ప్రతికాత‍్మక చిత్రం
కీసర(హైదరాబాద్): పెళ్లి వేడుకలో వధువు తండ్రి బ్యాగులో డబ్బులు చోరీ చేసిన వ్యక్తిని శుక్రవారం కీసర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కీసర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ అయోధ్యనగర్‌లో కూరగాయాల వ్యాపారం చేసే పి.కృష్ణ(51) ఈనెల 6న కీసర–భోగారం రోడ్డులోని కేబీఆర్ ఫంక్షన్‌హాల్ జరిగిన వివాహ వేడుకకు వచ్చాడు. వేడుకల్లో పెద్ద మనిషిగా వ్యవహరించి వధువు తండ్రి బ్యాగులో ఉన్న రూ.2.35 లక్షలు దొంగతనం చేసి పారిపోయాడు. వధువు తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు శుక్రవారం నిందితుడిని పట్టుకొని రూ.లక్ష స్వాధీనం చేసుకొని అతడిని రిమాండ్‌కు తరలించారు.
మరో ఘటనలో..
బుద్ధానగర్‌లో డ్రగ్స్ స్వాధీనం
పోచారం: బోడుప్పల్ బుద్ధానగర్‌లో దొరికిన డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఘట్‌కేసర్ ఎక్సైజ్ స్టేషన్ సీఐ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్‌లోని బుద్ధానగర్‌లో గల ఎండీఆర్ విశ్వ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ నం.101ను తనిఖీ చేశారు. రెండు ఎల్‌ఎస్‌డీ ప్యాకెట్లు, ఒకటి ఎండీఎంఏ ప్యాకెట్ దొరికాయి. డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడు అనురాగ్ ప్రశాంత్ రన్డే (29)ను రిమాండ్‌కు చేశారు. తనిఖీలో ఎస్‌టీఎఫ్ ఎస్సైలు కృష్ణకాంత్, విష్ణుగౌడ్, ఘట్‌కేసర్ ఎస్సైలు పురుషోత్తంరెడ్డి, శ్రావణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment