నెల్లూరు (అర్బన్): జిల్లావ్యాప్తంగా ఆదివారం నుంచి మూడు రోజుల పాటు రెండో విడత పల్స్‌పోలియో కార్యక్రమం నిర్వహించనున్న ట్లు కడప ఆర్‌డీ, పల్స్‌పోలియో జిల్లా పరిశీ లకుడు దశరథరామయ్య తెలిపారు. డీఎం హెచ్‌ఓ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు పిల్లలు 3,29,304 మంది ఉన్నారని, వీరికి పోలియో చుక్కలు వేసేందుకు 3042 బూత్‌లు ఏర్పాటు చేశామన్నారు. హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కలు వేసేందుకు 88 మొబైల్ బూత్‌లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బఫర్ స్టాక్ పాయిం ట్స్‌ను కావలి, వింజమూరు, ఉదయగిరి, ఆత్మకూరు, పొదలకూరు, గూడూరు, నాయుడుపేట, కోట, వెంకటగిరి, సూళ్లూరుపేట, బుచ్చి, కొడవలూరు ప్రాంతాల్లో పెట్టామన్నారు.
12,152 మంది సిబ్బందిని వినియోగించుకుంటున్నట్లు తెలిపారు. వీరిలో ఆశా వాలంటీర్లు-1966, ఐసీడీఎస్ సిబ్బంది, అంగన్‌వాడీ వర్కర్లు- 3682, పారా మెడికల్ స్టాఫ్- 896, ఐకేపీ మెంబర్స్-3050, ఉపాధ్యాయులు- 2044, నర్సింగ్ స్టూడెంట్స్- 514 మంది ఉన్నారన్నారు. 27 మంది ప్రొగ్రామ్ ఆఫీసర్స్‌ను, డిప్యూటీ డీఎంహెచ్‌ఓలను నియమించామన్నారు. డీఎంహెచ్‌ఓ డాక్టర్ భారతీరెడ్డి మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొనాలని కోరారు.
పొరబాట్లు జరగకుండా చూడండి:
పల్స్‌పోలియో కార్యక్రమంపై సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పొరబాట్లు జరగకుండా చూడాలని దశరథరామయ్య అన్నారు. మొదటి విడత జరిగినప్పుడు కొన్ని చోట్ల ఎండలో వైల్ బాక్సులు పెట్టుకొని పోలియో చుక్కలు వేశారని, ఈసారి అలాంటివి జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు.
గర్భిణులకు ఎస్కార్ట్
మాతా శిశు మరణాలు తగ్గించేందుకు గర్భిణులకు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైరిస్క్ ఏరియాల్లో దీనికి ప్రాధాన్యం ఇస్తామని, ప్రతి గర్భిణి వివరాలు తీసుకుని ఆమెకు డెలివరీ అయ్యేంత వరకు ఒక ఏఎన్‌ఎంను ఎస్కార్ట్‌గా నియమిస్తామన్నారు. జిల్లాలో స్వైన్‌ఫ్లూ అదుపులో ఉందని, అయినా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలు ఇచ్చామన్నారు.
నేటి నుంచి రెండో విడత పల్స్‌పోలియో
Published Sun, Feb 22 2015 3:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement
Advertisement