దుఃఖం తోనే పది పరీక్షకు | tenth student writes ssc exam after father dies | Sakshi
Sakshi News home page

దుఃఖం తోనే పది పరీక్షకు

Published Mon, Mar 30 2015 3:48 PM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM

tenth student writes ssc exam after father dies

అదిలాబాద్: తండ్రి చనిపోయి పుట్టెడు బాధలో ఉండి కూడా పదో తరగతి విద్యార్థి పరీక్షకు హజరయ్యాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా దండెపల్లి మండలం పెద్దపేటలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాశ నవేని సుభాష్ స్థానిక పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. సుభాష్ తండ్రి శంకరయ్య అనారోగ్యంతో సోమవారం మృతిచెందాడు. ఈ రోజే విద్యార్థికి ఆంగ్ల పరీక్ష ఉండటంతో అతను దుఃఖంతోనే హాజరయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement