పట్టపగలు మూడిళ్లలో చోరీ | theft in three houses at adilabad | Sakshi
Sakshi News home page

పట్టపగలు మూడిళ్లలో చోరీ

Published Fri, Feb 27 2015 6:59 PM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM

theft in three houses at adilabad

ఆదిలాబాద్ (మంచిర్యాల): ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల కేంద్రంలోని రామ్‌నగర్‌లో శుక్రవారం మూడిళ్లలో దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. వివరాలు.. సజ్జనపు మనోహర్ ఇంట్లో 7 తులాల బంగారం, 40 తులాల వెండి, రూ.10 వేల నగదు, గురనాథం వెంకటేశ్వర్ గౌడ్ ఇంట్లో తులం బంగారం, 30 తులాల వెండి, గురునాథం సురేష్ గౌడ్ ఇంట్లో కొన్ని వెండి ఆభరణాలు దొంగిలించారు. వెంకటేశ్వర్, సురేష్‌లు బెల్లంపల్లిలో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల చేశారు. మనోహర్ భార్య ఊరెళ్లింది. మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడ్డారు. పోలీసులకు సమాచారం అందించడంతో డాగ్‌స్వాడ్‌ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement