంగా పశు సంవర్థక శాఖల ఆధ్వర్యంలో స్వదేశీ ఆవులను విదేశీ బ్రీడ్‌తో కృత్రిమ గర్భధారణ చేస్తుండటంతో స్వదేశీ ఆవు జాతులు అంతరించి పోయాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం దేశంలో 26 శాతం హైబ్రిడ్ , మరో 56 శాతం క్రాస్‌బ్రీడ్ గోవులున్నాయని వివరించారు. వీటి స్థానంలో స్వదేశీ జాతుల అభివృద్ధి కోసం తాను ఓ అడుగు ముందుకు వేశానని దివ్యారెడ్డి చెప్పారు. (క్లిక్ చేయండి: అందుకే ఆవు... ఆరాధ్యదైవం అయింది) -
సీఎం కేసీఆర్ కుండలు పెట్టి బిందెలు ఎత్తుకెళ్లే రకం
జగిత్యాల (కరీంనగర్): ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కుండలు పెట్టి బిందెలు ఎత్తుకుపోయే రకమని, రూ.2 వేల పింఛను ఆశ చూపి డబుల్బెడ్రూం ఇళ్లకు ఎసరు పెట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. జగిత్యాలలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రాష్ట్రానికి 2 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే..ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని ఆరోపించారు. బీజేపీకి బద్ధశత్రువైన మమతా బెనర్జీ కూడా పశ్చిమబెంగాల్లో 25 లక్షల ఇళ్లు నిర్మించారని, ఏపీ సీఎం వైఎస్ జగన్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు లక్షలాది ఇళ్లు నిర్మించి ఇచ్చారని తెలిపారు. మాజీ ఎంపీ కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని భావించి జగిత్యాలకే 4 వేల ఇళ్లు మంజూరు చేయించి ఉంటారని అన్నారు. కేసీఆర్ కుటుంబంలో అంతర్గత కారణాలతో కవిత జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదని, ఎంపీగా పోటీచేస్తే టీఆర్ఎస్ వారే ఓడించారని వ్యాఖ్యానించారు. -
ఈ అక్షయ పాత్రతో నీళ్లు తాగితే పాము కాటు వేసిన ఏం కాదు!
సాక్షి, జగిత్యాలక్రైం: అక్షయపాత్ర కొనుగోలు చేసి, ఇంట్లో పెట్టుకుంటే కోటీశ్వరులు అవుతారని గ్రామీణ ప్రాంతాల్లో అమాయకులను నమ్మించి మోసం చేస్తున్న ముఠాను జగిత్యాల పట్టణ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ల వివరాల ప్రకారం.. జగిత్యాల అర్బన్ మండలం హస్నాబాద్‌కు చెందిన కడప శ్రీనివాస్ జగిత్యాల బీట్‌బజార్‌కు చెందిన రాయిల్ల సాయికుమార్‌ను సంప్రదించాడు. అతను హైదరాబాద్‌కు చెందిన దండె కార్తీక్, బవికుమార్, మంచిర్యాలకు చెందిన బోడకుంట మురళీమనోహర్, ఖమ్మం జిల్లా మణుగూరుకు చెందిన యాదగిరి అఖిల్కుమార్లను శ్రీనివాస్ వద్దకు తీసుకువచ్చాడు. మహిమ గల అక్షయపాత్ర తమ వద్ద ఉందని, ఇందులో నీరు పోసుకొని ప్రతిరోజూ ఉదయం కుటుంబసభ్యులందరూ తాగితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. పాముకాటు వేసినా ఏం కాదని నమ్మించారు. పూజ గదిలో పెట్టి పూజిస్తే కోటీశ్వరులు అవుతారని పేర్కొన్నారు. రూ.5 లక్షలు ఇస్తే అక్షయపాత్ర ఇస్తామన్నారు. అనుమానం వచ్చిన శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. జగిత్యాల టౌన్ సీఐ జయేశ్‌రెడ్డి, జగిత్యాలరూరల్ సీఐ కృష్ణకుమార్ బుధవారం రావుల సాయికుమార్ ఇంటికి వెళ్లారు. అతన్ని అదుపులోకి తీసుకొని, అక్షయపాత్ర స్వాధీనం చేసుకున్నారు. ముఠాకు చెందిన మిగతా సభ్యులను సైతం అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నామని పేర్కొన్నారు. -
ప్రియుడితో కలిసి భర్తపై భార్య వేధింపులు
సాక్షి, మల్యాల(చొప్పదండి): భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్‌తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. ‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతోపాటు రాజేందర్ ఫోన్లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్‌తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
దయనీయం: తల్లి మృతి, టెంట్ కిందే వారం రోజులుగా..
సాక్షి, కోరుట్ల: ఎంత మంది వెన్నంటి ఉన్నా.. అమ్మకు సాటి రారు. అమ్మలేని లోటు తీర్చలేనిది. పదేళ్లు దాటని నలుగురు ఆడపిల్లలు అమ్మను కోల్పోతే ఆ పరిస్థితి మరింత దయనీయం. నాన్న ఉన్నా..అమ్మ లేని లోటు పూడ్చలేని దుస్థితి. అద్దె ఇంట్లో కర్మలు చేయడానికి ఒప్పుకోని పరిస్థితిలో విధి లేక నాన్న, నలుగురు చిన్నారులు మండు టెండలో టెంట్ నీడలో వారం రోజులుగా కాలం గడుపుతున్నారు. అమ్మ కోసం ఏడుస్తూ విలవిల్లాడుతున్న నలుగురు ఆడపిల్లలకు సర్దిచెప్పలేక ఆ తండ్రి పడుతున్న వేదన పలువురిని కలిచివేస్తోంది. పేద కుటుంబం.. కోరుట్ల పట్టణంలోని పటేల్‌రోడ్డుకు చెందిన గొల్లపల్లి గంగారాం(48)–మమత(45) దంపతులు రజక వృత్తి చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వీరికి వైష్ణవి(10), అనిత(7), అమూల్య(5), దుర్గ(3) సంతానం. నలుగురు ఆడపిల్లలతో మమత కులవృత్తి చేస్తూ, గంగారాం ఓషాపులో ఇస్త్రీ పనికి వెళుతూ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వైష్ణవి,అనితలు 5, 3వ తరగతులు చదువుతుండగా మిగతా ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లడం లేదు. ఈ క్రమంలో మార్చి 1వ తేదీన మమత తీవ్ర అనారోగ్యం పాలు కాగా..ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఆ తరువాత మార్చి 7వ తేదీన మమత మృతిచెందింది. దీంతో పదేళ్లలోపు నలుగురు ఆడపిల్లలు అమ్మ లేక విలవిల్లాడుతూ, నాన్న ఓదార్పుతో సేదదీరడం లేదు. టెంట్ నీడలో.. మమత మృతిచెందడంతో అంత్యక్రియల అనంతరం కార్యక్రమాల నిర్వహణకు ఇంటిని అద్దెకు ఇచ్చిన వారు ఒప్పుకోకపోవడంతో గంగారాం తన పిల్లలతోపాటు దగ్గరలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో స్థానికులు ఖర్చులకు డబ్బులు ఇవ్వడంతో టెంట్ వేసుకుని ఉంటున్నారు. వారం రోజులుగా అదేటెంట్‌లో ఎండకు, చలికి ఇబ్బందులు పడుతూ నలుగురు పిల్లలతో కాలం వెల్లదీస్తున్నాడు. పనికోసం గంగారాం బయటకు వెళ్లాల్సి రావడంతో నలుగురు చిన్నారులను పట్టించుకునే వారు కరువయ్యారు. చిన్నారులు అమ్మ ఏదని అడిగితే..ఏమి చెప్పలేక కలత చెందుతున్నాడు. ప్రభుత్వపరంగా ఆడపిల్లలను ఆదుకోవాలని దాతలు తమకు వీలైనంత సాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. -
గల్ఫ్ వెళ్లొచ్చినా తీరని పగ, మద్యం తాగుతుండగా..
సాక్షి, ఇబ్రహీంపట్నం(కోరుట్ల): పాతకక్షలతో వ్యక్తిని హత్య చేసిన దారుణ సంఘటన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండిలో చోటుచేసుకుంది. ఎర్దండిలో బర్లపాటి రాజేశ్వర్(42) అనే వ్యక్తిని అదే గ్రామానికి చెందిన పల్లె పోశెట్టి బుధవారం రాత్రి కత్తితో పొడిచి చంపినట్లు కుటుంబీకులు, గ్రామస్తులు తెలిపారు. పోలీసులు, గ్రామస్తులు, కుటుంబీకుల వివరాల మేరకు...మృతుడు రాజేశ్వర్, పల్లె పోశెట్టిలకు 2017లో ఓ విషయంలో జరిగిన గొడవలో ఘర్షణకు పాల్పడగా రాజేశ్వర్‌పై కేసు నమోదైంది. అనంతరం రాజేశ్వర్ గల్ఫ్ వెళ్లి కొద్దిరోజులక్రితం స్వగ్రామానికి వచ్చాడు. అప్పటి నుంచి కేసు విషయమై పోశెట్టిని పలుసార్లు రాజీకి రావాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి గ్రామంలోని ఓ బెల్ట్‌షాపు వద్ద వీరిద్దరు మద్యం తాగుతుండగా మాటమాట పెరిగి గొడవకు దారి తీసింది. పోశెట్టి ఇంటికెళ్లి కత్తి వెంట తెచ్చుకొని రాజేశ్వర్ కడుపు, ముఖంపై పొడవడంతో తీవ్రగాయాలయ్యాయి. ఈ సమయంలో అటుగా తండ్రికోసం వచ్చిన కూతురు దాడి దృశ్యాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించింది. సమాచారం అందుకున్న కుటుంబీకులు రాజేశ్వర్‌ను మెట్‌పల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిందితుడు పల్లె పోశెట్టిపై గతంలో ఎడ్లను దొంగిలించినట్లు కేసు నమోదైందని గ్రామస్తులు తెలిపారు. కాగా పోశెట్టి భార్య పద్మ, తండ్రి నడ్పి రాజన్న, తల్లి రాజు, చెల్లెలి కొడుకు కాయిపల్లి రమేశ్ కలిసి తన భర్తను హత్యచేసినట్లు మృతుడి భార్య బర్లపాటి పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ గౌస్‌బాబా తెలిపారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తుల ధర్నా నిందితుడిని కఠినంగా శిక్షించాలని గురువారం ఎర్దండి గ్రామస్తులు ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ వద్ద రోడ్డుపై బైఠాయించి సుమారు 3 గంటల పాటు ధర్నా నిర్వహించారు. నిందితుడు పోలీస్‌స్టేషన్‌లో ఉన్నట్లు తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. మెట్పల్లి సీఐ శ్రీనివాస్ గ్రామస్తులకు నచ్చజెప్పినా వినకపోవడంతో డీఎస్పీ గౌస్‌బాబా వచ్చి సముదాయించారు. మృతుడు రాజేశ్వర్ ముగ్గురు కూతుర్లు డీఎస్పీ కాళ్లపై పడి బోరున విలపించారు. తమ తండ్రిని చంపిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు. కాగా బెల్టుషాపులను మూసివేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ గౌస్‌బాబా మాట్లాడుతూ నిందితుడికి మరణశిక్ష పడేలా చూస్తామని, గ్రామానికి రాకుండా చేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. కోరుట్ల,మెట్పల్లి సీఐలు రాజశేఖర్‌రాజు, శ్రీనివాస్, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం ఎస్సైలు, పోలీసులు బందోబస్తు చేపట్టారు. -
ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి నిరసన
సాక్షి, జగిత్యాల: ప్రేమ పేరుతో రహస్యంగా వివాహం చేసుకొని, కుమారుడు పుట్టిన తర్వాత తనకేమీ తెలియదంటూ మోసం చేశాడని ఓ యువతి తన ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాల్లోకి వెళ్లే.. జగిత్యాల మండలం కల్లెడ గ్రామానికి చెందిన గుజ్జుల స్వప్న, అదే గ్రామానికి చెందిన కట్కూరి వెంకటేశ్ ప్రేమించుకున్నారు. నాలుగేళ్ల కిందట రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్ పలుమార్లు విదేశాలకు వెళ్లివచ్చాడు. వీరికి మూడేళ్ల కిందట బాబు జన్మించాడు. గల్ఫ్ నుంచి రెండు నెలల కిందట స్వగ్రామం వచ్చిన వెంకటేశ్ స్వప్నను నువ్వు ఎవరో నాకు తెలియదన్నాడు. కుమారుడు కూడా నాకు పుట్టలేదంటూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడు. దీంతో స్వప్న మంగళవారం అతని ఇంటి ఎదుట కుమారుడితో కలిసి నిరసనకు దిగింది. విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ ఎస్సై చిరంజీవి పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తే కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించింది. -
స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, సారంగాపూర్(జగిత్యాల): ఆన్లైన్ తరగతుల కోసం స్మార్ట్‌ఫోన్ కొనివ్వడం లేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. స్మార్ట్‌ఫోన్ కొనిచ్చే ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది. ఎస్సై మనోహర్‌రావు వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయి గ్రామానికి చెందిన ఆకుల రాజేశం, శంకరవ్వ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రాజేశం గీత వృత్తితో పాటు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తల్లి బీడీలు చుడుతూ ఆసరాగా ఉంటోంది. చిన్న కుమారుడు సాయిరాం (15) గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్ తరగతులు కొనసాగుతుండటంతో స్మార్ట్‌ఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ఆర్థిక స్థోమత లేదని, ఇప్పుడు వద్దని తల్లిదండ్రులు వారించారు. దీంతో మనస్తాపం చెందిన సాయిరాం తమ పాత ఇంట్లో ఉరేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
రాష్ట్రంలో తక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నారు: జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల: ఇదర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ ప్రభుత్వం తక్కువ కరోనా పరీక్షలు చేయడం చాలా ప్రమాదకరమని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ముంబై వలస కార్మికులు రాష్ట్రంలోకి రావడంతో కరోనా కేసులు పెరుగుతున్నాయన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని సెల్ఫ్ క్వారంటైన్లో కాకుండా ప్రభుత్వ క్వారంటైన్లో ఉంచి డాక్టర్ల పర్యవేక్షణలో పెట్టాలని చెప్పారు. క్వారంటైన్లో రెండు వారాలు కాకుండా 4 వారాల వరకు ఉంచాలని ఆయన సూచించారు. (ఇంతవరకు రైతుబంధు ఊసే లేదు: జీవన్‌రెడ్డి) గాంధీ హాస్పిటల్లో కరోనా పేషంట్లకు కనీసం రెండు సార్లు టెస్టులు చేయాలని, అలా కాకుండా 2 వారాలు అవగానే టెస్ట్ చేసి ఇంటికి పంపాలని పేర్కొన్నారు. నిరుపేదలకు ఇచ్చే రూ. 15 వందలు 6 నెలల వరకు ఇవ్వాలన్నారు. జన్‌దన్ మొదట 2 నెలలు ఇచ్చిందని.. కానీ ఇప్పుడు ఇవ్వటం లేదని తెలిపారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చిందని పేర్కొన్నారు. మద్యం అమ్మకాలు ఆశించిన మేరకు లేకపోవడంతో వేతనాలు చెల్లించలేకపోతుండటం దారుణమని ఆయన వ్యాఖ్యానించారు. -
ఇంతవరకు రైతుబంధు ఊసే లేదు: జీవన్‌రెడ్డి
సాక్షి, జగిత్యాల : ఇతర దేశాల్లో ఉన్న ఉపాధి కూలీలను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రానికి తెలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. లాక్డౌన్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా, రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంకు అదనంగా ఒక కిలో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుందని తెలిపారు. జన్‌దన్ సంబంధించి 500 రూ.లు అకౌంట్లో జమ కావడం లేదని ఆరోపించారు. (ఆ ముగ్గురికి రాహుల్ అభినందనలు ) రాష్ట్రంలో క్విటాలుకు హమాలి ఛార్జ్ 40 రూ.లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5రూ.ల హమాలి ఛార్జ్ ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చార్జీలు లేకుండా అమలు చేశామని తెలిపారు. హమాలి ఛార్జితో రైతులు ఎకరానికి 1000రూ.లు, తాలు నెపంతో 1000 రూ.లు మొత్తంగా 2000/-రూ.లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రైతుబంధు ఊసే లేదని దుయ్యబట్టారు. రుణమాఫీ నెపంతో దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణమాఫీలో 6శాతం అమలు లేకుండా పోయిందన్నారు. పసుపును మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ చట్టసభల్లో హామీ ఇచ్చాడు కానీ అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. (కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం ) -
కలెక్టర్ ట్విట్టర్ ఖాతాలో వివాదస్పద కామెంట్
-
‘రష్మిక చించావ్ పో’.. అది నేనన్లేదు
జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి సోషల్ మీడియా వేదికగా ఓ వివాదంలో ఇరుకున్నారు. మంగళవారం హీరోయిన్ రష్మిక మందన తన లేటెస్ట్ ఫోటోలను ట్విటర్లో తన అభిమానులతో పంచుకుంది. అయితే ఈ ఫోటోలపై జగిత్యాల కలెక్టర్ పేరుతో వచ్చిన ట్వీట్ దుమారం రేపుతోంది. రష్మికను ఉద్దేశించి.. చించేశావ్ పో అంటూ కలెక్టర్ రవి పేరుతో వచ్చిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాధ్యతగల ఒక జిల్లా కలెక్టర్ ఈ విధంగా కామెంట్ చేయడం సంచలనం సృష్టించింది. ఈ ట్వీట్‌పై కలెక్టర్‌పై సర్వత్రా విమర్శలు వచ్చాయి. సంచలనం రేపిన ఈ ట్వీట్‌పై జగిత్యాల కలెక్టర్ రవి స్పందించారు. ఈ ట్వీట్ చేసింది తాను కాదని, తన ట్విటర్ ఖాతాను ఎవరో హ్యాక్ చేశారని కలెక్టర్ పేర్కొన్నారు. అంతేకాకుండా దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసి వెంటనే విచారణ చేపట్టాలని కోరారు. ప్రస్తుతం కలెక్టర్ ట్విటర్ అకౌంట్‌ను ఎవరు హ్యాక్ చేశారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. Let me look at you for a second and give you a smileeeee!🐒♥️ pic.twitter.com/KHAYESKyBR — Rashmika Mandanna (@iamRashmika) February 18, 2020 చదవండి: అది నా తప్పు కాదు, క్యారెక్టర్ అలాంటిది పోర్న్ స్టార్‌గా దిగ్గజ దర్శకుడి కుమార్తె.. -
బ్యాంకు మేనేజర్‌నంటూ ఫోన్.. ఆ తర్వాత!
సాక్షి, జగిత్యాల: జిల్లా కేంద్రంలో మరో సైబర్ మోసం శుక్రవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్రంలో ఇద్దరు వ్యక్తులకు.. ‘బ్యాంకు మేనేజర్ ను మాట్లాడుతున్నాను.. మీ బ్యాంకు ఖా తాను పరీక్షించాల్సి ఉంది, మీ ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యింది. పిన్ నెంబర్ చెప్తే సరిచేస్తామ ని చెప్పి, వారి బ్యాంకు ఖాతాల్లోంచి రూ. 28,600 తస్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా కేంద్రంలో విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి మనోహర్‌కు శుక్రవారం జగిత్యాలలో ని అశోక్‌నగర్ బ్యాంకు మేనేజర్‌ను అంటూ, ఏటీఎం కార్డు బ్లాక్ అయ్యిందని, పిన్ నెంబర్ చెప్పమనగానే మనోహర్ తన ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్పగానే, అంతలోనే ఖాతా నుంచి రూ.3700 డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. మళ్లీ మనోహర్‌కు ఫోన్ చేసి మరో ఏటీఎం కార్డు పిన్ నెంబర్ చెప్తే, మీ ఏటీఎం కార్డు పనిచేస్తుందని చెప్పగానే, మనోహర్ అక్కడే ఉన్న కొమ్ముల శ్రీనివాస్ అనే మేస్త్రీ ఏటిఎం పి న్ నెంబర్ చెప్పడంతో ఆయన ఖాతాలోంచి రూ.24,900 డ్రా అయినట్లు మేసేజ్ వచ్చింది. దీంతో తాము మోసపోయామని గ్రహించి వెంటనే బ్యాంకులో సంప్రదించి, అనంతరం జగిత్యాల పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సెల్ నెంబర్ 9064666265పై ఫిర్యాదు చేశారు. -
సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైంది: జగిత్యాల కలెక్టర్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): జిల్లా పార్లమెంట్ ఎన్నికలకు జాతీయ స్థాయిలో ఉత్తమ ఎన్నికల నిర్వహణ అవార్డు రావడంతో కలెక్టర్ శరత్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తక్కువ సమయంలోనే ఎన్నికలను చక్కడా నిర్వహించామని, ఎన్నికల అధికారులు, పోటీ చేసిన అభ్యర్థుల సహకారంతోనే ఇది సాధ్యమైందన్నారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యత కూడా ఇందుకు కారణమని తెలిపారు. సమిష్టి కృషితో పని చేస్తూ ప్రజలకు మెరుగైనా సేవలను అందిస్తున్నామన్నారు. దేశస్థాయిలో తెలంగాణ నెంబర్ వన్‌గా నిలవడం సంతోషకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
‘17 సెప్టెంబర్ ప్రాధాన్యత తెలియని వారు ఉండరు’
సాక్షి, జగిత్యాల : తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో మంగళవారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ఈ రోజు(సెప్టెంబర్ 17) ప్రాధాన్యత గురించి తెలియని వారంటూ ఉండరు అని అన్నారు. ఆగష్టు 15, 1947 తర్వాత హైదరాబాద్ రాజరిక పాలనలో ఉండేదని గుర్తుచేశారు. అలాగే నాడు భారతదేశాన్ని అస్థిరత చేసే విధంగా బ్రిటీషు వాళ్లు కుట్రలు ఉండేవని అన్నారు. హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయడానిక చేసిన సాయుధ పోరాటాలు, ఏ కులానికో, మతానికో వ్యతిరేకం కాదని, కావాలనే కొన్ని రాజకీయ శక్తులు దీన్ని కులాల ప్రాతిపదికన విభజన చేసే కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. ఆనాడు కేంద్రం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్ధార్ వల్లాభాయ్ పటేల్ సైనిక చర్య ద్వారా హైదరాబాద్‌ను భారత యూనియన్‌లో కలిపే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. కార్యక్రమం చివర్లో అమరులకు ఆత్మశాంతి చేకూరాలని కోరుతూ మౌనం పాటించారు. -
గల్ఫ్‌పేరుతో ఘరానా మోసం
సాక్షి, జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లాలో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. నిరుద్యోగ యువతను ఉపాధినిమిత్తం విదేశాలకు పంపిస్తామంటూ నమ్మించి అందినకాడికి దండుకుంటున్నారు. పొంతనలేని పనులు అప్పగించి చేతులు దులుపుకుంటున్నారు. మరికొంతమంది గల్ఫ్‌పేరుతో ఉద్యోగమిప్పిస్తామని డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారు. ఇటీవల గల్ఫ్‌ఏజెంట్ మోసం చేశాడని రాయికల్ మండలం కిష్టంపేట గ్రామంలో ఏజెంట్ ఇంటిముందే బాధితులు ధర్నా నిర్వహించారు. కుమ్మరిపల్లిలో ఏజెంట్ మోసం చేశాడని ఓ బాధితుడు సెల్‌టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఇలా చాలామంది బాధితులు ఏజెంట్ల చేతుల్లో మోసపోయి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో సుమారు 320మంది ఎలాంటి అనుమతులు లేకుండా గల్ఫ్ ఏజెంట్లుగా నిర్వహిస్తున్నారు. ట్రావెల్స్ పెట్టుకుని గల్ఫ్‌దేశాలకు పంపిస్తామంటూ విస్తృత ప్రచారం చేయించుకుంటున్నారు. వీరిని నమ్మిన కొంతమంది ఇంటర్వ్యూలకు హాజరై పాస్పోర్టుతో పాటు కొంత మేరకు డబ్బు చేతుల్లో పెట్టి మోసాలకు గురవుతున్నారు. నిఘా పెట్టిన పోలీసులు జిల్లా వ్యాప్తంగా గల్ఫ్ మోసాలను అరికట్టేందుకు పోలీసులు ట్రావెల్స్‌లపై మూకుమ్మడి దాడులు చేసి పాస్‌పోర్టులు, విలువైన డాక్యుమెంట్లు సీజ్ చేసి కేసులు కూడా నమోదు చేశారు. పోలీసులు నిఘా పెట్టినా ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో గల్ఫ్ ఏజెంట్ల ఆగడాలు కొనసాగుతున్నాయి. దీంతో పోలీసులు స్పీడ్ పెంచారు. గ్రహించిన గల్ఫ్ ఏజెంట్లు గత నెల రోజులుగా రహస్య ప్రాంతాల్లో పోలీసుల కళ్లుగప్పి గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. నిబంధనల సడలింపుతో 8 మందికే లైసెన్స్‌లు ట్రావెల్స్‌ల కోసం కేంద్ర విదేశీ వ్యవహారల శాఖ సడలింపు ఇవ్వడంతో జగిత్యాల జిల్లాలో గల్ఫ్ దేశాలకు పంపించేందుకు 8 ట్రావెల్స్‌లకు మాత్రమే అనుమతులు వచ్చాయి. రూ.50 లక్షలు డిపాజిట్ చేసిన ట్రావెల్స్ వారికి ఐదు సంవత్సరాలకోసారి రెన్యువల్ ఉండగా రూ.8 లక్షలు చెల్లించిన వారికి సంవత్సరానికోసారి రెన్యువల్ చేసుకునేలా అనుమతులు ఇచ్చారు. మిగతా వారికి ఎవరికీ అనుమతులు లేకుండా ముంబాయ్, చెన్నై, ఢిల్లీ ఇతర ప్రాంతాల నుంచి గల్ఫ్ ఏజెంట్లను తెప్పించి ఇక్కడ పనిచేస్తున్న ఏజెంట్లు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇంటర్వ్యూల్లో ఎంపికైన వారి నుంచి ఒరిజినల్ పాస్పోర్టుతో పాటు కొంత మేరకు వీసా అడ్వాన్స్ తీసుకుంటున్నారు. పోలీసుల నజర్ జిల్లాలో గల్ఫ్ ఏజెంట్లపై నజర్ పెట్టారు. దాదాపు ఆరునెలల కాలంలో సుమారు 72కి పైగా గల్ఫ్ ఏజెంట్లపై కేసులు నమోదు చేశారు. అయినా ఏజెంట్లలో మాత్రం మార్పు రావడం లేదు. నిరుద్యోగుల నుంచి మంచి కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలుకుతూ మోసాలకు పాల్పడుతున్నారు. పాస్‌పోర్టులు స్వాధీనం.. వివిధ దేశాల్లో ఉద్యోగాలున్నాయని, సబ్ ఏజెంట్ల వాట్సప్‌ల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్న ట్రావెల్స్ ఏజెంట్లు ఇంటర్వ్యూలకు వచ్చిన నిరుద్యోగుల నుండి మీరు ఎంపికయ్యారని, పాస్‌పోర్టులు తీసుకుని నకిలీ వీసాలు అప్పగించి డబ్బులు వసూలు చేస్తున్నారు. అనుకున్న సమయానికి వీసా రాకపోవడంతో తమకు పాస్‌పోర్టు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి పెంచితే వారి వద్ద నుండి సుమారు రూ.10వేల నుండి రూ.20వేలవరకు ట్రావెల్స్ యజమానులు వసూలు చేస్తున్నారు. మోసపోవద్దు జగిత్యాల ప్రాంతంలో చాలా మంది యువకులు గల్ఫ్‌కు వెళ్లేందుకు ఉత్సాహం చూపుతున్నారు. గల్ఫ్‌కు వెళ్లేవారు ప్రభుత్వం గుర్తించిన సంస్తల ద్వారానే విదేశాలకు వెళ్లాలి. ఇతర ప్రయివేటు వ్యక్తులను, గల్ఫ్ ఏజెంట్లను నమ్మి యువకులు మోసపోవద్దు. చాలా మంది గల్ఫ్ ఏజెంట్లు నిరుద్యోగులను ఆసరాగా చేసుకొని మోసం చేస్తున్నారు. అనుమతి లేని గల్ఫ్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నాం . – ప్రకాశ్, జగిత్యాల పట్టణ సీఐ -
కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని పోరండ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకుని కన్న తండ్రే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన బోదలపు రాజయ్య కుమారుడు రవి (28) ప్రతిరోజూ తాగుతూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. నిన్న రాత్రి తాగిన మైకంలో తండ్రితో గొడవపడ్డాడు. అనంతరం వేధింపులకి తట్టుకోలేక నిద్రిస్తున్న కొడుకుని రాజయ్య గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎంపీ కవిత చలో జగిత్యాల.!
