మాట్లాడుతున్న డీఎంహెచ్‌వో చందు
ఆదిలాబాద్‌టౌన్: ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు రోగుల నుంచి అధిక డబ్బులు వసూలు చేస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు అన్నారు. మంగళవారం డీఎంహెచ్‌వో చాంబర్‌లో పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ డెంగీ, టైఫాయిడ్ పేరుతో అధిక రుసుము వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, రోగులకు మానవత దృక్పథంతో వైద్యసేవలు అందించాలన్నారు. కొంత మంది వైద్యులు డెంగీ టెస్ట్‌ల పేరిట అధిక మొత్తంలో రోగుల నుంచి డబ్బులు తీసుకుంటున్నారని ఫిర్యాదులు వచ్చాయన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వివరాలు అందిస్తే తగిన పారితోషకం అందజేస్తామన్నారు. రోగులను భయభ్రాంతులకు గురి చేయకుండా నాణ్యమైన వైద్యసేవలు అందించాలని సూచించారు. సమావేశంలో పీవోడీటీటీ మనోహర్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సాధన, వైద్యులు అల్కా నరేశ్, అవినాశ్, అశోక్, శ్యామల, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment