contract workers
-
వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్తత.. పోలీసు బలగాల మోహరింపు
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికులు ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను ముట్టడించారు. తమకు న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్ వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు.విశాఖ స్టీల్‌ప్లాంట్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసనలు చేపట్టారు. మంగళవారం ఉదయం ఈడీ వర్క్స్ బిల్డింగ్‌ను కార్మికులు ముట్టడించారు. ఈ సందర్బంగా అక్కడకి భారీ సంఖ్యలో పోలీసులు, సీఐఎస్ఎఫ్ బలగాలు చేరుకున్నారు. పోలీసు ఉన్నతాధికారులు సైతం స్టీల్ ప్లాంట్ వద్దకు వచ్చారు. కాగా, 4200 మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగింపుపై కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తోందని కార్మికులు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. శాంతియుతంగా నిరసన చేపడితే తమను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. విశాఖ ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఆదివారం ఉదయం కూడా స్టీల్‌ప్లాంట్ బీసీ గేట్ ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని కార్మిక నేతలు హచ్చరించారు. స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.ఇదిలా ఉండగా.. స్టీల్‌ప్లాంట్‌ను కాపాడతామని గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు ప్లాంట్ నిర్వీర్యం అవుతుంటే చేష్టలుడిగి చూస్తోంది. స్ట్రాటజిక్ సేల్ పేరిట ప్లాంట్‌ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేందుకు కేంద్రం వేస్తున్న అడుగులకు రాష్ట్ర ప్రభుత్వం మడుగులొత్తుతోంది. నాలుగు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ రచ్చరచ్చ కావడంతో ఉక్కు యాజమాన్యం వెనక్కి తగ్గింది. ఈ నిర్ణయం తాత్కాలికమేనని, భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలు జరగొచ్చనే ఆందోళన ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: చంద్రబాబు ‘కొవ్వు’ ప్రకటనకు 'ఎలాంటి ఆధారాల్లేవ్': సుప్రీంకోర్టు -
బెడిసికొట్టిన జనసేన వ్యూహం! నాణ్యతకు కాంట్రాక్టర్ సవాల్!
సాక్షి, భీమవరం: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న జనసేన పార్టీ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. పవన్‌కల్యాణ్ వలంటీర్ల వ్యవస్థపై చేసిన ఆరోపణలతో పరువు పొగొట్టుకోగా భీమవరం పట్టణంలో ఆ పార్టీ నాయకులు చేసిన మరో చిల్లర ప్రయత్నం బెడిసికొట్టింది. భీమవరం పట్టణంలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. పట్టణంలోని పైపుల చెరువు వద్ద విస్సాకోడేరు లేఅవుట్లో సుమారు 3 వేలకు పైగా ఇళ్లు నిర్మించాల్సి ఉండగా పేరొందిన కాంట్రాక్టర్‌తో మాట్లాడి లబ్ధిదారుల ఇష్ట్రపకారం ఇళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 200 ఇళ్ల శ్లాబ్ నిర్మాణం పూర్తికాగా మరో 300 ఇళ్లు శ్లాబ్ లెవల్‌కు, 600 ఇళ్లు బెస్మెంట్ లెవల్లో ఉన్నాయి. ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో నాణ్యతలో రాజీపడకుండా నిర్మిస్తున్నాయి. అయితే జనసేన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుతోపాటు కొంతమంది పార్టీ నాయకులు గత వారం ఇళ్ల నిర్మాణ ప్రాంతాన్ని సందర్శించి ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేశారు. వారి ఆరోపణల్ని కాంట్రాక్టర్ పళ్ల ఏసుబాబు తిప్పికొట్టారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు నిరూపిస్తే ఆయా ఇళ్లను కూలగొట్టి తిరిగి నిర్మిస్తానని బహిరంగ సవాల్ విసిరారు. జగనన్న కాలనీ మునిగిపోతుందని, రోడ్డు అధ్వానంగా ఉందంటూ జనసేన చేసిన ఆరోపణను ఖండించారు. కాలనీకి రోడ్డు సౌకర్యం లేకుంటే ప్రతి రోజు 20 లారీల్లో వెయ్యి టన్నుల మెటీరియల్ ఎలా వస్తుందని ప్రశ్నించారు. గునుపూడి లే అవుట్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ చేసిన మరో ఆరోపణను అక్కడ భూముల కొనుగోలుకు సహకరించిన తిరుమల విజయ్‌రామ్, భూములు విక్రయించిన రైతులు తప్పుపట్టారు. లేఅవుట్‌కు 70 ఎకరాలు కొనుగోలు చేయగా ఎకరాకు రూ.కోటి 6 లక్షల చొప్పున రైతుల ఖాతాల్లో నేరుగా జమచేశారని, రైతుల నుంచి ఎవరికై నా ముడుపులిచ్చినట్లు జనసేన నాయకులు మావుళ్లమ్మ ఆలయంలో దీపం ఆర్పి ప్రమాణం చేసి నిరూపించగలరా? అని సవాల్ చేశారు. -
జీహెచ్ఎంసీలో పనులు.. మాకొద్దు బాబోయ్!
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు జీహెచ్ఎంసీలో పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు అత్యుత్సాహంతో ముందుకు వచ్చేవారు. టెండర్ దక్కించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసేవారు. కానీ ప్రస్తుతం సీన్ మారింది. బల్దియా పనులంటేనే కాంట్రాక్టర్లు జంకుతున్నారు. ఎన్నిసార్లు టెండర్లు పిలిచినా స్పందించడం లేదు. దీనికి కారణం సకాలంలో బిల్లుల చెల్లింపులు జరగకపోవడమేనని తెలుస్తోంది. నగరంలో వానొస్తే రోడ్లు చెరువులయ్యే పరిస్థితి తప్పించేందుకు..ముంపు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పేరిట ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. వర్షాకాలం రాకముందే పలు పనులు చేయాలని భావించినప్పటికీ, వర్షాకాలం వచ్చేంతదాకా ఎలాంటి పనులు చేపట్టలేదు. జూన్‌లో కురిసిన వర్షాలతో పనులకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా కొన్ని పనులకు టెండర్లు పిలిచారు. ఒక్కసారి కాదు..రెండుసార్లు టెండర్లు పిలిచినప్పటికీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు రాకపోవడంతో పలు పనులకు మూడో పర్యాయం కూడా టెండర్లు పిలవాల్సి వస్తోంది. కళాసిగూడ నాలాపై మూడు ప్రాంతాల్లో నాలాల్ని విస్తరించి పైకప్పులు( బ్రిడ్జిలు) వేసే పనుల వ్యవహారమే ఇందుకు నిదర్శనం. కళాసిగూడ నాలాపై రాణిగంజ్ బస్‌డిపో పక్కన డబుల్బెడ్రూమ్ ఇళ్ల సముదాయం వద్ద, బుద్ధభవన్ నుంచి శ్మశానవాటిక రోడ్ మార్గంలో, మారియట్ హోటల్ వద్ద ట్యాంక్‌బండ్ రోడ్ నుంచి కవాడిగూడ వరకు మూడు ప్రాంతాల్లో బ్రిడ్జిల నిర్మాణాలకు టెండర్లు పిలిచారు. వీటి అంచనా వ్యయం రూ.12.75 కోట్లు. రెండు పర్యాయాలు పిలిచినా టెండర్లు దాఖలు కాకపోవడంతో మూడో పర్యాయం కూడా పిలిచారు. వాటికి టెండర్లు దాఖలు చేయడానికి ఈనెల 23వ తేదీ వరకు గడువుంది. ఆలోగానైనా టెండర్లు దాఖలై పనులు జరుగుతాయో లేదో తెలియదు. ఆయా మార్గాల్లో పనులు చేయాలంటే ట్రాఫిక్ మళ్లింపు, యుటిలిటీస్ తరలింపు వంటి సమస్యల వల్ల కాంట్రాక్టర్లు వెనకడుగు వేసున్నారని అధికారులు చెబుతున్నారు. జీహెచ్ఎంసీలో గతంలో మాదిరిగా పనులకు వెంటనే బిల్లుల చెల్లింపులు జరగడం లేదని, సిబ్బంది జీతభత్యాల చెల్లింపులకే నెలనెలా ఎదురవుతున్న ఇబ్బందులు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని పనులు చేయాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించాల్సి వస్తోందని జీహెచ్ఎంసీలో ఎంతోకాలంగా పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఎస్సార్డీపీకి అలా.. ఎస్ఎన్డీపీకి ఇలా.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్సార్డీపీ) పనులకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం బాండ్లు, లోన్ల ద్వారా నిధులు తీసుకునేందుకు జీహెచ్ఎంసీకి అనుమతినిచి్చంది. ఎస్ఎన్డీపీ పనులకు మాత్రం నివాస కేటగిరీలో ఉండి ఇటీవల వాణిజ్య కారిడార్లుగా మారిన 118 మార్గాల్లో టౌన్‌ప్లానింగ్ విభాగానికి వచ్చే ఇంపాక్ట్ ఫీజు నిధుల్ని ఎస్ఎన్డీపీకి వినియోగించేలా ఉత్తర్వు జారీ చేసింది. ఇంజనీరింగ్ నిర్వహణ పనులకు సంబంధించిన బిల్లులు దాదాపు రూ. 600 కోట్ల మేర పెండింగ్‌లో ఉండటంతో గత కొంతకాలంగా సంబంధిత కాంట్రాక్టర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సర్కిళ్లలో పనులు కూడా చేయడం లేదు. -
కాంట్రాక్ట్ నర్సుల ఆందోళన.. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమను ప్రభుత్వం అన్యాయం తొలగించిందంటూ కాంట్రాక్ట్ నర్సులు శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయం వద్ద శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయల్దేరారు. ఈ క్రమంలో పోలీసులు వారిని గాంధీభవన్ వద్ద అడ్డుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు, నర్సుల మధ్య తోపులాట జరిగింది. పలువురు గాయాల బారిన పడ్డారు. దీంతో గాంధీభవన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. తమను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలంటూ కాంట్రాక్ట్ నర్సులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1640 మంది కాంట్రాక్ట్ నర్సులను విధుల నుంచి తొలగించింది. దీంతో వారిపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయమై నర్సులు హెచ్ఆర్సీనీ సైతం ఆశ్రయించారు. -
బీఎస్ఎన్ఎల్ : మరో 20వేల ఉద్యోగాలకు ముప్పు
సాక్షి, ముంబై: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ పెద్ద ఎత్తున కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని యోచిస్తోంది. మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించనుందన్న అంచనాలు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళనకు దారి తీసింది. ప్రస్తుతం సంక్షోభ సమయంలో ఈనిర్ణయాన్ని సమీక్షించాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఉద్యోగాలు తొలగిపునకు సంబంధించి సెప్టెంబర్ 1న బీఎస్ఎన్ఎల్ తన మానవ వనరుల డైరెక్టర్ అనుమతితో ఒక ఉత్తర్వు జారీ చేసిందని బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ వెల్లడించింది. కాంట్రాక్ట్ పనులు, కాంట్రాక్ట్ కార్మికుల ఖర్చులను తగ్గించుకునే క్రమంలో అన్ని చీఫ్ జనరల్ మేనేజర్లు చర్యలను తీసుకోవాలని కోరినట్టు యూనియన ఆరోపించింది. ఈ క్రమంలో మరో 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులను తొలగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే 30వేలమంది కార్మికులను తొలగించిందనీ, వీరికి ఒక సంవత్సరం పాటు వేతనాలు చెల్లించాలని యూనియన్ ఆరోపించింది. ఈ విషయంలో సంస్థ తన నిర్ణయాన్ని సమీక్షించాలని కోరింది. స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (వీఆర్ఎస్) అమలు తర్వాత సంస్థ ఆర్థికపరిస్థితి క్షీణించిందని, దీంతోపాటు వివిధ నగరాల్లో ఉద్యోగుల కొరత కారణంగా నెట్‌వర్క్‌లలో లోపాలు పెరిగాయంటూ బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పి కె పూర్వర్‌కు యూనియన్ ఒక లేఖ రాసింది.మరోవైపు 900 కోట్ల రూపాయల విలువైనపెండింగ్ బకాయిలను బీఎస్ఎన్ఎల్ చెల్లించకపోతే ప్రస్తుతం బిఎస్ఎన్ఎల్ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగిస్తామని గతనెలలో ఫిన్నిష్ టెలికాం పరికరాల సంస్థ నోకియా హెచ్చరించింది. కరోనావైరస్ మహమ్మారి మధ్య ఖర్చు తగ్గించే చర్యలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ తెలిపింది. కాగా నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ రెండు సంస్థలను విలీనం చేయడం, ఆస్తులను మోనటైజ్ చేయడం, ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇవ్వడం లాంటి చర్యలను ప్రకటించింది. ఇందుకు 2019 అక్టోబర్‌లో 69 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రభుత్వం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
నేటి నుంచి గాంధీలో నిరవధిక సమ్మె
గాంధీ ఆస్పత్రి: కోవిడ్–19 నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి నిరసన సెగ తగిలింది. ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ మంగళవారం విధులు బహిష్కరించి ఆందోళన బాట పట్టడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అయినా ప్రభుత్వం, వైద్య ఉన్నతాధికారులు స్పందించకపోవడంతో బుధవారం నుంచి నిరవధిక సమ్మె చేపట్టాలని కార్మిక సంఘాలు సీఐటీయూ, ఐఎన్టీయూసీ, బీఎంఎస్, ఏఐటీయూసీ ప్రతినిధులతోపాటు గాంధీ సిబ్బంది జేఏసీ నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం రాత్రి గాంధీ ఆస్పత్రి ప్రాంగణంలో సమావేశం నిర్వహించి నిరవధిక సమ్మె చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగాల రెగ్యులరైజ్ ప్రధాన డిమాండ్‌తో పాటు సమాన పనికి సమాన వేతనం నినాదంతో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని తీర్మానించారు. ఇదిలాఉండగా మంగళవారం ఉదయం నుంచి ఆందోళనకారులు ఆస్పత్రి ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఆస్పత్రి లోపల, బయట తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న 212 మంది నర్సింగ్ సిబ్బంది గత 5 రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మమ్మల్ని పట్టించుకోవట్లేదు..: ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్‌తో పాటు రూ.34 వేల వేతనం, ఇన్సెంటివ్స్, బీమా సౌకర్యం కల్పించాలని గత ఐదు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదని కాంట్రాక్టు నర్సింగ్ యూనియన్ ప్రతినిధులు సుజాతరెడ్డి, మేఘమాల, ఇందిర, సరళ, మధులతలు ఆవేదన వ్యక్తం చేశారు. డిమాండ్లు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. ‘నాల్గవ తరగతి ఉద్యోగులను, 300 ఓసీఎస్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి. ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి. పారిశుధ్య, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ టేకర్ల వేతనాలు రూ.20 వేలకు పెంచాలి’అని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఐఎన్టీయూసీ గాంధీ యూనిట్ అధ్యక్షుడు శివకుమార్ స్పష్టం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టామని ఆస్పత్రి అధికారులు తెలిపారు. కాగా, నిరవధిక సమ్మె విషయం తన దృష్టికి రాలేదని గాంధీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బెడ్లపైనే మృతదేహాలు.. డిమాండ్లు నెరవేర్చాలంటూ ఆస్పత్రిలో పనిచేస్తున్న నాల్గవ తరగతి ఉద్యోగులు, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, పేషెంట్ కేర్ టేకర్లు మంగళవారం మూకుమ్మడిగా విధులు బహిష్కరించడంతో చికిత్స పొందుతున్న సుమారు 900 మంది కరోనా బాధితులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వార్డుల్లో పారిశుధ్య లోపంతో తీవ్ర దుర్వాసనల మధ్య వైద్యులు విధులు నిర్వహించారు. చికిత్స పొందుతూ మరణించిన రోగుల మృతదేహాలను మార్చురీకి తరలించేందుకు అవకాశం లేకపోవడంతో గంటల తరబడి బెడ్లపైనే పడున్నాయి. -
దళారుల దందా..
సాక్షి, కొత్తగూడెం: నిరుద్యోగులను మోసం చేసేందుకు మాయగాళ్లు ఎప్పుడూ పొంచి ఉంటారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం పారిశ్రామిక జిల్లా కావడంతో ఆయా సంస్థల్లో క్యాజువల్ ఉద్యోగాలు ఇప్పిస్తామనే పేరుతో ఈ మాయగాళ్లు నిరంతరం దోపిడీ చేస్తున్నారు. తాజాగా పాల్వంచలోని కేటీపీఎస్(కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్)లో ఆర్టిజన్ పద్ధతిలో ఉద్యోగాలు కల్పిస్తామనే పేరుతో ఉమ్మడి జిల్లాలోని పలువురు అమాయకుల వద్ద భారీగా డబ్బు వసూలు చేశారు. ఇతర విద్యుత్ సంస్థల్లోనూ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మాయమాటలు చెప్పి లక్షల రూపాయలు దండుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా టీఎస్ జెన్కో, టీఎస్ ట్రాన్స్‌కో, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థల్లో పనిచేస్తున్న 23 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను రెండు విడుతలుగా ఆర్టిజన్ల పేరుతో నియామక పత్రాలు ఇచ్చారు. 2017 జూన్ 27న మొదటి విడతలో, అదే ఏడాది జూలై 27న రెండో విడతలో సదరు కాంట్రాక్ట్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించారు. సంస్థల్లో కాంట్రాక్ట్ వ్యవస్థను తీసివేసి కర్మాగారాల్లో ప్రతి పనులను కాంట్రాక్ట్ కార్మికులతో చేయించుకుని వారికి నేరుగా బోర్డు నుంచే వేతనాలు అందేలా చర్యలు తీసుకున్నారు. దీంతో వీరికి ఉద్యోగ భద్రత లభించినట్టయింది. ఇందులో పాల్వంచ కేటీపీఎస్ కాంప్లెక్స్ పరిధిలో సుమారు 1,500 మంది ఉద్యోగాలు పొందారు. అయితే ఆర్టిజన్లుగా తీసుకునే క్రమంలో అర్హులైన కొందరికి ఉద్యోగాలు రాలేదు. పైగా కొందరు అనర్హులు సైతం దొడ్డిదారిలో ఉద్యోగాలు పొందారు. దశాబ్దాల పాటు నమ్ముకుని పనిచేసిన పలువురు కార్మికులు మాత్రం నష్టపోయారు. సదరు కార్మికుల వద్ద అన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ ఆర్టిజన్లుగా, సీఎల్(క్యాజ్వల్ లేబర్)లుగా తీసుకోకపోవడంతో వారంతా జెన్కో సీఎండీ డి.ప్రభాకర్ రావు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఇటీవల సీఎండీ ప్రభాకర్‌రావు పాల్వంచ కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్‌ను సందర్శించిన సమయంలో అర్హులైన వారికి న్యాయం చేస్తామని, మూడవ విడత జాబితా ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. సీఎండీ ఇచ్చిన హామీని అవకాశంగా చేసుకుని కొన్ని కార్మిక సంఘాల నాయకులు, మధ్య దళారులు కేటీపీఎస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటు అమాయక నిరుద్యోగులను నమ్మించి ఒక్కొక్కరి నుంచి లక్షలాది రుపాయలు దండుకుంటున్నారు. దళారుల దందా బారిన పాల్వంచ, బూర్గంపాడు, మణుగూరు, కొత్తగూడెం, సత్తుపల్లి, దమ్మపేట తదితర ప్రాంతాల వారు పడినట్లు తెలుస్తోంది. యాజమాన్యం తక్షణమే చొరవ తీసుకుని ఉద్యోగాలు కల్పిస్తే కేటీపీఎస్ 6వ దశ నిర్మాణ కార్మికులతో పాటు కొన్ని విభాగాల్లో పనిచేసిన కార్మికులు సుమారు 400 మించి ఉండరు. కానీ ఇప్పటికే వందలాది మంది వద్ద మాయగాళ్లు అక్రమంగా వసూళ్లు చేయడం గమనార్హం. చివరికి ఉద్యోగాలు వస్తే అవి తమ వల్లనే వచ్చాయని చెప్పి డబ్బులు ఉంచుకునేందుకు దళారులు పన్నాగం పన్నారు. ఉద్యోగాలు రాని వారి విషయంలో మాత్రం ఖర్చుల పేరుతో సగం నొక్కేసి మిగిలిన మొత్తాన్ని మాత్రమే తిరిగి ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఇప్పటికైనా యాజమాన్యం అర్హులైన కార్మికులెవరో గుర్తించి వారి జాబితాను రూపొందించాలని, విచారణ చేసి బహిరంగంగా తెలియజేసి వారికి ఉద్యోగాలు కల్పిస్తే అమాయక ప్రజలు నష్టపోకుండా చూడొచ్చని పలువురు కోరుతున్నారు. -
కాంట్రాక్టు జగన్నాథునికెరుక!
అనంతపురం న్యూసిటీ : సర్వజనాస్పత్రిలో అవినీతి, అక్రమాలు తారస్థాయికి చేరాయి. డబ్బు ముట్టజెబితే చాలు.. ఇక్కడ ఎలాంటి పని చేసేందుకైనా వెనుకాడని పరిస్థితి. మెడికల్ రికార్డు, ఓపీ, ఐపీ నిర్వహణ బాధ్యతను పరిశీలిస్తే అధికారులు ఏ స్థాయికి దిగజారినారో అర్థమవుతోంది. ఏడాదిన్నరగా కర్నూలుకు చెందిన ఓ ప్రయివేట్ సంస్థకు ఓపీ, ఐపీ, రికార్డుల నిర్వహణ బాధ్యతను అనధికారికంగా కట్టబెట్టారు. ఇందుకోసం ప్రతినెలా రూ.3.25లక్షలు చెల్లిస్తున్నారు. ఇందులో ఆసుపత్రిలోని కీలక అధికారికి భారీగా ముడుపులు ముడుతున్నట్లు చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఏడాదికి పైగా అదే కంపెనీని కొనసాగిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ప్రతి నెలా కలెక్టర్‌కు ఫైల్ పంపి కాంట్రాక్టును కొనసాగిస్తున్నట్లుగా తెలిసింది. ఇదీ సంగతి 2017లో ఎంసీఐ సర్వజనాస్పత్రిని తనిఖీ చేసి మెడికల్ రికార్డ్స్ నిర్వహణ సరిగా లేదని, డిజిటలైజేషన్ పక్కాగా ఉండాలని స్పష్టం చేసింది. దీన్ని ఆసరాగా చేసుకొని ఆస్పత్రిలోని కీలక అధికారి ఎలాంటి టెండర్ లేకుండానే ఓ కంపెనీకి ఐపీ, ఓపీ, రికార్డ్స్ నిర్వహణ బాధ్యతను కట్టబెట్టారు. అప్పట్లో ఈ విషయమై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. కానీ అధికార పార్టీ నాయకల అండతో కాంట్రాక్ట్‌ను కొనసాగిస్తూ వచ్చారు. కంపెనీ నిర్వాహకులు ఆస్పత్రిలో పూర్తి స్థాయి సామగ్రిని కూడా సమకూర్చుకోలేదు. ఓపీ, ఐపీ, మెడికల్ రికార్డ్ రూంలో తూతూమంత్రంగా కంప్యూటర్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిలోనూ సర్వజనాస్పత్రికి చెందిన కంప్యూటర్లే ఉన్నాయి. ప్రతి నెలా కరెంటు బిల్లు చెల్లించాల్సి ఉన్నా.. ఆస్పత్రిపైనే భారం వేస్తున్నారు. రూ.1.50లక్షకు పైనే లబ్ధి కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు చెల్లించేలా ఆస్పత్రి యాజమాన్యం కాంట్రాక్ట్‌ను అప్పగించింది. ఇక్కడ 10 మంది సిబ్బంది పని చేస్తున్నారు. వారికి ప్రతి నెలా రూ.6వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఈ లెక్కన రూ.60వేలు సిబ్బందికి ఖర్చవుతుంది. ఇక మెడికల్ రికార్డ్స్ పేపర్లకు రూ.లక్ష కూడా ఖర్చు కాదని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. అంటే.. కంపెనీ ప్రతి నెలా రూ.1.50లక్షకు పైగానే లబ్ధి పొందుతోంది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులతో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిబ్బందికి అందని వేతనాలు ఐపీ, ఓపీ, మెడికల్ రికార్డ్ సెక్షన్లో విధులు నిర్వర్తించే సిబ్బందికి గత నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కంపెనీకి ప్రతి నెలా రూ.3.25 లక్షలు వస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడం పట్ల సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం విధులకు హాజరైనట్లు వ్యాట్సాప్‌లో ఫొటోలు ఉంచడం మినహా తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. వేతనాల విషయమై కంపెనీ నిర్వాహకులను ఆరా తీస్తే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడుకోవాలని నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నట్లుగా సమాచారం. నిబంధనలకు పాతర సర్వజనాస్పత్రిలో ఓ కీలక అధికారి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి పనిలోనూ కమీషన్ తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏదైనా పని జరగాలంటే ఆ అధికారిని కలిస్తే చాలని ఆసుపత్రిలోనే బహిరంగ చర్చ జరుగుతోంది. రూ.వెయ్యి మొదలు రూ.లక్షల వరకు ఆయన దేన్నీ వదలడం లేదని తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం లేదని ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి. -
ఉద్యోగులకు భరోసా
ఆదిలాబాద్‌టౌన్: కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం భరోసా కల్పించింది. వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్న ఆశ కార్యకర్తలు, ఎన్‌యూహెచ్‌ఎంలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, గోపాలమిత్రలు, సెకండ్ ఏఎన్ఎంలు, కాంట్రాక్టు వైద్యులు ఈ పెంపుతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రగతి నివేదన సభ కంటే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. ముందస్తు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వేతనాలు పెంచినప్పటికీ వీరికి మేలు జరగనుంది. ఇన్ని రోజులు నిరాశతో విధులు నిర్వహిస్తున్న ఉన్న వీరు పెంచిన వేతనాలతో బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంది. ‘రెండింతల’ ఉత్సాహం.. సెకండ్ ఏఎన్‌ఎంలలో రెట్టింపు ఉత్సాహం కనిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వీరికి రూ.11వేల నుంచి రూ.21 వేలకు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. గత కొన్నేళ్లుగా వీరు తక్కువ వేతనంతోనే విధులు నిర్వహిస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ పలుసార్లు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. 2016లో దాదాపు 48 రోజుల పాటు సమ్మె చేపట్టారు. విధులు నిర్వహించకుండా డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట, కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు. ఆ సమయంలో ప్రభుత్వం సమ్మెను విరమిస్తే కానీ వేతనాలు పెంచమని స్పష్టం చేయడంతో గత్యంతరం లేక వారు సమ్మెను విరమించుకున్నారు. సమ్మె చేసిన కాలంలో వీరికి వేతనం చెల్లించలేదు. అప్పటి నుంచి నిరాశలో ఉన్న వీరు ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమ్మె చేసిన ఒకటిన్నర సంవత్సరాల తర్వాత ప్రభుత్వం వీరి పట్ల కరుణ చూపింది. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 129 ఆరోగ్య ఉపకేంద్రాలు ఉన్నాయి. వీరు ఉప కేంద్రాల్లో విధులు నిర్వహిస్తారు. మాతా శిశు మరణాలను తగ్గించడం, ఇమ్యునైజేషన్ నిర్వహించడం, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం, క్లోరినేషన్ చేయించడం, జనాభా నియంత్రణ గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, క్షయ, కుష్టు, తదితర వ్యాధిగ్రస్తులను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యసేవలు చేయించడం, తదితర సేవలు అందిస్తున్నారు. మొదటి ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహిస్తున్న వీరికి నెలకు రూ.11వేలు వేతనం చెల్లించడం, రెగ్యులర్ ఏఎన్ఎంలకు రూ.20 వేలు చెల్లించడంతో వారు గతంలో ఆందోళన బాట పట్టారు. తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రూ.21 వేలు వేతనం అందనుండడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెరవేరిన ఆశలు.. గత కొన్నేళ్లుగా గ్రామాల్లో ఏఎన్ఎంలతో సమానంగా పనిచేస్తున్న ఆశ కార్యకర్తలు చాలీచాలనీ వేతనాలు పొందుతూ కాలం వెళ్లదీస్తున్నారు. గతేడాది క్రితం రూ.వెయ్యి వరకు ఉన్న పారితోషికాన్ని రూ.6 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.6 వేల నుంచి రూ.7,500కు వేతనం పెంచారు. ఈ నిర్ణయంతో వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 1024 మంది ఆశ కార్యకర్తలు పని చేస్తున్నారు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి మరోసారి రూ.1500 వేతనం పెంచింది. వీరు గర్భిణులను ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రసవానికి తీసుకెళ్లడం, గ్రామాల్లో డయేరియా, తదితర వ్యాధులు ప్రబలినప్పుడు అప్రమత్తమై అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు క్లోరినేషన్ చేయిస్తున్నారు. కేసీఆర్ కిట్ పథకం విజయవంతం కావడంలో వీరి పాత్ర కీలకం. టీబీ వ్యాధికి గురైన వారిని సమీప ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించి మందులను ఇప్పిస్తున్నారు. వేతనాలు పెంచడంపై ఆశ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంపు.. జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 34 మంది కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. జిల్లాలో కేవలం 10 మంది మాత్రమే రెగ్యులర్ వైద్యులు ఉన్నారు. ఆదిలాబాద్‌లోని 5 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో కేవలం నలుగురు మాత్రమే కాంట్రాక్టు వైద్యులు పని చేస్తున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు ప్రభుత్వం ప్రస్తుతం రూ.40 వేలు వేతనం చెల్లిస్తోంది. పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వైద్యులకు మాత్రం రూ.36 వేలు వేతనం చెల్లిస్తున్నారు. తాజాగా కేబినెట్ నిర్ణయంలో వీరికి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో పని చేస్తున్న వైద్యులతో సమానంగా రూ.40వేల వేతనం పెంపునకు నిర్ణయం తీసుకున్నారు. గోపాలమిత్రలకు.. పశు సంవర్థక శాఖలో గోపాలమిత్రలు పాడి అభివృద్ధి కోసం గత కొన్నేళ్లుగా కృషి చేస్తున్నారు. గ్రామాల్లోకి వెళ్లి గ్రామాల్లోని ఆవులు, గేదెల్లో క్రాస్ బీడ్ చేస్తూ సంకరజాతి పశువుల పెంపుదలకు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాల ఉత్పత్తులు పెరుగుతున్నాయి. అంతే కాకుండా గ్రామాల్లో పశువులకు వైద్య సేవలు అందిస్తున్నారు. గత 15 ఏళ్లుగా వీరు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదీస్తున్నారు. కేవలం రూ.3500తో విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఇది వరకు వేతనాలు పెంచకపోవడంతో చాలా మంది గోపాలమిత్రలు విధుల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో 9 మంది మాత్రమే పని చేస్తున్నారు. వీరికి ప్రభుత్వం రూ.7500కు వేతనం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. చాలా ఆనందంగా ఉంది.. గత కొన్నేళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాం. పెరిగిన నిత్యావసర ధరలతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం. వేతనాలు పెంచాలని గతంలో పలుసార్లు ఆందోళనలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఆనందాన్నిచ్చింది. మొదటి ఏఎన్ఎంలతో సమానంగా విధులు నిర్వహించినప్పటికీ వేతనాల్లో తారతమ్యం ఉండేది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. – సునిత, సెకండ్ ఏఎన్ఎం, భీంసరి, ఆదిలాబాద్ ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు వైద్యులకు వేతనం పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షనీయం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేస్తున్న వారికి రూ.40 వేలు చెల్లిస్తుండగా, మాకు మాత్రం రూ.33 వేలు వేతనం చెల్లిస్తున్నారు. ప్రభుత్వం మా సేవలను గుర్తించినందుకు ఆనందంగా ఉంది. – డాక్టర్ వినోద్, ఆదిలాబాద్ -
ఆశ్రమాల్లో శ్రమ దోపిడీ..!
ఖానాపూర్ ఆదిలాబాద్ : రెక్కలు ముక్కలు చేసుకున్నా.. బుక్కెడు బువ్వ కోసం అంగలార్చుతున్నారు. వెట్టిచాకిరి చేస్తూ.. అర్ధాకలితో అలమటిస్తున్నారు. కష్టపడి పనిచేస్తున్నా.. కనీస వేతనానికి నోచుకోవడంలేదు. బతుకుదెరువు కోసం అప్పులు చేయక తప్పడంలేదు. ఐదారు నెలలకోసారి వ చ్చే కొద్దిపాటి జీతం అప్పులకూ సరిపోవడంలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గిరిజన సంక్షేమశాఖ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న దినసరి కూలీలు బతుకులు దినదిన గండంతో బతుకులు వెల్లదీస్తున్నారు. అమలుకు నోచుకోని హామీలు.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమశాఖ ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహా ల్లో పనిచేస్తున్న 300 మంది దినసరి కూలీలపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోంది. 30 ఏ ళ్లుగా పని చేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు కూడా అమలు చేయడం లేదు. పైగా మూడు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. ఈ దినసరి కూలీల జీతభత్యాల విషయం ఆయా జిల్లా ల కలెక్టర్ల పరిధిలో ఉంటుంది. దీంతో కార్మికులందరికీ వేతనాలు ప్రతీ నెల ట్రెజరీల ద్వారా ఇవ్వాల్సి ఉన్నా సక్రమంగా చెల్లించడం లేదని కార్మికులు వాపోతున్నా రు. సంక్షేమ శాఖ విడుదల చేసిన జీవో ప్రకారం వేతనాలు చెల్లించాల్సి ఉన్నా, కలెక్టర్లతో జీవోలు విడుదల చేస్తూ నామమాత్రం జీతాలు చెల్లిసున్నారన్న విమర్శలున్నా యి. ఈ విషయాన్ని దినసరి కూలీల సంఘం ఆధ్వర్యంలో పలుసార్లు గిరిజన సంక్షేమ శాఖ దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం లేదు. దినసరి కూలీలను శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తామని ప్రభుత్వాలు హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా నేటికీ ఆచరణకు నోచుకోవడం లేదు. శాశ్వత నియామకాల కోసం ఎదురుచూపు... విధి నిర్వహణలో మరణించిన దినసరి కూలీల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ లభించడం లేదు. 23 డిసెంబర్ 2011న ఆ శాఖ కమిషనర్ సోమేశ్‌కుమార్ జిల్లా అధికారుల సమావేశంలో దినసరి కూలీలను క్రమబద్ధీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. 2012 జనవరి 16లోగా సంబంధిత ఏటీడబ్ల్యూవోకు దినసరి కూలీల వివరాలు అందజేయాలని సూచించారు. ఇది దినసరి కూలీల్లో ఆశలు రేకెత్తించినా ఎంతోకాలం నిలువలేదు. రెగ్యులరైజ్ చేసే అవకాశం ఉన్నా... రెండుమూడేళ్లు కొనసాగి నైపుణ్యం సంపాదించిన వారిని రెగ్యులరైజ్ చేయాలనే నిబంధన ఉన్నా అమలుకు నోచుకోవడంలేదు. పైగా ప్రభుత్వం వీ రితో వెట్టిచాకిరి చేయిస్తోంది. అయినప్పటికీ ప్ర భుత్వం ఏదో ఒకరోజు తమను రెగ్యులరైజ్ చేయకపోతుందా.. అన్న ఆశే వారిని పని చేసేలా చే స్తోంది. లేబర్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం శాశ్వత ప్రాతిపదికన గల ప్రభుత్వ శాఖల్లో తాత్కాలిక ఉద్యోగుల్ని ప్రభుత్వం నియమించకూడదు. అంటే పనిలోకి తీసుకున్న వారు కొన్నాళ్ల పాటు పనిచేస్తే వారిని పర్మినెంట్ చేయాలి. కానీ.. 30 ఏళ్లుగా పని చేస్తున్నా ప్రస్తుతం రెగ్యులరైజ్ చేసిన దాఖలాలు లేవు. దినసరి కూలీల విషయంలో ప్రభుత్వం గాని, పనిచేయించుకుంటున్న శాఖలు గాని ఇవేమీ పట్టించుకోవడం లేదు. ఫలితంగా వీరికి పని భద్రత, జీవన భద్రత, ఉద్యోగ భద్రత లేకుండా పోతోంది. నెరవేరని హామీలు... జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తమను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ఆ సంఘం ఆధ్వర్యంలో దినసరి కూలీలు ఇప్పటికే అప్పటి ముఖ్యమంత్రులు, ఆ శాఖ మంత్రులు, కమిషనర్లను కలిశారు. అలాగే 2016 సెప్టెంబర్ 29న హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిసి వారి గోడు వెల్లబోసుకున్నారు. దీంతో తమను రెగ్యులరైజ్ చేస్తామని అధికారులు, సీఎం ఇచ్చిన హామీలు కూడా నెరవేరడం లేద ని కార్మికులు వాపోతున్నారు. ఇప్పటికైనా తమకంటూ ఒక వేతన విధానం నిర్ణయించి, పెరిగిన నిత్యావసర ధరలు, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు, దృష్టిలో ఉంచుకుని నెలనెలా వేతనాలు చెల్లిం చి పర్మినెంట్ చేయాలని వారు కోరుతున్నారు. -
కాంట్రాక్ట్ నియామకాలపై పునరాలోచన
సాక్షి, న్యూఢిల్లీ : ఉద్యోగులను ఇష్టానుసారంగా నియమించుకుని..ఎప్పటికప్పుడు వదిలించుకునే హైర్ అండ్ ఫైర్ పద్ధతికి చెక్ పెట్టాలని కేంద్రం యోచిస్తోంది. అన్ని రకాల ఉద్యోగాలకు నిర్ణీత వ్యవధి కాంట్రాక్టులపై ఉద్యోగుల నియామకాలకు బడ్జెట్లో ఇచ్చిన వెసులుబాటుపై కేంద్రం పునరాలోచనలో పడింది. ఇష్టానుసారం ఉద్యోగులను తొలగించేందుకు ఈ వెసులుబాటు ఉపకరిస్తుందని కార్మిక సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన క్రమంలో సర్కార్ మెత్తబడింది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకాలను టెక్స్టైల్స్ నుంచి అన్ని రంగాలకూ వర్తింపచేస్తున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రోత్సహించేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేంద్రం భావిస్తోంది. దీనిపై కార్మిక సంఘాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినా కార్మిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేసింది. ట్రేడ్ యూనియన్లు ఈ ప్రతిపాదనపై పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు నోటిఫికేషన్‌పై ప్రభుత్వం తొందరపాటుతో లేదని..దీన్ని తిరిగి రీడ్రాఫ్ట్ చేస్తామని కార్మిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. హైర్ అండ్ ఫైర్ పద్ధతిని ప్రోత్సహించే ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం ప్రభుత్వం సీరియస్‌గా లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. గతంలో కేవలం టెక్స్టైల్స్ రంగంలో మాత్రమే ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టుపై ఉద్యోగుల నియామకానికి వెసులుబాటు ఉంది. ప్రస్తుతం కాంట్రాక్టు కార్మిక చట్టం ప్రకారం కేవలం అనుబంధ కార్యకలాపాలకే కాంట్రాక్టు ఉద్యోగులను తీసుకోవాలి..ప్రధాన వ్యాపార కార్యకలాపాల్లో శాశ్వత ఉద్యోగులనే నియమించుకోవాలి. శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలకు కాంట్రాక్టు ఉద్యోగాలు ఎంతమాత్రం ప్రత్యామ్నాయం కాదని..తాము ఇలాంటి ప్రతిపాదనలను ఆమోదించబోమని ట్రేడ్ యూనియన్ నేతలు స్పష్టం చేశారు. -
ఎలా గెలుస్తారో చూస్తాం...
విజయనగరం మున్సిపాలిటీ: సమస్యలు పరిష్కారమిస్తామని, రెగ్యులరైజ్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించటాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 20 నుంచి కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు దిగనున్నట్టు ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పి.మధుబాబు, ప్రధాన కార్యదర్శి ఎం.బాలకాశీ స్పష్టం చేశారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం ఎలా గెలుస్తుందో చూస్తామని హెచ్చరించారు. స్థానిక వీటీ అగ్రహారం సబ్‌స్టేషన్ వద్ద జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగుల బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా జేఏసీ నాయకులు బి.గోవిందరావు, సంతోష్‌కుమార్, ఎం.వెంకటఅప్పారావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంతకు ముందు వేదికపై ఉన్న అతిథులంతా చేయి చేయి కలిపి సమరశంఖం పూరించారు. రాష్ట్రంలో 35 వేల మంది ఉద్యోగులు కాంట్రాక్టు ప్రాతిపదికన విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు తన మేనిఫేస్టోలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్న తమ గురించి పట్టించుకోకపోవటం దారుణమన్నారు. మరో వైపు పదే పదే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులను కలిసి తమ సమస్యలపై విన్నవించినా పట్టించుకున్న వారు లేకపోయారన్నారు. చివరికి గత నెల 25 వరకు కలెక్టరేట్ ఎదుట రిలే దీక్షలు చేపట్టగా... సమ్మెను వాయిదా వేయాలని... ఈనెల 4లోగా సమస్యలు పరిష్కరిస్తామని హమీ ఇవ్వగా.. ఎటువంటి స్పందన లేదన్నారు. 15 నుంచి 20 సంవత్సరాలుగా విద్యుత్ శాఖలో ప్రాణాలకు తెగించి వెట్టి చాకిరి చేస్తున్న తమకు పీసు రేటు పెట్టి బానిసలుగా చూస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనాలు అమలు చేయలేదన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని నమ్మించి మా కుటుంబాలకు చెందిన ఓట్లు వేయించుకున్న చంద్రబాబు నేడు ప్రభుత్వం వైఖరి చూస్తుంటే వ్యతిరేక ఓటు తప్పనిసరిగా మారిందన్నారు. తక్షణమే పీసు రేటును రద్దు చేయాలని, కాంట్రాక్టు్ట ఉద్యోగులందరిని రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఈ నెల 20 నుంచి మరోమారు చేపట్టనున్న నిరసన కార్యక్రమాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బహిరంగ సభలో కాంట్రాక్టు ఉద్యోగులకు మద్దతుగా వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బికెవి.ప్రసాద్, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.అప్పలసూరి, సీపీఐ జిల్లా కార్యదర్శి వి.కృష్ణంరాజు తదితరులు మద్దతుగా మాట్లాడారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల న్యాయ పోరాటానికి మద్దతు ఇస్తామని, ప్రభుత్వం మెడలు వంచి హక్కులు సాధించేంత వరకు వెన్నంటే ఉంటామంటూ సంఘీభావం తెలిపారు. అధిక సంఖ్యలో కాంట్రాక్టు విద్యుత్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
దోపిడీ అ‘ధనం’
పట్నంబజారు (గుంటూరు) : ఏపీఎస్ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. బస్సులను ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ప్రకటనలు చేస్తున్నా పూర్తి స్థాయిలో సఫలం కాలేదనే చెప్పాలి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ప్రయాణం భారంగా మారుతోంది. ఈ నెల 6వ తేదీన ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రీజియన్ పరిధిలోని అధికారులు హెవీ డ్రైవింగ్ లెసైన్సులు కలిగిన డ్రైవర్లు, పదో తరగతి విద్యార్హత కలిగిన వారిని కండక్టర్లుగా తీసుకున్నారు. సుమారు 13 డిపోల్లో 200 మంది డ్రైవర్లు, కండక్టర్లను తాత్కాలిక విధుల్లోకి తీసుకున్నారు. కాంట్రాక్ట్ కార్మికలు మాత్రం విధులకు వచ్చి వెళుతున్నట్టు అధికారులు తెలిపారు. రీజియన్ పరిధిలో మొత్తం 1275 బస్సులు ఉన్నాయి. వాటిలో 1050 ఆర్టీసీవీ కాగా, 225 హైర్ బస్సులు. సమ్మె ప్రారంభం అయిన నాటి నుంచి డిపో నుంచే హైర్ బస్సులు తిరుగుతున్నా, ఆర్టీసీకి ఎలాంటి రసుం చెల్లించడం లేదు. కాంట్రాక్ట్ ప్రకారం ఆర్టీసీకి చెల్లించాల్సిన మొత్తం కూడా చెల్లించటం లేదు. అయితే గమ్యస్థానం ప్రకారం ఒక నిర్ధిష్ట మొత్తాన్ని సంస్థకు చెల్లించాలని అధికారులు వారికి సూచించి సర్వీసులకు పంపిస్తున్నారు. గమ్యస్థానం, ధరల పట్టికను వారికి అందజేశారు. అయితే వారిలో కొంత మంది మాత్రం టికెట్ ధరకు అదనంగా వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ ధర రూ.20 ఉంటే రూ. 40 వరకు తీసుకుంటున్నారని ప్రయాణికులు వాపోతున్నారు. టికెట్లు ఇచ్చే పద్ధతి లేకపోవడంతో కొంత మంది సిబ్బంది తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ప్రయాణికుల నుంచి అధికమొత్తంలో వసూలు చేయకుండా అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ప్రైవేట్ దందా.... ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలకు వరంగా మారింది. రీజియన్ పరిధిలో నిత్యం 400 సర్వీసుల వరకు దూరప్రాంతాలకు వె ళుతుంటాయి. సమ్మె నేపథ్యంలో రీజియన్‌లోని 13 డిపోల నుంచి ఆర్టీసీకి చెందిన ఒక్క బస్సు కూడా దూరప్రాంతాలకు వెళ్లటంలేదు. దీంతో ప్రయాణికులు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, చెన్నై తదితర ప్రాంతాలకు ఒకటికి నాలుగు రెట్లు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. ఇలా ప్రయాణం భారంగా మారుతోందని చెబుతున్నారు. హైదరాబాద్‌కు టికెట్ రూ.400 ఉంటే రూ.1200 వరకు వసూలు చేస్తున్నారంటే ప్రైవేట్ దందాను అర్థం చేసు కోవచ్చు. అధికారులు స్పందించి ప్రైవేట్ బస్సుల దోపిడీని అరికట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు. తాత్కాలిక సిబ్బందికి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం... సమ్మె నేపథ్యంలో విధుల్లో తీసుకున్న తాత్కాలిక సిబ్బందికి నిత్యం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ పీవీ రామారావు చెప్పారు. అధికంగా వసూలు చేస్తున్నారనే విషయం తమ దృష్టికీ వచ్చిందన్నారు. టికెట్టు ధర కంటే అధికంగా వసూలు చేయొద్దని వారికి చెప్పటం జరిగిందన్నారు. ప్రస్తుతం టిమ్స్ వాడటం తాత్కాలిక సిబ్బందికి ఇబ్బందిగా ఉంటుందనే దృష్టితో నేరుగా చార్జీలు తీసుకుంటు న్నామన్నారు. అధిక చార్జీలు వసూలు చేయకుండా పూర్తి స్థాయిలో దృష్టి సారించి చర్యలు చేపడతామన్నారు. - ఆర్ఎం రామారావు, గుంటూరు. -
మూడో రోజూ ఆర్టీసీ సమ్మె
ఎంసెట్‌కు సహకరించిన కార్మికులు రీజియన్ పరిధిలో 827 సర్వీసులు నడిపిన అధికారులు కార్మిక సంఘాలకు మద్దతు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) చేపట్టిన సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపిన విషయం విదితమే. రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఎంసెట్‌ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఎటువంటి ఆందోళన చేపట్టకుండా విద్యార్థులకు సహకరించారు. ప్రయాణికులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదనిపలు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. శనివారం నుంచి సమ్మెను యథాతథంగా నిర్వహిస్తామని వివరించారు. సమ్మె కారణంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 827 సర్వీసులు నడిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు గురువారం రాత్రే బస్టాండుకు చేరుకుని అక్కడే బస చేశారు. పోలీసులు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పీవీ రామారావు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్‌స్టాప్‌ల వద్ద మార్గ నిర్దేశం చేశారు. బస్సులు సరిపోకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంసెట్ పరీక్ష కేంద్రాలకు సైతం బస్సులను ఏర్పాటు చేశారు. కార్మిక సంఘాలకు కాంట్రాక్ట్ కార్మికుల మద్దతు కేవలం ఒక్కరోజు పని చేస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులు గురువారం ప్రకటించారు. అధికారులు ఎర వేసినా కాంట్రాక్టు కార్మికులు మాత్రం కార్మిక సంఘాలకే బాసటగా నిలిచారు. రీజియన్ పరిధిలో 242 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, 60 మంది కండక్లర్లు ఉన్నారు. అయితే కేవలం 10 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, ఇద్దరు కాంట్రాక్టు కండక్టర్లు మాత్రమే విధులకు వెళ్లడం గమనార్హం. బస్సులను అడ్డుకున్న కార్మికులు పిడుగురాళ్ల డిపోలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా డిపో గేట్లు తీసి ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను బయుటకు తెచ్చేందుకు పోలీసులు, ఆర్టీవో ప్రయుత్నించారు. దీన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు, కార్మికుల వుధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలి
కరీంనగర్ : కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాలపై పోరాడాలని ఐఎఫ్టీయు కరీనంగర్ జిల్లా ఉపాధ్యక్షుడు జాడి దేవరాజ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా మంచిర్యాలలోని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను వెంటనే పర్మినెంటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు వ్యవస్థకు వ్యతిరేకమని ప్రకటించిన రాష్ట్ర సీఎం నేడు కాంట్రాక్టు కార్మికుల గురించి పట్టించుకోవడం లేదన్నారు. అయితే హైదరాబాద్‌లో ఈ నెల 13వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగే బహిరంగ సభల పోస్టర్లను ఈ సందర్భంగా నాయకులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు, దాని అనుబంధ సంఘాల నాయకులు కాంతయ్య, నిశార్, సదానందం, రమేష్ తదితరులు పాల్గొన్నారు.