డీజిల్ లేక 104 వాహనాలు నిలిపివేయడంతో ఉద్యోగులు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయం లో నిరసన తెలిపారు...
- డీజిల్ లేక నిలిచిన వాహనాలు
ఆదిలాబాద్ టౌన్ : డీజిల్ లేక 104 వాహనాలు నిలిపివేయడంతో ఉద్యోగులు గురువారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో నిరసన తెలిపారు. 104 ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నవీన్ కుమార్ మాట్లాడుతూ మూడు నెలల నుంచి వేతనాలు చెల్లించకపోయినా ప్రజారోగాన్ని దృష్టిలో ఉంచుకొని విధులు నిర్వర్తిస్తున్నామన్నారు.
అయినప్పటికీ అధికారులు వాహనాల్లో డీజిల్ పోయించడం లేదన్నారు. ఆదిలాబాద్ క్లస్టర్ పరిధిలో మూడు వాహనాలు నిలిచాయన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, బడ్జెట్ వచ్చే వరకు డబ్బు లేదని చెప్పినట్లు తెలిపారు. వారంక్రితం వాహనాలు నిలిపివేయగా, మరోసారి 104 డీజిల్ లేక ముందుకు నడవడం లేదు. అధికారులు స్పందించి వాహనాలకు డీజిల్‌తోపాటు వేతనాలు వెంట నే చెల్లించాలన్నారు. నిరసన కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు నాగనాథ్, సుభాష్, సురేం దర్, ఆనంద్, ఇబ్రహీం, శ్రీకాంత్ పాల్గొన్నారు.