పదో తరగతి పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థికి దైవం విషమ ‘పరీక్ష’ పెట్టింది.
మెట్‌పల్లి(కోరుట్ల): పదో తరగతి పరీక్షకు సిద్ధమైన ఓ విద్యార్థికి దైవం విషమ ‘పరీక్ష’ పెట్టింది. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణం దుబ్బాడాకు చెందిన వాల్గొట్ నరేశ్ శనివారం పదో తరగతి ఫిజిక్స్ పరీక్ష రాయడానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అతడి తండ్రి గుండెపోటుతో మరణించాడు. అటు పది పరీక్ష.. ఇటు తండ్రి మరణం.. ఎటుతేల్చుకోలేక తీవ్ర విషాదంలో మునిగిన నరేష్‌ను నిఖిల్ భరత్ స్కూల్ కరస్పాండెంట్ భృగు మహర్షి ఓదార్చి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అతన్ని పరీక్షకు హాజరయ్యేలా చేశాడు. నరేష్ పరీక్ష రాసి అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.