రైతులు బలవన్మరణం చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో ..
కరీంనగర్: రైతులు బలవన్మరణం చెందుతున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని టీకాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డి అన్నారు. కేంద్రంపై ఆరోపణలు, ప్రచార ఆర్భాటాలకే ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. ఆరోపణలతో కాలం వెళ్లదీయకుండా పంటల ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకుని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. లేకపోతే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందని అన్నారు.