చిగురుమామిడి(హుస్నాబాద్): చిగురుమామిడి ఎంపీపీ తాడూరి కిష్టయ్యపై సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పోలీస్‌స్టేషన్‌లో లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హుస్నాబాద్ ఏఎస్సై మోతిలాల్‌నాయక్ వివరాల ప్రకారం..
చిగురుమామిడి మండలపరిషత్ అధ్యక్షుడిగా పని చేస్తున్న తాడూరి కిష్టయ్య సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ధర్మారం గ్రామానికి చెందిన వివాహితపై లైంగిక దాడి చేసినట్లు సదరు వివాహిత భర్త శనివారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిష్టయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. కిష్టయ్య గతంలో పేకాట కేసులో అరెస్టయ్యాడు. ఎంపీపీ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కుపోవడం టీఆర్‌ఎస్ శ్రేణుల్లో కలకలం సృష్టించింది.