తెలంగాణ పక్షపాతి వైఎస్సార్
-
వైఎస్సార్ చొరవతోనే ప్రాజెక్ట్‌లరూపకల్పన
-
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
జగిత్యాల రూరల్: తెలంగాణకు సాగునీర ందించాలనే సంకల్పంతో ప్రాజెక్ట్‌ల రూపకల్పన చేసిన రాజశేఖరరెడ్డి రైతుపక్షపాతిగా నిలిచారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని తన నివాసగృహంలో ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్‌తోకలిసి వైఎస్సార్ వర్ధంతిని శుక్రవారం నిర్వహించారు. ముందుగా వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ ప్రమాణస్వీకారం చేసి వ్యవసాయానికి 9గంటల ఉచితవిద్యుత్ ఇచ్చారని కొనియాడారు. పంటకు మద్దతు ధర కల్పించడం, రుణమాఫీ కల్పించి రైతుల్లో వ్యవసాయంపై నమ్మకం కలిగేలా చేశారన్నారు. వైఎస్సార్ భౌతికంగా దూరమైనా ప్రజలమదిలో ఇంకా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సంక్షేమపథకాలు దేశప్రతిష్టతను పెంపొందించాయన్నారు. నిరుపేద విద్యార్థులకు చదువు దూరంకాకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. 108 ద్వారా ఎంతో మందికి ప్రాణాలు కాపాడిన ఘనత వైఎస్సార్‌దేనని, 108కు వైఎస్సార్ అంబులెన్స్‌గా నామకరణం చేయాలని కోరారు. తెలంగాణలోని ప్రాజెక్ట్‌లకు జాతీయ హోదా తీసుకురావాలని ఎంతో కృషి చేశారన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఎల్లంపల్లి నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందన్నారు. సారంగాపూర్ జెడ్పీటీసీ భూక్య సరళ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బండ శంకర్, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, వైస్ ఎంపీపీ గంగం మహేశ్, నాయకులు గర్వందుల నరేశ్‌గౌడ్, గోపి రాజేశ్, ముకేశ్‌ఖన్నా పాల్గొన్నారు.