రైతుభరోసాపై మాకు మేము నిర్ణయాలు తీసుకోవట్లేదు..
క్షేత్రస్థాయిలో రైతులిచ్చే అభిప్రాయాలే పరిగణనలోకి..
ఇప్పటివరకు పరిమితులు ఖరారు కాలేదు
పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుభరోసా విస్తృతస్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క
సాక్షి, ఆదిలాబాద్: ‘రైతు భరోసాను నిర్దిష్టంగా అమలు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉంది. ఈ విషయంలో ఓపె న్ మైండ్‌తో ఉన్నాం. మాకు మేము ఏదో నిర్ణయం తీసుకోవడం లేదు. అందరితో చర్చించి అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలనే సదుద్దేశంతోనే ఉన్నాం. అన్ని జి ల్లాల్లో కేబినెట్ సబ్ కమిటీ పర్యటించి ప్రజాక్షేత్రంలో అభిప్రాయాలు సేకరించి...అసెంబ్లీలో నివేదిక పొందుపరుస్తాం. రైతుభరోసా పేద, బడుగువర్గాలకు న్యాయం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.
రైతు భరోసా పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేదు. గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారు.. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం.’అని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కుమురంభీం కాంప్లెక్స్ సమావేశ మందిరంలో రైతు భరోసా విధివిధానాల ఖరారుపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతుల నుంచి అభిప్రాయాలు, సలహాల ను కేబినెట్ సబ్ కమిటీ సేకరించింది.
ఈ కమిటీ చైర్మన్ మ ల్లు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సీతక్క, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల్లో కీలకమైన రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేసి తీరుతామని డిప్యూటీ సీఎం అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని చెప్పారు. నిజమైన రైతులకే రైతుభరో సా అందించేందుకు అన్నివర్గాల ప్రజల నుంచి అభిప్రాయా లు స్వీకరిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
మరోమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడు తూ ఇంకా ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పలువురు రైతులకు భూమికి సంబంధించి సరైన పత్రాలు కూడా లేవని తెలిపారు. ఇలా అన్ని విషయాల్లోనూ ఆలోచన చేస్తామని చెప్పా రు. ఎకరం భూమి లేకున్నా, ఏదో ఒకవిధంగా సాగు చేస్తు న్న రైతులకు లబ్ధి చేకూర్చాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేకంగా బడ్జెట్‌లో 20 శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కోరారు.
వైఎస్ అమలు చేసిన కౌలురైతు చట్టాన్ని తీసుకురావాలి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి 2011లో అమలు చేసిన కౌలు రైతు చట్టాన్ని తీసుకురావాలని రైతులు, రైతు సంఘాల నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. సాగుచేస్తున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది కౌలురైతులే ఉన్నారని వివరించారు. 95 శాతం ఆత్మహత్య లు కౌలు రైతులవేనని పేర్కొన్నారు. పట్టాదారులకు భరోసా కల్పించి కౌలు రైతులకు న్యాయం చేయాలని మంత్రివర్గ ఉప సంఘాన్ని కోరారు.
రైతు భరోసానే కాకుండా మిగతా వాటి విషయంలోనూ కౌలు రైతులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం విధివిధానాలు రూపొందించాలన్నారు. ఉమ్మ డి ఆదిలాబాద్ జిల్లాలో పహాణీలు, పోడు భూముల సమస్య కారణంగా మెజారిటీ రైతులు ప్రభుత్వ సాయం పొందలేక పోతున్నారన్నారు. పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరో సా అందించాలని పలువురు కోరారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ప్రత్యేకంగా తీసుకొని పదెకరాలు సాగు చేసే రైతులందరికీ రైతు భరోసా వర్తింపజేయాలని కోరారు.
ఎంపిక చేసిన వారితోనే మాట్లాడించారు
ఎంపిక చేసిన రైతులతోనే మాట్లాడిస్తున్నారని నిజమైన రైతులతో మాట్లాడించడం లేదని కొందరు ఆరోపించారు. దీంతో స్పెషల్ రోప్ పార్టీ పోలీసులు ఎంటర్ అయ్యారు. వేదిక ముందు ప్రజాప్రతినిధులకు రక్షణగా ఇటువైపు నుంచి అటు వైపు వరకు కూర్చున్నారు. కాగా రైతులను తాము ఎంపిక చేయలేదని, వ్యవసాయ అధికారులే గుర్తించారని ఖానా పూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు అన్నారు. కాగా కేబినెట్ సబ్‌కమిటీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment