
సాక్షి, జగిత్యాల: జిల్లాలో దొంగతనాలు ఆగడంలేదు. సోమవారం రాత్రి కూడా జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్‌లో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. తలుపులకు వేసిన తాళాలను దొంగలు పగులగొట్టి ఓ ఇంట్లో రూ.20 వేల నగదు, 2 తులాల బంగారం, 2 తులాల వెండి దోచుకెళ్లారు. మరో రెండిళ్లలోని వారు అందుబాటులో లేకపోవడంతో సొత్తు ఎంత పోయిందో తెలియరాలేదు. దీని పై పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment