three houses
-
జగిత్యాలలో మూడిళ్లలో చోరీ
సాక్షి, జగిత్యాల: జిల్లాలో దొంగతనాలు ఆగడంలేదు. సోమవారం రాత్రి కూడా జగిత్యాల పట్టణంలోని అరవింద్ నగర్లో వరుసగా మూడిళ్లలో చోరీలు జరిగాయి. తలుపులకు వేసిన తాళాలను దొంగలు పగులగొట్టి ఓ ఇంట్లో రూ.20 వేల నగదు, 2 తులాల బంగారం, 2 తులాల వెండి దోచుకెళ్లారు. మరో రెండిళ్లలోని వారు అందుబాటులో లేకపోవడంతో సొత్తు ఎంత పోయిందో తెలియరాలేదు. దీని పై పోలీసులు క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. -
కర్నూలులో చెడ్డీ గ్యాంగ్ హల్చల్
కర్నూలు: కర్నూలు నగరంలోనూ చెడ్డి గ్యాంగ్ హల్చల్ చేసింది. హైదరాబాద్ తరహాలో దోపిడీలకు తెగబడింది. స్థానిక న్యూ కృష్ణా నగర్, ఆదిత్యనగర్, విఠల్ నగర్లలో చోరీలకు పాల్పడింది. మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి ఓ ఇంటికి నిప్పు పెట్టారు. నాలుగో ఇంట్లో చోరీకి వెళ్లడంతో స్థానికులు గుర్తించారు. బనియన్, చెడ్డీలు వేసుకున్న 25 ఏళ్ల యువకులు ఈ ముఠాలో ఉన్నట్టు వారు చెబుతున్నారు. స్థానికులు గుర్తించడంతో దొంగలు పరారయ్యారు. మగ్మములు, మహమ్మద్ ఇళ్లలో చోరీ జరిగింది. అయితే పోయిన సొమ్ము ఎంతనేది తెలియరాలేదు. -
'పురం'లో మళ్లీ దొంగలుపడ్డారు!
హిందూపురం అర్బన్ : హిందూపురంలోని వేర్వేరు ప్రాంతాల్లోని మూడిళ్లల్లో దొంగలుపడ్డారు. గోకుల్‌నగర్‌లోనే రెండు ఇళ్లలో చోరీలు జరిగాయి. 22 తులాల బంగారు నగలు, రూ.56 వేలు నగదును దొంగలు ఎత్తుకుపోయినట్లు బాధితులు టూ టౌన్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. గోకుల్‌నగర్‌కు చెందిన వెంకటచలపతి ఈ నెల 4న కర్ణాటక ప్రాంతానికి పని నిమిత్తం వెళ్లారు. వారింట్లో అద్దెకు ఉంటున్న చంద్రమోహన్ తన పిల్లల పరీక్షల కోసం బెంగళూరు వెళ్లారు. నాలుగైదు రోజుల నుంచి తాళాలు వేసిన రెండు ఇళ్లలో దొంగలు చొరబడి బీరువాల్లోని నగదు, బంగారు ఎత్తుకెళ్లారు. వెంకటాచలపతికి చెందిన ఇంటిలో 18 తులాల బంగారు. రూ.40 వేలు నగదు ఎత్తుకుపోగా, చంద్రమోహన్ ఇంటిలో 4 తులాల బంగారు నగలు, రూ.16 వేల నగదు చోరీ చేశారు. ఉదయం వచ్చిన చలపతికి ఇంటి తాళాలు తెరచి ఉండటంతో చోరీ జరిగిందని తెలుసుకుని చంద్రమోహన్కూ ఫోన్ చేసి పిలిపించారు. ఇద్దరూ కలసి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలోని మేళాపురంలో బేల్దారి నరసింహమూర్తి ఇంటిలోనూ గురువారం రాత్రి చోరీ జరిగింది. బెంగళూరుకెళ్లి వచ్చేలోగానే ఇంటిలోని బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు చోరీకి గురైనట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మూడిళ్లలో చోరీ
గుత్తి (గుంతకల్లు) : గుత్తి పట్టణంలోని ఎస్బీఐ కాలనీలో గురువారం అర్ధరాత్రి తర్వాత మూడిళ్లలో దొంగలు పడ్డారు. హరి అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి అహోబిలం వెళ్లాడు. తాళం వేసిన వీరి ఇంటిలోకి దుండగులు ప్రవేశించి బీరువాలో రెండు జతల బంగారు కమ్మలు, రూ. 5 వేల నగదు అపహరించారు. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసులు, ఆదిశేషయ్య ఇళ్లలో కూడా దొంగలు పడ్డారు. వీరిళ్లలో నగదు, బంగారు ఆభరణాలు లేకపోవడం వల్ల కొన్ని విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. బాధితుడు హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల కాలంలో గుత్తి, గుత్తి ఆర్ఎస్లలో చోరీలు అధికంగా జరుగుతున్నాయి. పోలీసులు రాత్రి సమయాల్లో నిఘా, గస్తీని ముమ్మరం చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
బాన్సువాడలో మూడిళ్లలో చోరీ
బాన్సువాడ: నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలకేంద్రం పాత బాన్సువాడ ప్రాంతంలోని మూడిళ్లలో చోరీ జరిగింది. స్థానికంగా నివాసముంటున్న బసవరాజు, నాగరాజు, మరో వ్యక్తి ఇళ్లలో ఒకేసారి దొంగలు పడి రూ.15 వేల నగదు, 5 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. నిజామాబాద్‌లో ఓ ఫంక్షన్‌కు హాజరై తిరిగి ఇంటికి వచ్చి చూడగా ఈ విషయం బయటపడింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అదును చూసి దోచేస్తున్నారు
భీమడోలు/ ఏలూరు అర్బన్/పెంటపాడు : దొంగలు చెలరేగిపోతున్నారు. అదును చూసి ఉన్నదంతా దోచుకుపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లు లక్ష్యంగా తెగబడుతున్నారు. గురువారం రాత్రి జిల్లాలో భీమడోలు మండలం పూళ్ల గ్రామం, ఏలూరు బీడీ కాలనీలో చోరీలు జరగ్గా, శుక్రవారం పట్టపగలే పెంటపాడులో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పూళ్లలో తాళాలు పగులకొట్టి.. భీమడోలు: భీమడోలు మండలం పూళ్ల గ్రామంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని ఆరు కాసుల బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదును ఆపహరించుకుపోయారు. భీమడోలు హెడ్‌కానిస్టేబుల్ షేక్ అమీర్ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పూళ్ల గ్రామానికి చెందిన యిర్రింకి సీతారామ్ కుటుంబసభ్యులు వారి బంధువుల ఇంట్లో వివాహానికి గురువారం రాత్రి తాడేపల్లిగూడెం వెళ్లారు. శుక్రవారం ఉదయం 5 గంట లకు తిరిగి ఇంటికి రాగా తలుపు తాళాలు పగులకొట్టి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులకొట్టి వస్తువులు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. రెండు ఉంగరాలు, చెవి దిద్దులు, జత మ్యాటీలు జత తదితర బంగారు ఆభరణాలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు చోరీ జరిగినట్టు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెంటపాడులో పట్టపగలే.. పెంటపాడు : పెంటపాడులో పట్టపగలే చోరీ జరిగింది. రూ.35 వేల నగదు, బంగారు, వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయి. పెంటపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు తెలిపిన వివరాలు ప్రకారం.. పెంటపాడు వెలంపేటలోని కర్రివారివీధిలో ఆకుల రమాదేవి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భర్త తాతారావు సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తున్నారు. రోజూ మాదిరిగానే వీరు ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంటి తలుపు పగులకొట్టి ఉంది. బీరువాలో దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సుమారు రెండు కాసుల విలువైన బంగారు ఆభరణాలు, వెండి పట్టాలు, కొంత నగదు చోరీ జరిగినట్టు పోలీసులకు సమాచారం అందించారు. హెచ్‌సీ శ్రీనివాసరావు సంఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో ఏడు కాసులు, నగదు ఏలూరు అర్బన్: తాళాలు పగులగొట్టి ఇంట్లో ప్రవేశించిన దొంగలు బంగారు ఆభరణాలు అపహరించుకుపోవడంతో బాధితుని ఫిర్యాదు మేరకు ఏలూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం కె.కన్నాపురంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న బత్తుల రాజు తల్లి వెంకటరమణతో కలిసి ఏలూరుS బీడీ కాలనీలో నివాసముంటున్నారు. రాజు తన తల్లితో కలిసి ఈ నెల 13న హైదరాబాద్‌లో బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ నేపథ్యంలో వారి ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి ఉండటం గమనించిన పొరుగింటి వారు రాజుకు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఇక్కడకు చేరుకున్న రాజు ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా చోరీ జరిగినట్టు గుర్తించారు. బీరువాలోని ఏడు కాసుల బంగారు నగలు, నగదు మాయమయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పట్టపగలు మూడిళ్లలో చోరీ
ఆదిలాబాద్ (మంచిర్యాల): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో శుక్రవారం మూడిళ్లలో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. వివరాలు.. సజ్జనపు మనోహర్ ఇంట్లో 7 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10 వేల నగదు, గురనాథం వెంకటేశ్వర్ గౌడ్ ఇంట్లో తులం బంగారం, 30 తులాల వెండి, గురునాథం సురేష్ గౌడ్ ఇంట్లో కొన్ని వెండి ఆభరణాలు దొంగిలించారు. వెంకటేశ్వర్, సురేష్‌లు బెల్లంపల్లిలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు. మనోహర్ భార్య ఊరెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్‌స్వాడ్‌ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.