సర్పంచులను సన్మానిస్తున్న మంత్రి ఐకేరెడ్డి
నిర్మల్ రూరల్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం అనేక నిధులను మంజూరు చేస్తుందన్నారు. కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని అవగాహన చేసుకుని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
టీఆర్‌ఎస్‌లో ఏడుగురు సర్పంచులు చేరిక
అనంతరం మంత్రి సమక్షంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సర్పంచులు పార్టీలో చేరారు. నిర్మల్‌రూరల్ మండలంలోని మేడిపెల్లి సర్పంచ్ కుంట దుర్గ, రత్నాపూర్‌కాండ్లి సర్పంచ్ పీచర లావణ్య, దిలావర్‌పూర్ మండలంలోని కాల్వ సర్పంచ్ ఆడెపు తిరుమల, మాయాపూర్ సర్పంచ్ రొడ్డ మహేశ్, లక్ష్మణచాంద మండలం లోని పార్‌పెల్లి సర్పంచ్ నూకల రాజేంధర్, సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ సర్పంచ్ వంజరి కవిత, న్యూవెల్మల్ అంకంగంగామణి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జి డి.విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రా జేందర్, పత్తిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రమేశ్, మోయినొద్దీన్, మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అల్లోల గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment