ఎంసెట్‌కు సహకరించిన కార్మికులు
రీజియన్ పరిధిలో 827 సర్వీసులు నడిపిన అధికారులు
కార్మిక సంఘాలకు మద్దతు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు
పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) చేపట్టిన సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపిన విషయం విదితమే. రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఎంసెట్‌ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఎటువంటి ఆందోళన చేపట్టకుండా విద్యార్థులకు సహకరించారు.
ప్రయాణికులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదనిపలు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. శనివారం నుంచి సమ్మెను యథాతథంగా నిర్వహిస్తామని వివరించారు. సమ్మె కారణంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 827 సర్వీసులు నడిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు గురువారం రాత్రే బస్టాండుకు చేరుకుని అక్కడే బస చేశారు.
పోలీసులు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పీవీ రామారావు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్‌స్టాప్‌ల వద్ద మార్గ నిర్దేశం చేశారు. బస్సులు సరిపోకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంసెట్ పరీక్ష కేంద్రాలకు సైతం బస్సులను ఏర్పాటు చేశారు.
కార్మిక సంఘాలకు కాంట్రాక్ట్ కార్మికుల మద్దతు
కేవలం ఒక్కరోజు పని చేస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులు గురువారం ప్రకటించారు. అధికారులు ఎర వేసినా కాంట్రాక్టు కార్మికులు మాత్రం కార్మిక సంఘాలకే బాసటగా నిలిచారు. రీజియన్ పరిధిలో 242 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, 60 మంది కండక్లర్లు ఉన్నారు. అయితే కేవలం 10 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, ఇద్దరు కాంట్రాక్టు కండక్టర్లు మాత్రమే విధులకు వెళ్లడం గమనార్హం.
బస్సులను అడ్డుకున్న కార్మికులు
పిడుగురాళ్ల డిపోలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా డిపో గేట్లు తీసి ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను బయుటకు తెచ్చేందుకు పోలీసులు, ఆర్టీవో ప్రయుత్నించారు. దీన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు, కార్మికుల వుధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
మూడో రోజూ ఆర్టీసీ సమ్మె
Published Sat, May 9 2015 3:18 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM
Advertisement
Advertisement