సాక్షి, జగిత్యాల: సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డిని అధికార టీఆర్ఎస్ టార్గెట్ చేసిందా? ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగిత్యాల నియోజకవర్గంలో పాగా వేసేందుకు వ్యూహం సిద్ధం చేస్తోందా? అసెంబ్లీ పోరులో జీవన్‌రెడ్డిని ఢీకొట్టేందుకు నిజామాబాద్ ఎంపీ కవితను బరిలోకి దింపబోతోందా? ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది! ఎంపీ కవిత జగిత్యాల నియోజకవర్గంపై దృష్టి సారించడం, విస్తృతంగా పర్యటించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల మున్సిపాలిటీకి రూ.50 కోట్లు మంజూరు చేయడం, అభివృద్ధి పనులు ఊపందుకోవడం, హైదరాబాద్ తర్వాత ఈ మున్సిపాలిటీకే ప్రత్యేక కోటా కింద నూకపల్లిలో 4,160 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయడం తదితర కార్యక్రమాలు చూస్తుంటే కవిత ఇక్కడ్నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతోందని తెలుస్తోంది. నూకపల్లి అర్బన్ కాలనీని దత్తత తీసుకుని మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తానని కవిత ఇటీవల స్వయంగా ప్రకటించారు. నియోజకవర్గం అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటివరకు జగిత్యాలలో ఆమె సుమారు 30 సార్లు పర్యటించారు. బహుముఖ వ్యూహమా? జగిత్యాలపై సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి మార్కు స్పష్టంగా కన్పిస్తోంది. టీడీపీ, కాంగ్రెస్‌ల్లో నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వివిధ శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. సీఎల్పీ ఉపనేతగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై గళమెత్తుతున్నారు. ఆయన్ను ఢీ కొట్టాలంటే అదే స్థాయి నాయకుడు కావాలని టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. కవిత ఇక్కడ్నుంచి పోటీ చేస్తే.. ఆయనకు గట్టి పోటీ ఇచ్చినట్టవుతుందని, అలాగే పార్టీలో నెలకొన్న వర్గపోరుకు తెరపడుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగిత్యాలలో టీఆర్ఎస్ మూడు వర్గాలుగా ఏర్పడింది. నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ సంజయ్‌కుమార్, పెగడపల్లి సింగిల్ విండో చైర్మన్ ఓరుగంటి రమణారావు, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు తనయుడు నర్సింగరావుల వారీగా పార్టీ కేడర్ విడిపోయింది. పార్టీ తరఫున ఏ పిలుపు ఇచ్చినా.. మూడు వర్గాలు కార్యక్రమాలు నిర్వహించడం ఆ పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంపై అధిష్టానం కూడా పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కవితను బరిలోకి దింపితే ఈ వర్గపోరుకు కూడా ఫుల్స్టాప్ పడుతుందని అధినాయకత్వం భావిస్తోంది. అలాగే టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే పార్టీని నమ్ముకుని పని చేస్తున్న నాయకులకు నామినేటెడ్ పదవులు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జిల్లాకు చెందిన గొడిసెల రాజేశం గౌడ్‌కు ఆర్థిక సంఘం చైర్మన్‌గా, బీఎస్ రాములకు రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్‌గా నామినేటెడ్ పదవులు వరించాయి. వారిద్దరూ బీసీ వర్గానికే చెందిన వారే కావడం.. నియోజకవర్గంలో 60 శాతం ఓట్లు బీసీలవే కావడంతో ఎన్నికల్లో వారి ఓట్లూ తమకే దక్కుతాయని టీఆర్ఎస్ భావిస్తోంది. -
జగిత్యాలలో మూడిళ్లలో చోరీ
సాక్షి, జగిత్యాల: జిల్లాలో దొంగతనాలు ఆగడంలేదు. సోమవారం రాత్రి కూడా జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్లో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. తలుపులకు వేసిన తాళాలను దొంగలు పగులగొట్టి ఓ ఇంట్లో రూ.20 వేల నగదు, 2 తులాల బంగారం, 2 తులాల వెండి దోచుకెళ్లారు. మరో రెండిళ్లలోని వారు అందుబాటులో లేకపోవడంతో సొత్తు ఎంత పోయిందో తెలియరాలేదు. దీని పై పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. -
18వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్
జగిత్యాల: రాష్ట్రంలో18 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు డీజీపీ మహేందర్ రెడ్డి వెల్లడించారు. జిల్లా కేంద్రమైన జగిత్యాలలో పోలీస్ హెడ్‌క్వార్టర్స్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఒకే రకమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు, అధికారుల భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఏడాదిలోగా కొత్త పోలీస్ స్టేషన్ భవన సముదాయాలు అందుబాటులోకి తెస్తామన్నారు. -
దారుణం : మతిస్థిమితం లేదని అన్నావదినలే..
-
'గల్ఫ్ మృతులకు రూ.5లక్షలు ఇవ్వాల్సిందే'
జగిత్యాల టౌన్ : గల్ఫ్‌లో మృతిచెందిన ప్రవాసుల కుటుంబాలను ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని జగిత్యాల ఎమ్మెల్యే టీ. జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన చిట్టం మల్లయ్య (42) గుండెపోటుతో సెప్టెంబర్ 17న యూఏఈలోని షార్జా లో మృతిచెందగా శుక్రవారం మృతదేహం స్వగ్రామానికి చేరింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై విభాగం ఉచితంగా అంబులెన్సు ద్వారా మృతదేహాన్ని పంపించింది. జగిత్యాల జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు నుంచి అంబులెన్స్ వెళుతుండగా కల్లెడ మాజీ సర్పంచ్ అంకతి గంగాధర్ నాయకత్వంలో మృతుని బంధువులు అంబులెన్సును ఆపారు. విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే టీ.జీవన్ రెడ్డి, ప్రవాసి మిత్ర అధ్యక్షుడు మంద భీంరెడ్డి జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని అంబులెన్సులోని మృతదేహంపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం జిలా కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి మహేశ్వర్ ను కలిసి గల్ఫ్ మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ గల్ఫ్ ఎన్నారైలు ప్రతినెలా ఒక వెయ్యి కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం మాతృదేశానికి పంపిస్తూ రాష్ట్రాభివృద్ధికి, దేశాభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో తగిన కేటాయింపులు చేయాలని, ప్రస్తుతమున్న సంక్షేమ పథకాలను గల్ఫ్ కార్మిక కుటుంబాలకు విస్తరింపచేయాలని డిమాండ్ చేశారు. -
ఎంపీపీపై లైంగిక వేధింపుల కేసు
చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి ఎంపీపీ తాడూరి కిష్టయ్యపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హుస్నాబాద్ ఏఎస్సై మోతిలాల్‌నాయక్ వివరాల ప్రకారం.. చిగురుమామిడి మండలపరిషత్ అధ్యక్షుడిగా పని చేస్తున్న తాడూరి కిష్టయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన వివాహితపై లైంగిక దాడి చేసినట్లు సదరు వివాహిత భర్త శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిష్టయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కిష్టయ్య గతంలో పేకాట కేసులో అరెస్టయ్యాడు. ఎంపీపీ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం టీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం సృష్టించింది. -
న్యాయం కోసం స్టేషన్‌కు వెళ్తే..
► తెరవెనుక పోలీసుల సెటిల్మెంట్లు? ► న్యాయంకోసం స్టేషన్‌కొస్తే ‘పంచాయితీ’ సలహాలు ► రౌడీషీటర్లతో పంచాయితీలు ► నేరుగా ఓ సీఐకి బాధితుడి ఫిర్యాదు ► వివాదాస్పద ఇంటిని పరిశీలించిన ఎస్పీ ► ఎస్సైపై వేటేస్తా: ఎస్పీ అనంతశర్మ ► నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్ సాక్షి, జగిత్యాల/జగిత్యాలటౌన్: ఇప్పటికే.. అవినీతి అపవాదులు ఎదుర్కొంటున్న ఖాకీలు తీరు మార్చుకోవడం లేదు. అవినీతి ఫిర్యాదులు నిరూపణ అయి ఇప్పటికే పలువురిపై వేటుపడినా అదే దారిన పయనిస్తున్నారు. అవకాశం వస్తే చాలు.. డబ్బులు వసూళ్లకు తెగబడుతున్న పోలీసులు తాజాగా సెటిల్మెంట్లపై దృష్టిసారించారు. ఒకవేళ సివిల్ కేసులు ఠాణాకు వస్తే.. కోర్టుకెళ్లమని సలహాలివ్వాల్సింది పోయి.. బయటే పంచాయితీలు పెట్టుకొమ్మని ఉచిత సలహా ఇస్తున్నారు. ముందే ఓ ఒప్పందానికి వచ్చి తమకు మచ్చిక చేసుకున్న వారికి అనుకూలంగా రౌడీషీటర్లనూ పంచాయితీల్లో ఉంచుతున్నారు. ఇది నమ్మశక్యం కాకున్నా.. జిల్లాలో పలుచోట్ల వాస్తవ పరిస్థితి మాత్రం ఇలానే ఉంది. న్యాయం కోసం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారిని పోలీసులే బయట పంచాయతీల్లో సమస్యను పరిష్కరించుకోవాలని తనకు రెండు ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందాయని స్వయంగా జిల్లా ఎస్పీ అనంతశర్మ చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. జిల్లా నడిబొడ్డున ఇదీ పరిస్థితి.. ఎనిమిదేళ్ల క్రితం... బుగ్గారం మండలం నేరెళ్లకు చెందిన రాజాగౌడ్ జిల్లా కేంద్రంలోని జమ్మిగద్దె ప్రాంతానికి చెందిన బైరి సత్తయ్యగౌడ్‌కు రెండు విడతలుగా రూ. 20లక్షలు ఇచ్చాడు. తీసుకున్న ఈ అప్పును తీర్చలేని సత్తయ్య రాజాగౌడ్‌కు తన ఇంటిని అమ్మేశాడు. నాలుగేళ్లు అదే ఇంటిలో ఉన్న సత్తయ్య కుటుంబ సభ్యులు తర్వాత ఇళ్లు విడిచివెళ్లిపోయారు. ఆ సమయంలో రాజాగౌడ్ ఇళ్లు అమ్ముకుందామనుకోగా.. జాయింట్ ప్రాపర్టీ కారణంగా అమ్మలేకపోయాడు. దీంతో రాజాగౌడ్ పోలీసులను ఆశ్రయించి.. తనకు ఇచ్చిన దానిపై వడ్డీతో సహా అందేలా న్యాయం చేయాలని కోరాడు. అదే సమయంలో సత్తయ్య భార్య రాజేశ్వరీ సైతం భర్త రాజాగౌడ్‌కు అసలు ఇళ్లే అమ్మలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సదరు పోలీసు అధికారి ఇరువురిని పిలిచి బయట పంచాయతీ పెట్టుకొమ్మని సలహా ఇచ్చారు. గత నెల 24న.. ఇరు వర్గాలు పట్టణంలోని ఓ ఫంక్షన్హాల్లో కూర్చొని మాట్లాడుకుందామనుకోగా.. అందులో రాజేశ్వరీ తరుపు నుంచి వచ్చిన నలుగురు రౌడీషీటర్లు రూ. 13 లక్షలు తీసుకుని వెళ్లిపోవాలని లేకపోతే అంతుచూస్తామని రాజాగౌడ్‌ను హెచ్చరించాడు. ఇదే క్రమంలో ఈ నెల 7న.. ఇంటి తాళాన్ని పగలగొట్టిన రాజేశ్వరీ అందులో ఉంటుంది. దీంతో రాజాగౌడ్ పై స్థాయి అధికారులను ఆశ్రయించాడు. విషయం వెలుగులోకి రావడంతో జిల్లా ఎస్పీ అనంతశర్మ వివాదానికి కారణమైన ఆ ఇంటిని శుక్రవారం పరిశీలించారు. సంఘటనపై ఆరా తీసిన ఎస్పీ ఈ వ్యవహారంలో ఓ ఎస్సై ప్రమేయముందనీ నిగ్గు తేల్చారు. త్వరలోనే సదరు ఎస్సైపై వేటు వేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్‌తో మాట్లా డి.. అనుమతి లేకుండా.. ఇంటి తాళాన్ని పగలగొట్టేలా రాజేశ్వరీని ప్రరేపించిన నలుగురు రౌడీషీటర్లపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని విలేకరులతో చెప్పారు. చెలరేగుతున్న రౌడీషీటర్లు.. నాలుగు నెలల క్రితం రౌడీషీటర్లతో సమావేశమైన ఎస్పీ అనంతశర్మ సెటిల్మెంట్లు చేసినా.. భూ తగాదాల్లో తలదూర్చినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీంతో నాలుగు మాసాల నుంచి జిల్లాలో స్తబ్దుగా ఉన్న రౌడీషీటర్లు మళ్లీ పెట్రేగిపోతున్నారు. ఇదే క్రమంలో జిల్లాలో పలు చోట్ల మళ్లీ సెటిల్మెంట్లకు దిగుతున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలో నలుగురు ఓ సెటిల్మెంట్లో పాల్గొనగా... ఇబ్రహీంపట్నంలోనూ ఓ రౌడీషీటర్‌పై తనకు ఫిర్యాదు అందిందని జిల్లా ఎస్పీ తెలిపారు. సెటిల్మెంట్లు, కబ్జాలకు పాల్పడే రౌడీషీటర్లపై ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ అనంతశర్మ హెచ్చరించారు. -
నలుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్
జగిత్యాల: జగిత్యాల జిల్లాలో నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లను ఎస్పీ అనంతశర్మ సస్పెండ్ చేశారు. తెరాస కార్యకర్త సల్మాన్ అనే వ్యక్తిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి మొద్దు కు కట్టేసిన విషయంలో హెడ్‌కానిస్టేబుల్ గోపాల్ రెడ్డితోపాటు కానిస్టేబుల్ బాలకృష్ణ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా హోలీ సందర్భంగా రాయికల్ లో డబ్బులు వసూలు చేసిన సంఘటనలో కానిస్టేబుళ్లు అంజయ్య, వేణులను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఆదేశాలిచ్చారు. -
దైవం పెట్టిన పరీక్ష
మెట్పల్లి(కోరుట్ల): పదో తరగతి పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థికి దైవం విషమ ‘పరీక్ష’ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణం దుబ్బాడాకు చెందిన వాల్గొట్ నరేశ్ శనివారం పదో తరగతి ఫిజిక్స్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అతడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. అటు పది పరీక్ష.. ఇటు తండ్రి మరణం.. ఎటుతేల్చుకోలేక తీవ్ర విషాదంలో మునిగిన నరేష్‌ను నిఖిల్ భరత్ స్కూల్ కరస్పాండెంట్ భృగు మహర్షి ఓదార్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అతన్ని పరీక్షకు హాజరయ్యేలా చేశాడు. నరేష్ పరీక్ష రాసి అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
కట్నం కోసం వేధించిన వారికి జైలు శిక్ష
జగిత్యాల జోన్ : కట్నం కోసం కోడల్ని వేధించిన కేసులో అత్తింటివారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.8 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మధు గురువారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అమరేందర్‌రావు కథనం ప్రకారం... జగిత్యాల పట్టణంలోని భీరయ్య గుడి ప్రాంతానికి చెందిన జ్యోత్స్నను చల్గల్ గ్రామానికి చెందిన మానాల మారుతికి ఇచ్చి 2008లో పెళ్లి జరిపించారు. పెళ్లి సమయంలో రూ.4 లక్షల కట్నం ఇచ్చారు. ఏడాది పాటు వీరి కాపురం అన్యోన్యంగానే సాగింది. వీరికి ఓ కుమారుడు కూడా జన్మించాడు. అప్పటి నుంచి భర్తతోపాటు మామ లక్ష్మీనారాయణ, అత్త ఈశ్వరమ్మ, బావ, ఆడబిడ్డలు మరో రూ.4 లక్షల కట్నం తేవాలని జ్యోత్స్నను శారీరకంగా, మానసికంగా వేధించారు. ఈ క్రమంలో భార్యను పుట్టింటికి పంపించి, మారుతి మరో పెళ్లి చేసుకున్నాడు. దీంతో బాధితురాలు వారిపై జగిత్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. అయినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో జగిత్యాల టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో ఆడబిడ్డ, బావపై కేసు నిరూపణ కాకపోవడంతో వారిని కేసు నుంచి తొలగించి, కోర్టులో భర్త, మామ, అత్త, రెండోభార్యపై చార్జీషీట్ దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి ఐపీసీ 498ఏ ప్రకారం వారికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఐదు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని వెల్లడించారు. డీపీ యాక్ట్ 4లో భాగంగా అత్తింటివారికి ఆరు నెలల జైలు శిక్ష, మూడు వేల జరిమానా విధించారు. రెండు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. అయితే ఈ కేసులో ఆరో ముద్దాయిగా ఉన్న రెండో భార్య లావణ్యపై కేసు నిరూపణ కాకపోవడంతో నిర్దోషిగా ప్రకటించారు.