
'పంచె కట్టినంత మాత్రాన ఆయన రైతు అవుతాడా?'
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ డ్డి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
కరీంనగర్(రాయకల్): రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ డ్డి పంచె కట్టినంత మాత్రాన రైతు కాలేడని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కరీంనగర్ జిల్లా సార్తవాయి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు గంగరాజం కుటుంబాన్ని శుక్రవారం ఆయన పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రతిష్ట ఎక్కడ మసకబారుతుందోనని కరవు మండలాలను ప్రకటించడం లేదని ఆయన విమర్శించారు.
కేంద్రహోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక 17 వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారంటూ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తాననని చెప్పి ఆత్మహత్యల తెలంగాణాగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు.