
సాక్షి, జగిత్యాల: జిల్లాలోని పోరండ్ల గ్రామంలో శుక్రవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. మద్యానికి బానిసైన కొడుకుని కన్న తండ్రే గొడ్డలితో నరికి చంపాడు. గ్రామానికి చెందిన బోదలపు రాజయ్య కుమారుడు రవి (28) ప్రతిరోజూ తాగుతూ కుటుంబ సభ్యులను వేధించేవాడు. నిన్న రాత్రి తాగిన మైకంలో తండ్రితో గొడవపడ్డాడు. అనంతరం వేధింపులకి తట్టుకోలేక నిద్రిస్తున్న కొడుకుని రాజయ్య గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment