surpancehs
-
గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం
నిర్మల్ రూరల్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యా య, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఇటీవల ఎన్నికైన సర్పంచులను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభు త్వం అనేక నిధులను మంజూరు చేస్తుందన్నారు. కొత్తగా తీసుకువచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని అవగాహన చేసుకుని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. జిల్లాలో గ్రామాల అభివృద్ధికి కావాల్సిన నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్లో ఏడుగురు సర్పంచులు చేరిక అనంతరం మంత్రి సమక్షంలో నిర్మల్ నియోజకవర్గానికి చెందిన ఏడుగురు సర్పంచులు పార్టీలో చేరారు. నిర్మల్‌రూరల్ మండలంలోని మేడిపెల్లి సర్పంచ్ కుంట దుర్గ, రత్నాపూర్‌కాండ్లి సర్పంచ్ పీచర లావణ్య, దిలావర్పూర్ మండలంలోని కాల్వ సర్పంచ్ ఆడెపు తిరుమల, మాయాపూర్ సర్పంచ్ రొడ్డ మహేశ్, లక్ష్మణచాంద మండలం లోని పార్పెల్లి సర్పంచ్ నూకల రాజేంధర్, సోన్ మండలంలోని లోకల్ వెల్మల్ సర్పంచ్ వంజరి కవిత, న్యూవెల్మల్ అంకంగంగామణి పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఇందులో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి డి.విఠల్‌రావు, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రా జేందర్, పత్తిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, రామేశ్వర్‌రెడ్డి, రమేశ్, మోయినొద్దీన్, మురళీధర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అల్లోల గౌతమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పంచాయతీ నిధులు పక్కదారి.. సర్పంచ్ చేతివాటం..
సాక్షి, కైకలూరు: పంచాయతీల పాలన గాడి తప్పుతోంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే ఆలోచనలో కొందరు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. పంచాయతీల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న నిధులు పక్కదారి పడుతున్నాయి. అక్రమార్కులకు అధికారం అండదండలు ఉండటంతో నిధుల దుర్వినియోగం వెలుగులోకి రావటం లేదు. దీనికి తోడు ప్రభుత్వాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా లక్షల నిధులు స్వాహ అవుతున్నాయి. జిల్లా శివారు కైకలూరు నియోజకవర్గంలో పలు పంచాయతీల్లో నిధులు గోల్మాల్ అవుతున్నాయి. పన్నుల రూపంలో ప్రజలు చెల్లించిన నగదును పంచాయతీకి జమ చేయకపోవడం, చేయని పనులను చేసినట్లు చిత్రీకరించి బిల్లులు పొందడం, కాంట్రాక్టు సిబ్బంది జీతాలు పేరుతో నగుదు కాజేయడం, జిల్లా అధికారుల ఖర్చుల పేరుతో నకిలీ బిల్లులతో నగదు పొందడం వంటి పలు రూపాల్లో పంచాయతీ సొమ్మును కొందరు దిగమింగుతున్నారు. పలువురు సర్పంచ్‌లకు అధికార పార్టీ నేతల అండదండలు పుష్పలంగా ఉండటంతో నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. జిల్లా అధికారులు విచారణ పేరుతో కాలయాపన చేస్తుండటంతో అక్రమార్కుల పదవీ కాలం ముగిస్తోంది. భుజబలపట్నం పంచాయతీలో నిధులు స్వాహా కైకలూరు మండలంలో భుజబలపట్నం మేజర్ పంచాయతీలో ఒకటి. పంచాయతీల వనరుల రూపంలో ఏడాదికి రూ.10 లక్షల ఆదాయం వస్తుంది. పంచాయతీలో జరిగే అవకతవకలపై గ్రామానికి చెందిన మంతెన రామ్మూర్తిరాజు పదేళ్ల కాలంలో జరిగిన నిధుల వినియోగంపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు కోరారు. దీంతో అసలు విషయాలు వెలుగుచూశాయి. పంచాయతీ నుంచి డీఎల్పీవో వాహనానికి రూ.17,000 చెల్లించినట్లు ఉంది. ఇవే కాకుండా పలు బిల్లుల్లో తేడాలు ఉన్నాయి. ఈ ఘటనపై మచిలీపట్నం డీఎల్పీవో విచారణ చేసి ఈ నెల 11న పంచాయతీ నిధులు రూ.1,63,516.. ఆర్థిక సంఘం నిధులు రూ.1,39,074 వెరసి రూ.3,02, 590 దుర్వునియోగం అయినట్లు గుర్తించారు. సర్పంచ్‌లకు నోటీసులు భుజబలపట్నం పంచాయతీ నిధుల దుర్వినియోగంపై మాజీ సర్పంచ్‌లకు, అధికారులకు పంచాయతీశాఖ జిల్లా అధికారులు నోటీసులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు రూ.1,51,295, మాజీ సర్పంచ్ సయ్యపురాజు గుర్రాజు రూ.23,039, మరో మాజీ సర్పంచ్ బి.రామలక్ష్మీ రూ.1,04,087, పూర్వ పంచాయతీ ప్రత్యేకాధికారి హెప్సిబారాణి రూ.24,169 నిధులను చెల్లించాలని నోటీ సులు పంపారు. వీరిలో పంచాయతీ కార్యదర్శి వి.రామరాజు ఇటీవల మరణించడంతో వారి కుటుంబ సభ్యులు సదరు నగదును చెల్లించాలని నోటీసులో సూచించారు. ఇవే కాకుండా కైకలూరు నియోజకవర్గ పరిధిలో కైకలూరు, కలిదిండి, గుర్వాయిపాలెం, కోరుకొల్లు, వైవాక, దేవపూడి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణలు జరిగాయి. సొమ్ము రికవరీ చేస్తాం భుజబలపట్నం పంచాయతీలో రూ.3,02,590 నిధులు దుర్వినియోగం అయినట్లు మచిలీపట్నం డీఎల్పీవో విచారణలో తేలింది. అందుకు బాధ్యలైన అందరికి నోటీసులు అందించడం జరిగింది. సదరు వ్యక్తుల నుంచి నగదును రీకవరీ చేసుకుంటాం. పంచాయతీ రికార్డులు ఖచ్చితంగా పారదర్వకతతో నిర్వహించాలి. – అరుణ్‌కుమార్, ఈవోపీఆర్డి, కైకలూరు. -
ఇచ్చినట్లే ఇచ్చి..
ఆర్థిక సంఘం నిధుల్లో 60 శాతం కోత ఆపై చెక్‌పవర్‌కు చెక్ ఆందోళనబాటలో సర్పంచులు కరీంనగర్ సిటీ : కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే వచ్చాయనే సంతోషం సర్పంచులకు మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఈ నిధుల్లో నుంచి దాదాపు అరవై శాతం వివిధ పద్దుల ఖర్చులకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నిధులు ఖర్చుపెట్టే విషయంలోనూ ఈవోపీఆర్డీలు, డీఎల్పీవోలతో జాయింట్ చెక్‌పవర్ కల్పించడాన్ని నిరసిస్తూ సర్పంచులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. గతంలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సంఘం, బీఆర్జీఎఫ్ నిధులే అగ్రభాగాన ఉండేవి. ఈ ఏడాది ప్రభుత్వం బీఆర్‌జీఎఫ్‌ను రద్దుచేసింది. ఆర్థిక సంఘం నిధులను నూటికి నూరుశాతం నేరుగా పంచాయతీలకే కేటాయించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లు ఆర్థిక ఇబ్బందుల్లో పడగా... పంచాయతీలు మాత్రం సర్కారు నిర్ణయాన్ని స్వాగతించాయి. 14వ ఆర్థిక సంఘం నిధులు మొత్తం పంచాయతీలకే రానుండటంతో ఇక నిధులకు కొదువ ఉండదని సర్పంచులు సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. ఇంకా పూర్తిస్థాయిలో 14వ ఆర్థిక సంఘం నిధులు రాన ప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం విధించిన కొర్రీలపై సర్పంచులు మండిపడుతున్నారు. ఆర్థిక సంఘం నిధుల నుంచే పంచాయతీలు విద్యుత్ బిల్లుల బకాయిలు, నీటి సరఫరా పథకాలు నిర్వహణ, కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలు చెల్లించాలనే షరతులు విధించడం వారికి మింగుడుపడటం లేదు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల్లోంచి 30 శాతం విద్యుత్ బిల్లులకు, 20 శాతం తాగునీటి పథకాలకు, 10 శాతం ఈ–పంచాయతీలు, క్లస్టర్ పంచాయతీల్లోని కంప్యూటర్ ఆపరేటర్ల జీతాలకు వెచ్చించాలని ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. దీంతో ఆర్థిక సంఘం నిధుల నుంచి 40 శాతం మాత్రమే గ్రామాల్లో వివిధ పనులకు ఖర్చుచేసే పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఆర్థిక సంఘం నిధులతో ఆ గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, డ్రెయినేజీల నిర్మాణం, రోడ్ల మరమ్మతులు, బ్లీచింగ్ చల్లడం, క్లోరినేషన్ తదితర పనులు చేపడుతుంటారు. వర్షాకాలం.. వ్యాధుల సీజన్ కావడంతో పంచాయతీలకు నిధులు అత్యవసరం. అయితే 60 శాతం నిధులు ముందే ఖర్చవుతుండటంతో, మిగిలిన 40 శాతం నిధులు ఏ మూలకూ సరిపోవని సర్పంచులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం రూపంలో నిధులు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం అందులో నుంచి కోత విధించడం సరికాదని తమ అసంతప్తిని వ్యక్తపరుస్తున్నారు. దీనికితోడు బిల్లులు డ్రా చేసేందుకు సంబంధిత ఈవోపీఆర్డీలు, డీఎల్పీలతో సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ అప్పగించింది. దీంతో కొంతమంది అధికారులు కమీషన్ ఇస్తేనే బిల్లులు డ్రా చేసేందుకు సంతకాలు పెడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 22న కలెక్టరేట్ ముట్టడి ఆర్థిక సంఘం నిధుల ఖర్చులో నిబంధనలు ఎత్తివేయాలని, సీనరేజీ, తదితర నిధుల బకాయిలు వెంటనే విడుదల చేయాలనే డిమాండ్‌తో ఈనెల 22న కలెక్టరేట్ ముట్టyì తలపెట్టినట్లు సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు అంతటి అన్నయ్య గౌడ్ తెలిపారు. విద్యుత్ బిల్లుల బకాయిలు ప్రభుత్వమే భరించాలని, జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని సర్పంచులందరూ తరలివచ్చి కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలని ఆయన కోరారు.