DMHO office
-
కోనసీమ: వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం
సాక్షి, కోనసీమ జిల్లా: జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో మామూళ్ల కలకలం రేపుతోంది. ప్రతి పనికి కార్యాలయంలో మామూళ్లు వసూలు చేస్తున్నారంటూ వాట్సాప్‌లో మెడికల్ ఆఫీసర్లు చర్చించుకుంటున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారులు స్పందించారు. వైద్య ఆరోగ్య శాఖ జిల్లా కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై డీఎంహెచ్‌వో దుర్గారావు దొర ఆరా తీశారు. శ్రీధర్ అనే క్లర్క్ మామూళ్లు వసూలు చేసినట్లు నిర్ధారణ అయ్యింది.మెడికల్ ఆఫీసర్లను డీఎంహెచ్‌వో తన కార్యాలయానికి పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎస్‌ఆర్‌లో ఎంట్రీలు నమోదు చేసేందుకు, ప్రసూతి సెలవులకు, నాలుగు నుంచి పదివేల రూపాయలు చొప్పున వసూలు చేసినట్టు సమాచారం. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.కాగా, రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖకు అవినీతి రోగం పట్టుకుంది. లంచాలు మరిగిన కొందరు అధికారులు సొంత శాఖ ఉద్యోగులనే డబ్బు కోసం వేధింపులకు గురిచేస్తున్న వ్యవహారం ఆ శాఖలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఉన్నతాధికారుల అనుమతుల్లేకుండా జిల్లాల్లో అనధికార డిప్యుటేషన్ల్లోనూ డీఎంహెచ్‌వోలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.అనంతపురం జిల్లాలో 20 మందికిపైగా ఉద్యోగులు డీఎంహెచ్‌వో కార్యాలయంలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు అధికారులకు ఫిర్యాదులందాయి. పనిచేయాల్సిన చోట కాకుండా జిల్లా కేంద్రంలో కొనసాగడానికి వీరు పెద్ద ఎత్తున ఓ ఉన్నతాధికారికి లంచాలు ముట్టజెప్పినట్టు విమర్శలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.గుంటూరు డీఎంహెచ్‌వో ఆఫీస్‌లోనూ అధికారుల అనుమతుల్లేకుండానే కొందరు శాశ్వత, కాంట్రాక్టు ఉద్యోగులు డిప్యుటేషన్‌పై కొనసాగుతున్నారు. అర్బన్ పీహెచ్‌సీల్లో తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు,చిరుద్యోగులను క్లర్కులుగా కొనసాగిస్తూ వారి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం అన్యాయం తొలగించిందంటూ కాంట్రాక్ట్ నర్సులు శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని గాంధీభవన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నర్సుల మధ్య తోపులాట జరిగింది. పలువురు గాయాల బారిన పడ్డారు. దీంతో గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ నర్సులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయమై నర్సులు హెచ్ఆర్సీనీ సైతం ఆశ్రయించారు. -
అధికంగా వసూలు చేస్తే సీజ్ చేస్తా
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో చాంబర్లో పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగీ, టైఫాయిడ్ పేరుతో అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రోగులకు మానవత దృక్పథంతో వైద్యసేవలు అందించాలన్నారు. కొంత మంది వైద్యులు డెంగీ టెస్ట్‌ల పేరిట అధిక మొత్తంలో రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వివరాలు అందిస్తే తగిన పారితోషకం అందజేస్తామన్నారు. రోగులను భయభ్రాంతులకు గురి చేయకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. సమావేశంలో పీవోడీటీటీ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన, వైద్యులు అల్కా నరేశ్, అవినాశ్, అశోక్, శ్యామల, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
అవినీతి జబ్బు!
సాక్షి, మెదక్: ‘‘ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల చేతులు తడపనిదే ఏ పనీ జరగడం లేదు. న్యాయంగా రావాల్సిన ప్రభుత్వ లబ్ధిని కూడా.. ఎంతో కొంత ముట్ట జెప్పకపోతే ఫైల్ కదలని పరిస్థితి నెలకొంది. తాజాగా జిల్లాలో డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసి మృతి చెందిన ఓ మహిళ కుటుంబానికి న్యాయంగా రావాల్సిన బెనిఫిట్స్‌ను అందించడానికి రూ.30వేలు లంచం అడిగిన సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ’’ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంపై ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు బాధితుడు పూర్ణచందర్ తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. డబ్బులిస్తేనే పని.. శివ్వంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రైమరీ హెడ్‌నర్స్‌గా పనిచేస్తున్న లలిత అనే ఉద్యోగస్తురాలు ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు. ఆమె కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన బెన్ఫిట్స్ కోసం ఆమె కుమారుడు పూర్ణచందర్ అక్కడి ఆస్పత్రి అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. దీంతో అక్కడ విధులు నిర్వహించే యూడీసీ నర్సింలు మెదక్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీని కలవాలని, అతడు అడిగిన మొత్తం ఇస్తేనే పని జరుగుతుందని చెప్పాడని బాధితుడు పూర్ణచందర్ తెలిపారు. ఈ విషయంపై పూర్ణచందర్ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీని కలువగా తనకు రూ.30వేలు ఇస్తేనే పనులు జరుగుతాయని చెప్పడంతో బాధితుడు రూ.15వేలకు ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పట్టుకున్న ఏసీబీ అధికారులు.. దీంతో మంగళవారం ఏసీబీ అధికారులు చెప్పిన విధంగా పూర్ణచందర్ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీకి రూ.15వేల లంచం ఇచ్చాడు. లంచం డబ్బులు తీసుకోగానే సీనియర్ అసిస్టెంట్ తన వాహనంపై ఐసీఐసీఐ బ్యాంకు వద్ద ఆగాడు. అతన్ని వాహనాన్ని వెంబడించిన ఏసీబీ అధికారులు షౌకత్‌అలీని డీఎంహెచ్ఓ కార్యాలయానికి తీసుకొచ్చి లంచం డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. లంచం కోసం వేధించారు: పూర్ణచందర్ మా అమ్మ లలిత 30 సంవత్సరాల వైద్యశాఖలో విధులు నిర్వహించి ఆరు నెలల క్రితం గుండెపోటుతో మరణించింది. ఆమెతోపాటు విధులు నిర్వహించిన యూడీసీ నర్సింలు కనికరం చూపాల్సింది పోయి అమ్మకు రావాల్సిన బెన్ఫిట్స్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాల్సిందేనని వేధించాడని బాధితుడు పూర్ణచందర్ వాపోయాడు. ఆయనతోపాటు మెదక్‌లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో విధులు నిర్వహించే సీనియర్ అసిస్టెంట్ షౌకత్అలీలు కలిసి రూ.30వేలు డిమాండ్ చేశారు. వారి వేధింపులు భరించలేకనే ఏసీబీ అధికారులను ఆశ్రయించాను. ఉలిక్కిపడ్డ ప్రభుత్వ ఉద్యోగులు.. మెదక్ డీఎంహెచ్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకోవడంతో జిల్లాలోని ఉద్యోగులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత రెండేళ్ల క్రితం న్యాయస్థానమైన మెదక్ కోర్టులో ఓ ఉద్యోగి లంచం తీసుకుంటుండగా పట్టుబడిన విషయం విధితమే. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఎలాంటి ఏసీబీ దాడులు జరగలేదు. తిరిగి రెండేళ్ల తరువాత ఏసీబీ దాడితో జిల్లాలోని ఉద్యోగస్తులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. లంచం అడిగితే సమాచారం ఇవ్వండి లంచం ఎవరు అడిగినా వెంటనే 94405 56149కు ఫోన్‌చేసి సమాచారం అందించాలని ఏసీబి డీఎస్పీ రవికుమార్ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్ఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ షౌకత్ అలీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యండ్‌గా పట్టుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎవరు లంచం అడిగినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు రహస్యంగా ఉంచుతామని చెప్పారు. సంపాదనకు మించి అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నా..వారిపై దాడులు చేసే అధికారం తమకు ఉందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేయించుకునేందుకు ఎవరు లంచం ఇవ్వకూడదని, ఎవరైన లంచం డిమాండ్‌చేస్తే మాకు సమాచారం ఇవ్వాలన్నారు. – రవికుమార్, ఏసీబీ డీఎస్పీ -
ప్రభుత్వ కార్యలయం ఎదుట వివాహిత హల్చల్
కొత్తగూడెంరూరల్: కొత్తగూడెం డివిజన్లో డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓగా విధులు నిర్వహిస్తున్న బి.భాస్కర్‌నాయక్ తనను వివాహం చేసుకుని, ఇప్పుడు తానెవరో తెలియదంటూ బుకాయిస్తున్నాడని ఓ మహిళ మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట ఉరి వేసుకుంటానంటూ..హల్చల్ చేసింది. బాధితురాలి కథనం ప్రకారం.. జూలూరుపాడు మండలం పాపకొల్లుకు చెందిన ఆమెకు నాలుగేళ్ల క్రితం వివాహమై, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే భర్త చనిపోయాక హైదరాబాద్‌లోని ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తోంది. కొంతకాలం తర్వాత అక్కడే విధులు నిర్వహిస్తున్న భాస్కర్‌నాయక్‌తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆ మహిళను భాస్కర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. అక్కడి నుంచి జిల్లాకు బదిలీపై వచ్చిన భాస్కర్ ఆమెను పట్టించుకోకపోవడంతో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయానికి వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె డయల్ 100కు ఫోన్ చేయడంతో సీఐ కుమారస్వామి సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. మహిళను, భాస్కర్ నాయక్‌ను స్టేషన్‌కు పిలిపించి మాట్లాడారు. తనను వివాహం చేసుకుని, ఇప్పుడు పట్టించుకోవడం లేదని, తాను గతంలో హైదరాబాద్ పోలీసులకు సైతం ఫిర్యాదు చేశానని తెలిపింది. కాగా భాస్కర్ మాత్రం తనకు, ఆమెకు ఎలాంటి సంబంధం లేదని, ఆమెకు ఉద్యోగం కావాలంటే పెట్టించానని తెలిపారు. దీంతో తిరిగి హైదరాబాద్‌లోనే కేసు పెట్టాలని సీఐ కుమారస్వామి ఆమెకు సూచించి పంపించారు. కాగా డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద అదే శాఖలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశమైంది. -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
కలెక్టర్ ముత్యాలరాజు నెల్లూరు(అర్బన్): డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ముత్యాలరాజు పేర్కొన్నారు. ఆయన శుక్రవారం రాత్రి స్థానిక సంతపేటలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం ప్రోగ్రాం ఆఫీసర్లు, అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు సేవలందించడంలో పీహెచ్‌సీలు ఫర్ఫార్మెన్స్ సాధించాల్సిందేనన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులను 100శాతం చేయాలని కోరారు. గర్భిణులకు తగిన మందులు, టీకాలు సకాలంలో అందజేయాలన్నారు. మాతా, శిశు మరణాలను అరికట్టాలన్నారు. ప్రతి వారం ప్రోగ్రాం అధికారులు పీహెచ్‌సీలను తనిఖీ చేసి పూర్తి స్థాయిలో సేవలపై తనకు డీఎంహెచ్ఓ ద్వారా నివేదిక ఇవ్వాలని కోరారు ఎన్ఆర్హెచ్ఎం బడ్జెట్‌పై సమీక్షించారు. మందుల కొరత రాకుండా చూసుకోవాలని, ముందుగానే తగిన ఇండెంట్ పెట్టుకోవాలని సూచించారు. రెండు వారాలకోసారి కలెక్టరేట్లో డీఎంహెచ్ఓ, డీసీహెచ్, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్లు, లెప్రసీ అధికారి, క్షయనివారణ అధికారి తదితర అధికారులతో సమావేశాన్ని నిర్వహిస్తానని తెలిపారు. ఈ సమావేశాల్లో కచ్చితమైన సమాచారం ఇవ్వాలని కోరారు. సమావేశంలో డీఎల్ఓ డాక్టర్ రమాదేవి, క్షయనివారణ అధికారి సురేష్‌కుమార్ పాల్గొన్నారు. -
