సాక్షి, జగిత్యాల : ఇతర దేశాల్లో ఉన్న ఉపాధి కూలీలను తెలంగాణకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రానికి తెలపాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సూచించారు. లాక్డౌన్లో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా, రైతులకు మద్దతుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 5 కిలోల బియ్యంకు అదనంగా ఒక కిలో కలిపి రాష్ట్ర ప్రభుత్వం 6 కిలోల బియ్యం ఇస్తుందని తెలిపారు. జన్‌దన్ సంబంధించి 500 రూ.లు అకౌంట్లో జమ కావడం లేదని ఆరోపించారు. (ఆ ముగ్గురికి రాహుల్ అభినందనలు )
రాష్ట్రంలో క్విటాలుకు హమాలి ఛార్జ్ 40 రూ.లు వసూలు చేస్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 5రూ.ల హమాలి ఛార్జ్ ఉండేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి చార్జీలు లేకుండా అమలు చేశామని తెలిపారు. హమాలి ఛార్జితో రైతులు ఎకరానికి 1000రూ.లు, తాలు నెపంతో 1000 రూ.లు మొత్తంగా 2000/-రూ.లు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇంతవరకు రైతుబంధు ఊసే లేదని దుయ్యబట్టారు. రుణమాఫీ నెపంతో దీర్ఘకాలిక స్వల్పకాలిక రుణమాఫీలో 6శాతం అమలు లేకుండా పోయిందన్నారు. పసుపును మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేస్తామని కేసీఆర్ చట్టసభల్లో హామీ ఇచ్చాడు కానీ అమలు చేయడం లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. (కోవిడ్-19 : మహిళా రైతు ఔదార్యం )
Comments
Please login to add a commentAdd a comment