దేశమంతా నా కుటుంబమే: ప్రధాని మోదీ | Sakshi
Sakshi News home page

140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే : ఆదిలాబాద్‌ సభలో ప్రధాని

Published Mon, Mar 4 2024 1:12 PM

Pm Modi Speech In Adilabad Vijaya Sankalpa Sabha - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు రెండూ ఒకటేనని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దోచుకోవడం, అబద్ధాలు చెప్పడం జూట్‌, లూఠ్‌ రెండే కుటుంబ పార్టీలకు తెలుసని ఆయన మండిపడ్డారు. సోమవారం ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ విజయసంకల్ప సభలో మోదీ ప్రసంగించారు.  నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు అని తొలుత మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లోక్‌సభ ఎన్నికలకు ఇంకా షెడ్యూలే రాలేదని, ఇది ఎన్నికల సభ కాదని అభివృద్ధి సభ అని చెప్పారు. 

సభలో మోదీ మాట్లాడుతూ ‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత ఎలాంటి మార్పు రాలేదు. బీఆర్‌ఎస్‌ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  ఏమీ మార్పు రాదు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్‌ కుంభకోణం చేస్తే ఆ స్కామ్‌ ఫైళ్లను కాంగ్రెస్‌ తొక్కి పట్టింది. మీరు తిన్నారు. మేమూ తింటాం అని కాంగ్రెస్‌ అంటోంది.  మోదీ గ్యారెంటీపై ప్రస్తుతం దేశంలో చర్చ జరుగుతోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తయ్యే గ్యారెంటీ.

వేల కోట్ల అభివృద్ధి పనులకు ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దేశంలో అభివృద్ధి ఉత్సవం జరుగుతోంది. తెలంగాణప్రజల మద్య ఈ ఉత్సవం జరుపుకోవడానికి నేను ఇక్కడికి వచ్చా. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అభివృద్ధి ఉత్సవం చేస్తోంది. ఈ పదిహేను రోజుల్లో వివిధ రాషష్టట్రాల్లో రెండు ఐఐటీలు, 3 ఐఐఎంలు, ఒక్క ఐఐఎస్‌, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించాం. ఇప్పుడు చెప్పండి ఇది అభివృద్ధి ఉత్సవం అవునా కాదా.. ఎన్నికలు వచ్చినపుడు ఎన్నికల గురించి చూసుకుందాం.

నిన్న మంత్రి వర్గం, అధికారులు అందరం కలిసి రోజంతా వికసిత్‌ భారత్‌ గురించి చర్చించాం. వికసిత్‌ భారత్‌పై 15 లక్షల మంది ప్రజలు తమ సూచనలు చేశారు. ఇప్పటికి 3 వేల సమావేశాలు పెట్టాం. 11 లక్షల మంది వికసిత్‌ భారత్‌లో భాగస్వాములయ్యారు. తెలంగాణలోని గ్రామగ్రామంలో యువకులు, మహిళలు, రైతులు, కార్మికులు అందరూ కలిసి అబ్‌ కీ బార్‌.. చార్‌ సౌ పార్‌ అని నినదిస్తున్నారు. అబ్‌ కీ బార్‌ నాలుగు వందలపైన.. బీజేపీకి ఓటు వెయ్యాలి.

రాంజీగోండు, కొమురం భీములు పుట్టిన భూమి ఇది. వాళ్లు స్వాతంత్రం కోసం పోరాడారు. బీజేపీ రాకపోతే ఆదివాసి మహిళ దేశానికి రాషష్ట్రపతి అయ్యేదా. భగవాన్‌ బిర్సాముండా పుట్టినరోజును అధికారికంగా జరుపుకునే వాళ్లమా. హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న ట్రైబల్‌ మ్యూజియమ్‌కు రాంజీ గోండు పేరు పెడుతున్నాం. కుటుంబ పార్టీలకు ఇది సహించదు. మేం జాతి కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా వారు అడ్డుపడుతున్నారు. బీజేపీ ఆదివాసిల కోసం పనిచేస్తోంది. ఆదివాసీల కోసం బీజేపీ పీఎంజన్‌మన్‌యోజన ప్రారంభించింది.

తెలంగాణలో సమ్మక్కసారక్క ట్రైబల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. మోదీకి గ్యారెంటీపై దేశంలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీగా పూర్తి అయ్యే గ్యారెంటీ. తెలంగాణ రైతుల కోసం పసుపు బోర్డు ఇచ్చాం. పసుపు రైతులకు అన్ని రకాల మద్దతు ఇస్తాం. తెలంగాణకు ఒక మెగాటెక్స్‌టైల్‌ పార్కు ఇచ్చాం.  నా జీవితం తెరిచిన పుస్తకం.

దేశమంతా నా కుటుంబమే.. 

నేను చిన్నప్పుడు ఒక కలతో ఇళ్లు విడిచిపెట్టా. దేశ ప్రజల కోసం జీవించాలని ఇళ్లు విడిచిపెట్టా. మీ కలల కోసమే నా సంకల్పం. నాకు ప్రత్యేక కలలు ఏమీ లేవు. ఇందుకే దేశంలోని కోట్ల మంది నన్ను వారి కుటుంబ సభ్యుడు అని అనుకుంటారు. 140 కోట్ల మంది నా కుటుంబ సభ్యులే.  నా దేశం నా కుటుంబం అన్న భావనతో మీ కోసం నేను జీవిస్తున్నా. అందుకే దేశం ఈరోజు నాది మోదీ కుటుంబమే(మై హూ మోదీకా పరివార్‌) అని చెబుతోంది.

అయోధ్య రామ మందిరంలో బంగారు దర్వాజ, మందిరంలోని బంగారు ధ్వజ స్తంభం నిర్మాణంలో తెలంగాణ పాత్ర ఉంది. రామ్‌లల్లా ఆశీర్వాదం తెలంగాణ ప్రజలపై ఉంటుంది. వికసిత్‌ తెలంగాణ లక్ష్యాన్ని మేం తప్పకుండా పూర్తిచేస్తాం. రానున్న 25 ఏళ్లలో కష్టపడి దేశాన్ని ప్రపంచంలోనే అగ్ర దేశాల్లో ఒకటిగా తయారు చేయాలి. మీ ఆశీర్వాదం నాకు కావాలి. మీ ప్రేమ కావాలి’ అని మోదీ తన ప్రసంగాన్నిముగించారు.

ఇదీ చదవండి.. కాంగ్రెస్‌పై కేటీఆర్‌ ఫైర్‌ 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement