కేసీఆర్.. మూర్ఖపు ఆలోచనలు మానుకో!
హైదరాబాద్: రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ ప్రభుత్వం గొప్పలకు పోతుందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత టి.జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూర్ఖపు ఆలోచనలు మానుకుని.. లౌకికవాదిగా వ్యవహరించాలని సీఎం కేసీఆర్ కు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి సూచించారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ పథకం, అభయ హస్తం, షాదీ ముబారక్ సహా ఏ సంక్షేమ పథకానికీ ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. వాస్తు దోషం పేరుతో రాష్ట్ర సచివాలయాన్ని తొలగించి, కొత్త వాటిని నిర్మించడం వల్ల రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడుతుందని జీవన్రెడ్డి పేర్కొన్నారు.