'విమలక్క కార్యాలయాన్ని తెరిపించండి'
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యాలయాన్ని సీజ్ చేయడం సమంజసంగా లేదని కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం శాసనసభ జీరో అవర్‌లో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. అరుణక్క కార్యాలయంలో నిషేధం ఉన్న ఎలాంటి సాహిత్యం దొరక్కపోయినా కార్యాలయాన్ని సీజ్ చేయడం తగదన్నారు. దానిని వెంటనే తెరిపించాలని కోరారు.