పాల్వాయికి అశ్రు నివాళి
పాల్వాయికి అశ్రు నివాళి
Published Sun, Jun 11 2017 4:05 AM | Last Updated on Fri, Mar 22 2019 6:13 PM
- స్వగ్రామం ఇడికుడలో అధికార లాంఛనాలతో దహన సంస్కారాలు
- అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు..గాంధీభవన్‌లో నేతల నివాళి
చండూరు: హిమాచల్‌ప్రదేశ్‌లోని కులూమనాలిలో గుండె పోటుతో హఠాన్మరణం చెందిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అంత్యక్రియలు శనివారం సాయంత్రం ఆయ న స్వగ్రామం ఇడికుడలోని వ్యవసాయ క్షేత్రంలో అధికార లాంఛనాలతో జరిగాయి. శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీభవన్ నుంచి బయలుదేరిన పాల్వాయి పార్థి వదేహం చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల మీదుగా ఇడికుడ గ్రామానికి చేరుకుంది. సంద ర్శకుల కోసం ఆయన ఇంటిముందు భౌతికకాయాన్ని ఉంచగా నియోజకవర్గ ప్రజలు, అభిమానులు నివాళులర్పించారు. 4.30 గంటలకు వేలాది మంది ప్రజల మధ్య మొదలైన అంతిమయాత్ర 6.30 గంటలకు వ్యవసాయ క్షేత్రానికి చేరింది. ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ గౌరవ్‌ఉప్పల్ సమక్షంలో పోలీసులు 3 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపిన తర్వాత పెద్ద కుమారుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి పాల్వాయి చితికి నిప్పంటించారు.
గాంధీభవన్‌లో అరగంటపాటు..
పాల్వాయి భౌతికకాయానికి గాంధీభవన్‌లో పలువురు నేతలు నివాళులర్పించారు. శనివారం ఉదయం పాల్వాయి నివాసం నుంచి భౌతికకాయాన్ని గాంధీభవన్‌కు తరలించారు. కార్య కర్తల సందర్శనార్థం అరగంటపాటు ఉంచారు. భౌతికకా యంపై పార్టీ జెండా, పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసన మండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పీఏసీ చైర్‌పర్సన్ జె.గీతారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శులు ఆర్.సి. కుంతియా, వి.హనుమంతరావు, మాజీ మంత్రులు డి.శ్రీధర్ బాబు, టి.జీవన్‌రెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, దానం నాగేందర్ తదితరులు పాల్వాయి భౌతికకాయానికి నివాళులర్పించారు.
పాల్వాయి తెలంగాణ కోసం కృషి చేశారు: సురవరం
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రం కోసం కృషి చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా, రాష్ట్రమంత్రిగా, ఎంపీగా ప్రజాసమస్యలపై పనిచేశారన్నారు. పాల్వాయి ఆకస్మిక మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
ప్రముఖుల సంతాపం..
పాల్వాయికి అనేక మంది ప్రముఖులు ఘనంగా నివాళులర్పించారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, ఎంపీలు కే.కేశవరావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జి నాగార్జున్‌రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వాయిలార్ రవి, జెడ్పీ చైర్మన్ బాలూనాయక్, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి రాజగోపా ల్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, పూల రవీందర్, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వేముల వీరే శం, గ్యాదరి కిశోర్, మాజీ ఎంపీ మల్లు రవి, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ అధ్యక్షుడు జాజుల శ్రీను, తదితరులు ఘనంగా నివాళులర్పించారు.
Advertisement
Advertisement