ఆశలకు కనీస వేతనాలు ఇవ్వాలి
మచిలీపట్నం (చిలకలపూడి) : ఆశ వర్కర్లకు ప్రభుత్వం కనీస వేతనం నిర్ణయించి అమలు పరచాలని ఏపీ వలంటీర్ హెల్త్ వర్కర్స్ (ఆశ) యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.కమల అన్నారు. స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయం వద్ద సీఐటీయు ఆధ్వర్యంలో ఆశ వర్కర్లు ధర్నా నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ వర్కర్లకు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్న పారితోషకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం నిర్ణయించి అమలు చేయాలని కోరారు. రెండు నెలలుగా చెల్లించాల్సి ఉన్న పారితోషికం బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. మూడేళ్లుగా యూనిఫాం అలవెన్సును చెల్లించలేదని చెప్పారు. అర్హులైన ఆశ వర్కర్లకు ఏఎన్ఎం శిక్షణ ఇచ్చి రెండో ఏఎన్ఎంలుగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. అనంతరం డీఎంహెచ్‌వో ఆర్.నాగమల్లేశ్వరికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం నాయకురాళ్లు పి.ధనశ్రీ, పి.కమల, ఎస్.హేమలత, పి స్వరూపరాణి, సీఐటీయు నాయకులు బూర సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
విచారణ
- డీఎంహెచ్ఓలో అవకతవకలు.. - అధికారులకు నోటీసులు జారీ - విచారణాధికారిగా ఏజేసీ ఖమ్మం వైరారోడ్ :డీఎంహెచ్ఓ కార్యాలయంలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారణ జరిపేందుకు జిల్లా ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. ఈ నెల 16, 20వ తేదీల్లో విచారణ కు హాజరుకావాల్సిందిగా ఆ శాఖ అధికారులకు ఏజేసీ బాబూరావు నోటీసులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అవినీతికి అడా ్డగా మారటంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. రాష్ట్ర వ్యా ప్తంగా వైద్య ఆరోగ్య శాఖలో అవినీతి చో టు చేసుకోవటంతో మంత్రి రాజయ్యతో పాటు ఉన్నతాధికారులను కూడా ప్రభుత్వం తొలగించిన విషయం విధితమే. అయితే ఆ అవినీతి ఊడలు జిల్లాకూ పాకాయి. కొన్ని అక్రమా లు వెలుగులోకి రావటంతో కలెక్టర్ ఇలంబరితి విచారణకు ఆదేశించారు. ఈ యేడాది మార్చిలో ఏజేసీకి విచారణ బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలో ఈనెల 11న విచాణకు హాజరుకావాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఏజేసీ నోటీసులు పంపించారు. 16న జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి భానుప్రకాశ్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి వెంకటేశ్వర్లును విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. భానుప్రకాశ్‌పై వైద్య ఆరోగ్య శాఖలో అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారంలో పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ యేడాది పల్స్ పోలి యో నిర్వహణ కోసం రూ. 47 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిధులను కూడా దుర్వినియోగం చేశారనే ఆరోపణ రావటంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంలో డీఎంహెచ్ఓ, డీఐఓలకు సంబంధాలు ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. 20న సర్వీస్ ఇంజనీర్ తిరపయ్య, డీఎంహెచ్ కార్యాలయంలో గతంలో సూపరిం డెంట్‌గా పనిచే సిన ఇస్మాయిల్‌ను విచారించనున్నారు. సర్వీస్ ఇంజనీర్ తిరపయ్యపై గతంలో 104లో అక్రమ డిప్యూటేషన్ వ్యవహారంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో సంబంధిత ఉద్యోగుల నుండి లక్షల్లో డబ్బులు గుంజినట్లు వాదనలు వినిపించాయి. దీనిపై సర్వీస్ ఇంజనీర్‌ను విచారించనున్నారు. గత యేడా ది ఇక్కడ పనిచేసిన సూపరిండెంట్ ఇస్మాయిల్‌పై కూడా ఆరోపణలు ఉన్నా యి. ముడుపులు ముట్టజెప్పి ఖమ్మం నుండి వరంగల్ రీజ నల్ డెరైక్టర్‌కు సరెండర్ చేయించుకున్నాడనే ఆరోపణ ఇతని పై ఉంది. వీటన్నింటిపై జిల్లా అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ బాబూరావు 16,20 వతేదీల్లో తన చాంబర్లో విచారణ జరపనున్నారు. విచారణ పారదర్శకంగా జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవలని ఆ శాఖ ఉద్యోగులు కోరుతున్నారు. -
104 ఉద్యోగుల నిరసన
- డీజిల్ లేక నిలిచిన వాహనాలు ఆదిలాబాద్ టౌన్ : డీజిల్ లేక 104 వాహనాలు నిలిపివేయడంతో ఉద్యోగులు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిరసన తెలిపారు. 104 ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోయినా ప్రజారోగాన్ని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అయినప్పటికీ అధికారులు వాహనాల్లో డీజిల్ పోయించడం లేదన్నారు. ఆదిలాబాద్ క్లస్టర్ పరిధిలో మూడు వాహనాలు నిలిచాయన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బడ్జెట్ వచ్చే వరకు డబ్బు లేదని చెప్పినట్లు తెలిపారు. వారంక్రితం వాహనాలు నిలిపివేయగా, మరోసారి 104 డీజిల్ లేక ముందుకు నడవడం లేదు. అధికారులు స్పందించి వాహనాలకు డీజిల్‌తోపాటు వేతనాలు వెంట నే చెల్లించాలన్నారు. నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నాగనాథ్, సుభాష్, సురేం దర్, ఆనంద్, ఇబ్రహీం, శ్రీకాంత్ పాల్గొన్నారు. -
నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో
నెల్లూరు (అర్బన్): జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కడప ఆర్డీ, పల్స్‌పోలియో జిల్లా పరిశీ లకుడు దశరథరామయ్య తెలిపారు. డీఎం హెచ్ఓ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3,29,304 మంది ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 3042 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 88 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బఫర్ స్టాక్ పాయిం ట్స్‌ను కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, పొదలకూరు, గూడూరు, నాయుడుపేట, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, బుచ్చి, కొడవలూరు ప్రాంతాల్లో పెట్టామన్నారు. 12,152 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వీరిలో ఆశా వాలంటీర్లు-1966, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్వాడీ వర్కర్లు- 3682, పారా మెడికల్ స్టాఫ్- 896, ఐకేపీ మెంబర్స్-3050, ఉపాధ్యాయులు- 2044, నర్సింగ్ స్టూడెంట్స్- 514 మంది ఉన్నారన్నారు. 27 మంది ప్రొగ్రామ్ ఆఫీసర్స్‌ను, డిప్యూటీ డీఎంహెచ్ఓలను నియమించామన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ భారతీరెడ్డి మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు. పొరబాట్లు జరగకుండా చూడండి: పల్స్‌పోలియో కార్యక్రమంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పొరబాట్లు జరగకుండా చూడాలని దశరథరామయ్య అన్నారు. మొదటి విడత జరిగినప్పుడు కొన్ని చోట్ల ఎండలో వైల్ బాక్సులు పెట్టుకొని పోలియో చుక్కలు వేశారని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. గర్భిణులకు ఎస్కార్ట్ మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గర్భిణులకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైరిస్క్ ఏరియాల్లో దీనికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి గర్భిణి వివరాలు తీసుకుని ఆమెకు డెలివరీ అయ్యేంత వరకు ఒక ఏఎన్ఎంను ఎస్కార్ట్‌గా నియమిస్తామన్నారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ అదుపులో ఉందని, అయినా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు. -
అమ్మో.. ‘ఆపరేషన్’!
ఆపరేషన్ అంటే ఎంత గుండె నిబ్బరం గల రోగికైనా భయమే. ఎంతటి వారికైనా గుండె దడ సహజమే. అయితే.. పేషెంట్‌లాగే కొందరు వైద్యాధికారులు సైతం అదంటేనే భయంతో వణుకుతున్నారు. వైద్యాధికారులు ఏమిటి.. వారికి ఆపరేషన్ ఏమిటి.. అనుకుంటున్నారా..?. అవును.. వారు నిజంగానే ఆపరేషన్‌ను ఎదుర్కోబోతున్నారు. అది అట్లాంటిది.. ఇట్లాంటిది కాదు. సర్కారు చీల్చిచెందాడేది. ఇంకా అర్థం కాలేదా..? అయితే.. చదవండి. ఖమ్మం వైరారోడ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ‘ఆపరేషన్’ చేపట్టింది. వైద్యారోగ్య శాఖలో చోటుచేసుకుంటున్న అవినీతి, అక్రమాలపై దృష్టి సారించింది. అక్రమార్కుల భరతం పట్టేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర డెరైక్టర్‌పై వేటు వేయడంతోపాటు ఆ శాఖలో జరుగుతున్న అవినీతిపై జిల్లాల వారీగా నిఘా పెట్టిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని వైద్యారోగ్య శాఖ అధికారుల్లో గుబులు మొదలైంది. ఇప్పటి దాకా అందిన కాడికి దోచుకున్న కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచారణ చేపడితే తామెక్కడ దొరికిపోతామోనని భయంతో వణికిపోతున్నారు. వివాదాల పుట్ట.. డీఎంహెచ్ఓ కార్యాలయం ఖమ్మం డీఎంహెచ్ఓలో అవినీతి తాండవిస్తోందనే ఆరోపణలు ఇటీవల వెల్లువెత్తాయి. ఎన్ఆర్హెచ్ఎం నిధుల దుర్వినియోగం, 104లో డిప్యుటేషన్లు, కాంట్రాక్ట్ నియామకాలు, వాహనాల రిపేర్లు తదితర విషయాల్లో భారీగా అవినీతి చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అధికారుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ఏఓ నాగార్జునను సంప్రదించకుండా డీఎంహెచ్ఓ భానుప్రకాశ్ నేరుగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఇటీవల విభేదాలు తారస్థాయికి చేరాయి. ఆ తర్వాత కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం వివాదం సద్దుమణిగింది. ‘అనారోగ్య’మిషన్! జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి జిల్లాకు ప్రతి మూడు నెలలకోసారి లక్షల్లోనూ ఒక్కోసారి కోట్లలోనూ నిధులు వస్తుంటాయి. వాటిని జిల్లాలోని పీహెచ్‌సీలు, ఏరియా, జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణకు వెచ్చిస్తుంటారు. అయితే.. ఈ బాధ్యతను డీపీఎం నిర్వర్తించాల్సి ఉండగా డీఎంహెచ్ఓ నేరుగా చూస్తుండటం చర్చనీయాంశమైంది. ఈక్రమంలో ఈ నిధుల్లో భారీగానే అవినీతి చోటుచేసుకుంటోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. నియామకాల్లోనూ అంతే.. ‘104’లో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇటీవల 20 మందిని అపాయింట్మెంట్ ఆర్డర్లు కూడా లేకుండా నియమించుకోవడం చర్చనీయాంశమైంది. ఈ విషయంలో ఏఓ, డీఎంహెచ్ఓ మధ్య విభేదాలు పొడచూపాయని తెలుస్తోంది. ఇదిలా ఉండగా అపాయింట్మెంట్ ఆర్డర్ లేని ఔట్సోర్సింగ్ ఉద్యోగి తనకు జీతం చెల్లించే విషయంలో ఏఓ వేధిస్తున్నారంటూ ఘర్షణ పడిన ఘటన కూడా చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఏఓకు వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు అండగా నిలిచారు. డీఎంహెచ్ఓ ప్రవర్తన కారణంగానే ఏఓ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఓను సంప్రదించకుండా నియామకాలు చేపట్టడంపై ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఈ విషయం కలెక్టర్ వద్దకు కూడా వెళ్లింది. ఇదిలా ఉండగా వైద్యారోగ్య శాఖలో డిప్యూటేషన్లలో కూడా అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అవసరం లేని చోట ఇద్దరు, ముగ్గురు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను నియమించడం వివాదానికి దారి తీసింది. అంతేకాకుండా హెల్త్ అసిస్టెంట్ల నియామకంలోనూ అవినీతి చోటుచేసుకుందని కూడా ప్రచారం జోరుగా సాగుతోంది. వాహనాల రిపేర్ల పేరుతో దోపిడీ జిల్లా వైద్యారోగ్య శాఖకు చెందిన వాహనాలతోపాటు 104, 108 వాహనాలు తరచూ రిపేర్లకు వస్తుంటాయి. వాటికి సంబంధించిన బిల్లులు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి చెల్లిస్తుంటారు. వాటిలోనూ భారీగా కుంభకోణం చోటుచేసుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. రిపేర్లకు ఎక్కువ ఖర్చయినట్లు బిల్లులు సృష్టించి నిధులు స్వాహా చేస్తున్నట్లు తెలుస్తోంది.