
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం అన్యాయం తొలగించిందంటూ కాంట్రాక్ట్ నర్సులు శుక్రవారం డీఎంహెచ్‌ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని గాంధీభవన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నర్సుల మధ్య తోపులాట జరిగింది.
పలువురు గాయాల బారిన పడ్డారు. దీంతో గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ నర్సులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయమై నర్సులు హెచ్‌ఆర్సీనీ సైతం ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment