కరీంనగర్ బరిలో 28, పెద్దపల్లిలో 42 మంది
కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి
స్వతంత్రులకు గుర్తుల కేటాయింపు
ఇక పెరగనున్న పొలిటికల్ హీట్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మరో అంకం పూర్తయ్యింది. బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య తేలింది. సోమవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో తుది పోరులో తలపడే అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 28 మంది, పెద్దపల్లిలో 42 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఇందులో ప్రధాన పార్టీలకు చెందినవారితో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. సోమవారం నామినేషన్ ఉపసంహరణకు చివరిరోజు కావడంతో కరీంనగర్‌లో ఐదుగురు, పెద్దపల్లిలో ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులు విత్‌డ్రా చేసుకున్నారు. ఈ మేరకు ఫాం–5 పూరించి ఆర్వోలకు అందజేశారు. దీంతో రిటర్నింగ్ అధికారులు వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, స్వతంత్ర అభ్యర్థుల సమక్షంలో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు.
కరీంనగర్‌లో 2, పెద్దపల్లిలో 3 ఈవీఎంలు
ఒక స్థానంలో 15మంది అభ్యర్థులకు మించితే రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. పెద్దపల్లి బరిలో 42మంది ఉండటంతో మూడు ఈవీఎంలు, కరీంనగర్‌లో 28మంది అభ్యర్థులే ఉండటంతో రెండు ఈవీఎంలను ఉపయోగించాల్సి ఉంటుంది. దీనికి అనుగుణంగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులను ఎన్నికల బరిలో నుంచి తప్పించేందుకు ప్రధాన పార్టీల నేతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతోనే ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది బరిలో నిలిచినట్లు తెలుస్తోంది.
చీలిక ఓట్ల లెక్కల్లో అభ్యర్థులు
2019లో పెద్దపల్లి లోక్‌సభ బరిలో 18 మంది అభ్యర్థులుండగా, ఈసారి 42 మంది పోటీలో ఉన్నారు. 2019లో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో 15 మంది పోటీలో ఉండగా ఈసారి 28మంది ప్రధాన పా ర్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు కూడా బరి లో ఉన్నారు. పెద్దపల్లి పరిధిలో ప్రధాన పార్టీలకు రె బల్ అభ్యర్థుల బెడద లేదు. అయితే కరీంనగర్‌లో కాంగ్రెస్ టిక్కెట్ ఆశించి భంగపడిన అల్గిరెడ్డి ప్ర వీణ్‌రెడ్డి రెబల్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. దీంతో రెబల్ అభ్యర్థితో పాటు చిన్న పార్టీలు, స్వ తంత్ర అభ్యర్థులు ఓట్లు సాధించనున్నారు. వీరి ఓ ట్ల చీలిక వల్ల ఏ పార్టీకి నష్టం చేకూరుతుంది? ఎంత మేరకు వీరి ప్రభావం ఉండనుందనే లెక్కలపై అ న్ని పార్టీల్లో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి.
నేటి నుంచి పెరగనున్న ప్రచార జోరు..
ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు కీలక ఘట్టం ముగియడంతో అభ్యర్థులెవరో తేలిపోయింది. ప్రధాన పార్టీలతో పాటు, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మంగళవారం నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అభ్యర్థులు తమ ప్రణాళికను అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. ప్రచారాన్ని మరింత వేడెక్కించే పనిలో పడ్డారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు.
ఇవి చదవండి: లెక్క లేదంటే.. వేటే..!
Comments
Please login to add a commentAdd a comment