rtc workers
-
నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రభుత్వంలో విలీనంతో ఊపిరి
సాక్షి, హైదరాబాద్: తీవ్ర ఆర్థిక కష్టనష్టాలతో దివాలా దిశలో ఉన్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు.. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఊపరిలూదినట్టయింది. రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న తాజా నిర్ణయంతో సంస్థ మనుగడకు భరోసా, అందులోని 43,373 సిబ్బందికి ఉద్యోగ భద్రత లభించనుంది. పింఛన్ సదుపాయం సైతం లభించనుంది. ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులుగా ఉన్న సిబ్బంది మొత్తం రాష్ట్ర ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ, తెలంగాణ ఆర్టీసీ మాత్రం మనుగడలోనే ఉండనుంది. అందులో కేంద్ర ప్రభుత్వ ఈక్విటీ ఉన్నందున, కార్పొరేషన్‌ను రద్దు చేయటం అంత సులభమైన ప్రక్రియ కాదు. అందువల్ల ప్రస్తుతానికి కార్పొరేషన్‌గా కొనసాగుతూనే.. ఉద్యోగులు మాత్రం ప్రభుత్వ సిబ్బందిగా చెలామణి కానున్నారు. విలీన ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి అధికారుల కమిటీ ఇచ్చే నివేదిక అధారంగా విధివిధానాలు ఖరారు కానున్నాయి. 2020లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విష యం తెలిసిందే. ఫలితంగా అక్కడి ప్రజా రవాణా సంస్థ బలపడింది. ఉద్యోగుల ఆర్థిక స్థితిగతుల్లో మెరుగుదలతో వారిలో సంతృప్తి వ్యక్తమవుతోంది. తీరనున్న అప్పులు! ఈ విలీన ప్రక్రియతో ఆరీ్టసీపై జీతాల భారం పూర్తిగా తొలగనుంది. ప్రస్తుతం సంస్థ ప్రతి నెలా రూ.200 కోట్ల మేర జీతాల రూపంలో భరిస్తోంది. విలీనం తర్వాత జీతాలను ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించనున్నందున, తద్వారా మిగిలే రూ.200 కోట్లను సంస్థ అప్పులు, బకాయిలు తీర్చేందుకు వినియోగించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం తెలంగాణ ఆరీ్టసీకి రూ.2,400 కోట్ల బ్యాంకు అప్పులున్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు, భవిష్యనిధి, ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్) బకాయిలు మరో రూ.3,600 కోట్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పే స్కేల్ ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో ఆర్టీసీలోని శ్రామిక్, అటెండర్, డ్రైవర్, కండక్టర్ మొదలుకుని రీజినల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.. ఇలా సంస్థలోని అన్ని పోస్టులను ప్రభుత్వంలోని తత్సమాన పోస్టుల్లోకి మారుస్తారు. ఆయా పోస్టులకు వచ్చే వేతన స్కేల్‌ను వర్తింపజేస్తారు. ఇక విలీనంతో ఆర్టీసీ ఉద్యోగులకు పింఛన్ సదుపాయం లభించనుంది. సిబ్బంది ఆర్టీసీలో చేరిన సంవత్సరం ఆధారంగా పింఛన్ విధానాన్ని ఖరారు చేస్తారు. ఐదేళ్లకోసారి పీఆర్సీ: ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 2017, 2021 పే స్కేల్ పెండింగులో ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు. విలీనంతో ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ ప్రకారం స్కేల్‌ను వర్తింపజేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆరీ్టసీలో ప్రతి నాలుగేళ్లకు పే రివిజన్ జరుగుతుండగా, విలీనం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులతో సమంగా ప్రతి ఐదేళ్లకోసారి పీఆర్సీ ద్వారా జీతాల పెంపు ఉంటుంది. ఆర్టీసీకి 1,500 ఎకరాల సొంత భూములు న్నాయి. ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం నేపథ్యంలో, ఈ భూములను ప్రభుత్వం తన పరిధిలోకి తీసుకుంటుందా? కార్పొరేషన్ అధీనంలోనే ఉంచుతుందా? అన్నది చూడాల్సి ఉంది. కార్మిక సంఘాల హర్షం ‘తెలంగాణ వచ్చినప్పటి నుంచి చేస్తున్న డిమాండ్ ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉంది. అయితే విలీన విధివిధానాలు ఖరారు చేసే కమిటీలో ఆర్టీసీ కారి్మక సంఘాలకు కూడా చోటు కల్పించాలి..’అని ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటంలో ఎన్ఎంయూ పాత్ర ఉంది. తెలంగాణలోనూ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి అది నెరవేరింది. కారి్మకులకు అధిక లబ్ధి కలిగేలా విలీన విధివిధానాలు రూపొందించాలి..’అని ఎన్ఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ అన్నారు. ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపారు: బాజిరెడ్డి గోవర్దన్ సీఎం కేసీఆర్‌ది ఎంతో గొప్ప మనసని, ఎప్పట్నుంచో కష్టాల్లో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం అందించి, వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ కూడా సంస్థ విలీనంపై హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
కరోనాతో సహ జీవనం చేయాల్సిందే : పువ్వాడ
సాక్షి, హైదరాబాద్ : కరోనాతో మనం సహ జీవనం చేయాల్సిన అవసరం ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. రాబోయే రోజుల్లో లాక్డౌన్ ముగిశాక కూడా సానిటేషన్ మాస్క్‌లు తప్పనిసరిగా వాడాల్సి వస్తుందన్నారు. కరోనాతో ఎక్కువ దెబ్బతింటున్నది ట్రాన్స్పోర్ట్ విభాగమేనని, కేంద్రం నుండి సపోర్ట్ కావాలని అన్ని రాష్ట్రాల నుంచి విజ్ఞప్తి చేశామని చెప్పారు. ఇబ్బందులు ఉన్నప్పటికి ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామని తెలిపారు. (కరోనా కలవరం : వీడని విషాదం) కోవిడ్ కిట్స్‌ను రవాణా శాఖలో పని చేస్తున్నవారికి అందిస్తున్నామని, మొదట రాష్ట్రాల సరిహద్దుల వద్ద పని చేస్తున్నవారికి ఇస్తున్నామని పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. 5వేల కోవిడ్ కిట్లను డ్రైవర్లకు రవాణా శాఖ ద్వారా అందజేశామన్నారు. డ్రైవర్లకు కొవిడ్‌పై అవగాహన కల్పిస్తున్నామని, ప్రజా రవాణాపై రేపు కేబినెట్లో చర్చిస్తామని తెలిపారు. గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలా, వద్దా అనే విషయంపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్డౌన్ వల్ల అన్ని రంగాలకు నష్టం జరిగిందని, కేంద్రం అన్ని రంగాలను ఆదుకోవాలని కోరామని చెప్పారు. (21దాకా లాక్డౌన్..?) -
‘సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీకి చేసి చూపించారు’
సాక్షి, విజయవాడ : ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలపడంతో కార్మికుల్లో ఆనందం వెల్లివిరిసింది. వైఎస్సార్సీపీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నగరంలోని వైఎస్సార్ పార్కులో టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని కార్మికులు సంబరాలు చేసుకున్నారు. తమ కల సాకారం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఆయనకు అజన్మాంతం రుణపడి ఉంటామని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతం రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ముఖ్యమంత్రి సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారని కొనియాడారు. సీఎం నిర్ణయంతో ఆర్టీసీలో 53 వేల మంది కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారని హర్షం వ్యక్తం చేశారు. విలీనం సాధ్యం కాదన్న ప్రతిపక్ష పార్టీ నోటికి కళ్లెం వేసారని అభినందించారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు యావద్దేశాన్ని ఏపీ వైపు చూసేలా చేస్తున్నాయని తెలిపారు. -
ఆర్టీసీలో డిమాండ్ల సాధనకు 'ఏ క్షణమైనా' సమ్మె..
సాక్షి, సంగారెడ్డి: కొన్నేళ్లుగా ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఆ సంస్థలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాలైన టీఎంయూ, ఎన్ఎంయూ, టీజేఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్లు కొంతకాలంగా డిమాండ్ల సాధన కోసం పోరాటాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 25 లోగా తమ సమస్యలను పరిష్కరించకపోతే సమ్మె చేయకతప్పదని ఆ యూనియన్లు తెగేసి చెప్పాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద స్వతంత్ర సంస్థయిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మిక సంఘాలు ఓవైపు కోరుతూనే.. ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలని ఎత్తుగడలు వేస్తోందని మరోవైపు ఆరోపిస్తున్నారు. నష్టాల సాకు చూపి సంస్థను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం పన్నాగం పన్నుతోందని పలు సంఘాలు అనుమానిస్తున్నాయి. దీంతో సమ్మె సైరన్ మోగించడమే తక్షణ కర్తవ్యంగా భావించిన ఆర్టీసీ సంఘాలు సమ్మెకు ఉపక్రమించే దిశగా పయనిస్తున్నాయి. బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం సంస్థను నిర్వీర్యం చేసేలా చర్యలు చేపడుతోందని వారు ఆరోపిస్తున్నారు. దీంతో పలు సంఘాలు ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసులను అందజేశాయి. ఈ నెలాఖరులో సమ్మెకు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని యూనియన్లు పరోక్ష సంకేతాలిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 డిపోలు.. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 8 బస్ డిపోలున్నాయి. సంగారెడ్డి, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, సిద్దిపేట్, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌లలో డిపోలున్నాయి. ఈ డిపోల పరిధిలో మొత్తం 672 బస్సులు నిత్యం ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. ఈ బస్సుల పరిధిలో ప్రయాణికుల ఆక్యుపెన్సీ రోజుకు 2.60లు ఉందని ఆర్టీసీ అధికారుల లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా పరిధిలో సుమారుగా 3వేల మంది కార్మికులు వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. డిమాండ్లు ఇవే.. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో పనిచేస్తున్న కార్మికుల డిమాండ్లకు అనుగుణంగా ఆయా యూనియన్లు పరిష్కారానికి ప్రభుత్వంపై కొంత కాలంగా ఒత్తిడి తెస్తున్నాయి. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సమావేశమైన మంత్రివర్గం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించడంతో ఇక్కడ ప్రభుత్వంపై ఒత్తిడిని మరింత పెంచాలని యూనియన్లు నిర్ణయించాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధాన డిమాండ్‌గా కొంతకాలంగా యూనియన్లు పోరాటం చేస్తున్నాయి. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నాయి. ఉద్యోగుల కుటుంబ సభ్యులకు సూపర్ స్పెషాలిటీ వైద్య సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. డబుల్ డ్యూటీకి రెట్టింపు వేతనం ఇవ్వాలని, ఆరోగ్య పరంగా ఫిట్‌గా లేని డ్రైవర్లకు ప్రత్యామ్నాయ విధులు కేటాయించాలని కోరుతున్నారు. విధి నిర్వహణలో కార్మికుడు మృతిచెందితే కనీసం రూ.30 లక్షలకు తక్కువ కాకుండా చెల్లించాలన్నది మరో డిమాండ్. మహిళా ఉద్యోగులకు రెండేళ్ల చైల్డ్‌కేర్ సెలవులను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. సీలింగ్ లేకుండా గ్రాట్యుటీ చెల్లించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్ల సాధనకోసం కొంతకాలంగా డిపోల ఎదుట ధర్నాలు, రిలే నిరాహార దీక్షలు, రీజినల్ కార్యాలయాల ముట్టడి, తదితర కార్యక్రమాలు చేపట్టినప్పటికీ యాజమాన్యంలో సానుకూల దృక్పథం కనిపించలేదు. పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. కార్మికులతో యాజమాన్యం చర్చలు సఫలం కాకపోతే ఈ నెల 25 తర్వాత ఎప్పుడైనా సమ్మెకు దిగుతామని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంపై దృష్టి: ఆర్టీసీ యాజమాన్యానికి పలు కార్మిక సంఘాలు సమ్మె నోటీసులు ఇవ్వడంతో విరమణకు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తూనే.. మరోవైపు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఆర్టీసీపై ప్రభుత్వానికి సానుకూల దృక్పథం లేదని కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలను బట్టి తెలుస్తోందంటున్నారు. ఒక వేళ సమ్మె విరమణకు కార్మిక సంఘాలు అంగీకరించకపోతే పరిస్థితి ఏమిటన్న విషయంలో యాజమాన్యం సంబంధిత ఉన్నతాధికారులతో చర్చిస్తున్నట్లు సమాచారం. రీజియన్ల వారీగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమిటనే దానిపై ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తప్పని పరిస్థితుల్లో కార్మికులు సమ్మెకు ఉపక్రమిస్తే ప్రత్యామ్నాయ రవాణా మార్గాలపై దృష్టి సారించాలని సంబంధిత జిల్లాల ఉన్నతాధికారులకు యాజమాన్యం నుంచి ఆదేశాలు జారీ అయినట్లు యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. ఒకవైపు తమను సమ్మె విరమించుకోవాలని చెబుతూనే..ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించడమేమిటని వారు ప్రశ్నిస్తున్నారు. తాము సమ్మె చేయాలనే ఉద్దేశమే ప్రభుత్వానికి ఉన్నట్లుందని వారు ఆరోపిస్తున్నారు. 25 తర్వాత ఏ క్షణమైనా సమ్మె చేస్తాం కొంతకాలంగా మా డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నా ఆశించిన స్పందన కనిపించడం లేదు. పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులు చెల్లించాలి. కొత్త బస్సులను కొనుగోలు చేయాలి. కార్మికులకు పనిభారం తగ్గించాలి. సంస్థను ప్రభుత్వంపరం చేయాలి. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనే డిమాండ్ల సాధనకోసం పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే టీఎంయూ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీకి సమ్మె నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం ఇప్పటికైనా మా సమస్యలను పరిష్కరించాలి. లేకుంటే ఈ నెల 25 తర్వాత ఏ క్షణమైనా సమ్మెకు దిగుతాం. - కృష్ణారెడ్డి, సంగారెడ్డి డిపో టీఎంయూ కార్యదర్శి -
'సల్ల'ని కబురేది?
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆర్టీసీ బస్సు కండక్టర్.. కొడుకు పుట్టినరోజు వేడుకను పొద్దున్నే పూర్తి చేసుకుని సెకండ్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్లాడు. డిపోకు రాగానే అందుబాటులో ఉన్న తోటి కార్మికులు ఆయన చుట్టూ మూగారు. కొడుకు పేరుతో డిపోలోని సిబ్బంది అందరికి మజ్జిగ తాగించమని అడిగారు. జేబులోంచి రూ.2 వేలు తీసి అప్పటికప్పుడు పెరుగు డబ్బాలు తెప్పించి మజ్జిగ చేయించి అందరికీ తాగించాడు. కానీ మరుసటి రోజు ఎవరింటిలో ఏ ప్రత్యేక సందర్భం లేకపోవటంతో సిబ్బందికి మజ్జిగ లేకుండా పోయింది. ఈ వ్యవహారం కాస్త ఆశ్చర్యంగా ఉన్నా.. ఇప్పుడు ఆర్టీసీ డిపోల్లో జరుగుతున్న తంతు ఇదే. భగభగలాడుతున్న భానుడి ప్రభావానికి గురికాకుండా వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఇలా మజ్జిగనో, నిమ్మరసమో తాగాల్సి ఉంది. అవి దొరకాలంటే కచ్చితంగా సిబ్బందిలో ఎవరింటిలోనో ప్రత్యేక సందర్భం ఉంటే వారి పేరుతో ఆ సిబ్బంది జేబు ఖర్చు నుంచి తెప్పించాల్సిందే. లేదంటే మంచినీళ్లు తాగి సరిపెట్టుకోవాల్సిందే. జీతాలు చెల్లించేందుకు డబ్బులు లేక అల్లాడుతున్న ఆర్టీసీలో సిబ్బందికి మజ్జిగ తాగించే పరిస్థితి లేకుండా పోయింది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా పాఠశాలల సెలవులను ప్రభుత్వం పొడిగించింది. కానీ ఉష్ణోగ్రత ఎంతున్నా సరే విధుల్లో నిమగ్నమయ్యే డ్రైవర్లు, కండక్టర్లకు మాత్రం వేసవి నుంచి కాస్త ఉపశమనం కూడా లేకుండా పోవటం గమనార్హం. నయా పైసా రాదు.. ఓవైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఇంజిన్ వేడితో ఆర్టీసీ డ్రైవర్లు నరకయాతన అనుభవిస్తున్నారు. ఎండలో గంటల తరబడి బస్సు ఉంటుండటంతో అది బాగా వేడెక్కి డ్రైవర్లు, కండక్టర్లు సెగకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వడదెబ్బకు గురికాకుండా వారికి మంచినీటితోపాటు మజ్జిగ, నిమ్మరసం సరఫరా చేయాల్సి ఉంది. కానీ మంచినీళ్లు తప్ప అవి దొరికే పరిస్థితి లేదు. బస్‌భవన్ నుంచి డిపోలకు వీటి ఖర్చు కోసం నయాపైసా రావటం లేదు. కొన్ని డిపోల్లో మేనేజర్లే సొంత ఖర్చుతో కొన్నిరోజులు వాటిని ఏర్పాటు చేసినా కొనసాగించలేక చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా సిబ్బంది రోజుకొకరు చొప్పున వాటాలేసుకుని వాటిని ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువ మంది సిబ్బంది ఉండే డిపో అయితే రోజువారి ఖర్చు దాదాపు రూ.2 వేలు అవుతోంది. అంతమొత్తం భరించటం కొందరికి ఇబ్బందిగా మారటంతో చేతులెత్తేస్తున్నారు. మరో 20 రోజులకుపైగా ఎండలు కొనసాగనున్నాయి. రోహిణి కార్తె కావటంతో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. గత 2 రోజులుగా 45 డిగ్రీలను మించుతుండటంతో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంత ఎండలో సెకండ్ షిఫ్ట్‌లో ఉండే డ్రైవర్లు, కండక్టర్లు బస్సులో ఏర్పడే సెగతో వడదెబ్బకు గురవుతున్నారు. దాన్నించి తప్పించుకోవాలంటే సొంత డబ్బులతోనే మజ్జిగ, నిమ్మరసం తాగాల్సి వస్తోంది. కోటితో వేసవి మొత్తం.. రాష్ట్రంలో ఉన్న 97 డిపోలకు వేసవి మొత్తం మజ్జిగ, నిమ్మరసం నిత్యం అందుబాటులో ఉంచాలంటే దాదాపు రూ.కోటి వరకు ఖర్చవుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితిలో అది ఆర్టీసీకి భరించలేని మొత్తమే. నిత్యం రూ.11 కోట్ల ఆదాయం ఉన్నా, ఖర్చు దాన్ని మించి ఉంటుండటంతో ఆర్టీసీ నష్టాల్లోకి కూరుకుపోతోంది. వేరే పద్దు నుంచి ఈ ఖర్చును భరిద్దామన్నా అవకాశం ఉండటం లేదు. దీంతో డబ్బు లేక వేసవి ప్లాన్‌ను అమలు చేయటం లేదు. మంచినీళ్లు చల్లగా ఉండేందు కు కుండలు కొనటం తప్ప వేసవి ప్లాన్‌లో మజ్జిగ, నిమ్మరసం సరఫరా లేకుండా పోయింది. ఇలాంటి తరుణంలో ఉన్నతాధికారులు దాతలతో మాట్లాడి వాటిని ఏర్పాటు చేసే వీలున్నా అది అమలు కావటం లేదు. రాష్ట్రంలో విజయ డెయిరీతోపాటు పలు ప్రైవేటు డెయిరీలున్నాయి. వాటి యజమానులతో ఉన్నతస్థాయి వర్గాలు మాట్లాడితే.. సామాజిక బాధ్యత కింద పెరుగు సరఫరా చేసే అవకాశం ఉంది. కానీ ఆర్టీసీ యాజమాన్యం ఈసారి అలాంటి ప్రయత్నమే చేయలేదు. డిపో మేనేజేర్ల స్థాయిలో చిన్న దాతలు తప్ప పెద్ద స్థాయి కంపెనీలతో మాట్లాడటం సాధ్యం కావటం లేదు. చిన్న దాతలు ఒకట్రెండు రోజులు ఖర్చు భరించటానికే పరిమితమవుతున్నారు. డబుల్ డ్యూటీలపై ఆరా.. మజ్జిగ సంగతి పట్టించుకోరా.. డ్రైవర్లు కొరత వల్ల కొన్ని సర్వీసులు నిత్యం డిపోలకే పరిమితం కావాల్సి వస్తోంది. కొందరు డ్రైవర్లను డబుల్ డ్యూటీలకు ఒప్పించటం ద్వారా కొన్ని సర్వీసులను తిప్ప గలుగుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో డబుల్ డ్యూటీలకు వారు నిరాకరిస్తున్నారు. ఫలితంగా డిపోలకు పరిమితమయ్యే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇది మళ్లీ ప్రయాణికులకు ఇబ్బంది కలిగించే అంశం కావటంతో ఉన్నతాధికారు లు నిత్యం డిపో మేనేజర్ల స్థాయిలో వాకబు చేస్తూ డబుల్ డ్యూటీల విషయంపై ఆరా తీస్తున్నా రు. బస్సులు నిలిచిపోతే ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున ఎలాగోలా కొందరు డ్రైవర్లను ఒప్పించి డబుల్ డ్యూటీలకు పంపాలని పేర్కొంటున్నారు. ఎండలో మాడిపోతున్నా డబుల్ డ్యూటీలకు పంపుతూ.. వడ దెబ్బకు గురికాకుండా మజ్జిగ ఏర్పాటు చేయలేరా అంటూ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు బస్సులు ఆగిపోతే జనం అల్లాడిపోతారు. అలాంటి అతి ముఖ్యమైన బస్సులను ఎండ తీవ్రతకు వెరవకుండా నడుపుతున్న వారికి ఇప్పటికైనా మజ్జిగ, నిమ్మరసం అందుబాటులో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించాలని కార్మికులు కోరుతున్నారు. -
ఆర్టీసీకి సన్‌స్ట్రోక్..!
సాక్షి, హైదరాబాద్: నష్టాల ఆర్టీసీకి కష్టాలు వచ్చిపడ్డాయి. ఎండలు ముదురుతుండటంతో ఆర్టీసీలో కొత్త సమస్య ఏర్పడింది. డ్రైవర్ల కొరతతో నిత్యం కొన్నిబస్సులు డిపోలకే పరిమితమవుతుండగా, తాజాగా ఎండవేడి భరించలేక డ్రైవర్లు డబుల్ డ్యూటీకి నిరాకరిస్తున్నారు. దీంతో డిపోల్లో నిలిచిపోతున్న బస్సుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఫలితంగా అర్ధంతరంగా కొన్ని ట్రిప్పులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నెలాఖరుకల్లా ఎండ తీవ్రత మరింత పెరగనుండటంతో సమస్య ఎక్కువకానుంది. ఆర్టీసీలో ఆరేళ్లుగా డ్రైవర్ల నియామకం లేదు. పదవీవిరమణ అవుతున్నవారు, మృత్యువాత పడుతున్న వారు, అనారోగ్యం ఇతర కారణాలతో దీర్ఘకాలిక సెలవుల్లో వెళుతున్నవారు... వెరసి ప్రస్తుతం ఆర్టీసీలో రెండువేల మంది డ్రైవర్ల కొరత ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు డిపో అధికారులు అందుబాటులో ఉన్న డ్రైవర్లను బతిమిలాడి డబుల్ డ్యూటీలకు పంపుతున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఇది పెద్ద సమస్యగా మారింది. ఫైర్ సర్వీసెస్‌కు 200 మంది డ్రైవర్లు... డ్రైవర్ల కొరత హైదరాబాద్ నగరంలో మరింత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం నగరంలో దాదాపు 700 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనారోగ్యం, ఇతర సమస్యలతో కొందరు డ్యూటీలకు హాజరుకావటం లేదు. వెరసి నిత్యం వేయిమంది వరకు డ్రైవర్లు విధులకు రావటం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో నిత్యం 20 శాతం మేర సర్వీసులు డిపోలకు పరిమితమవుతున్నాయి. ఇటీవల అద్దెబస్సుల సంఖ్య బాగా పెంచటంతో సమస్య కొంత తగ్గినా, అది ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా లేదు. అగ్నిమాపక శాఖలో రిక్రూట్మెంట్ లేక డ్రైవర్లకు కొరత ఏర్పడింది. దీంతో తాత్కాలిక పద్ధతిలో ఆర్టీసీ నుంచి కొంతమందిని తీసుకోవాలని మూడేళ్ల క్రితం నిర్ణయించారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొనటంతో పెద్దసంఖ్యలో డ్రైవర్లు ఆప్షన్ ఇచ్చారు. దరఖాస్తులను పరిశీలించి 200 మందిని అగ్నిమాపక శాఖకు పంపారు. కానీ, మూడేళ్లు గడుస్తున్నా వారిని తిరిగి ఆర్టీసీకి పంపలేదు. అసలే డ్రైవర్ల కొరత, 200 మంది డిప్యూటేషన్‌లో ఇరుక్కుపోవటంతో ఆర్టీసీ ఆపసోపాలు పడుతోంది. దీంతో వారిని వెంటనే పంపాలంటూ అధికారులు ఇప్పుడు లేఖలు రాసినా స్పందన ఉండటం లేదు. కనీసం ఆ 200 మంది తిరిగి వస్తే కొంతమేర సమస్య పరిష్కారమవుతుందని అధికారులు భావిస్తున్నారు. -
ప్రగతి చక్రం.. తిరోగమనం!
సాక్షి, అమరావతి బ్యూరో: ప్రజారవాణా వ్యవస్థలో అత్యంత కీలకమైన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో సిబ్బంది సంఖ్యను యాజమాన్యం ప్రతిఏటా గణనీయంగా తగ్గిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో ఆర్టీసీలో 2011–12లో 64,639 మంది ఉద్యోగులు పని చేసేవారు. ఈ ఏడాది జూన్ నాటికి ఈ సంఖ్య 54,489కు పడిపోయింది. అంటే దాదాపు 10 వేల మందికి పైగా ఉద్యోగులు తగ్గిపోయారు. ఏపీఎస్ఆర్టీసీ ప్రస్తుతం నష్టాల ఊబిలో చిక్కుకుంది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇంకా చాలామంది ఉద్యోగులను తొలగించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కిస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ ఆ దిశగా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. అవసరానికి మించి ఉన్నారట! రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్టీసీలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించారు. గత రెండేళ్లలోనే 7,317 మంది ఉద్యోగుల కుదింపు జరిగింది. సంస్థలో సిబ్బంది అవసరానికి మించి ఉన్నారనే సాకుతో వారిని విధుల నుంచి తొలగించడానికి ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. పదవీ విరమణలతో ఖాళీ అయ్యే పోస్టులను కూడా భర్తీ చేయడం లేదు. 2015–16లో సంస్థలో 59,372 మంది ఉండగా, కేవలం ఏడాది కాలంలో ఆ సంఖ్య 56,592కి తగ్గిపోయింది. గత మూడేళ్ల కాలంలో 650 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, 350 మంది కాంట్రాక్టు కండక్లర్లను తొలగించారు. గత ఆరేళ్లలో ఆర్టీసీలో 9,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ అంతేనా? ఆర్టీసీలో కారుణ్య నియామకాలను యాజమాన్యం నిలిపివేసింది. ప్రస్తుతం దాదాపు 1,500 కారుణ్య నియామకాలు పెండింగ్‌లో ఉన్నాయి. దీనికితోడు ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను సైతం భర్తీ చేయడం లేదు. సంస్థలో చివరిసారిగా 2007లో రిక్రూట్మెంట్లు చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా పదేళ్లుగా ఖాళీల భర్తీ ఊసే ఎత్తడం లేదు. అమలు కాని 60 ఏళ్ల వయో పరిమితి ఆర్టీసీలో పదవీ విరమణ వయసు పెంపు విషయంలో టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని ఉద్యోగులు మండిపడుతున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచిన ప్రభుత్వం తమకు మాత్రం పెంపును వర్తింపజేయడం లేదని మండిపడుతున్నారు. సంస్థలో పదవీ విరమణ వయోపరిమితి పెంపును అమలు చేస్తే సిబ్బంది కొరత కొంతవరకు తీరుతుందని అంటున్నారు. అధికార పార్టీ నేతలకు ఉపాధి కేంద్రం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయి నష్టాల బాటలో నడుస్తున్న ఆర్టీసీని టీడీపీ ప్రభుత్వం రాజకీయ నిరుద్యోగులకు ఉపాధి కేంద్రంగా మార్చేసింది. సంస్థలో ఖాళీలను భర్తీ చేయకపోగా, అధికార పార్టీ నేతల కోసం జోనల్ ఛైర్మన్ల వ్యవస్థను పునరుద్ధరించింది. వారికి ఛాంబర్లు, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆర్టీసీలో ఆశ్రయం పొందుతున్న టీడీపీ నేతల హంగూ ఆర్భాటాల కోసం ఖర్చు చేస్తున్న నిధులతో ఎన్నో కొత్త బస్సులు కొనుగోలు చేయవచ్చని కార్మికులు చెబుతున్నారు. సిబ్బందిని కుదించడం దారుణం ‘‘నష్టాలు వస్తున్నాయనే సాకుతో ఆర్టీసీలో సిబ్బంది సంఖ్యను కుదించడం అన్యాయం. గత రెండేళ్లలోనే 6,000 మందిని తొలగించారు. సంస్థకు నష్టాలు వస్తే ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ఆదుకోవాలి గానీ ఉద్యోగులను తొలగించడం దారుణం. జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తామంటున్నారు. విమానాల్లో తిరిగేది పేదలు కాదుకదా. పేదల కోసం బస్సులు నడిపే ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాలి. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచాలి’’ – పలిశెట్టి దామోదర్‌రావు, రాష్ట్ర అదనపు కార్యదర్శి, ఈయూ ప్రైవేటీకరణకు సర్కారు కుట్ర ‘‘ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. అందుకోసమే సంస్కరణల పేరుతో సిబ్బందిని తొలగిస్తోంది. టిమ్ మిషన్లు, ఓడీ డ్యూటీలు ప్రవేశపెట్టి సిబ్బంది సంఖ్యను తగ్గిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 17 డిపోలకు మేనేజర్లు కొరత ఉంది. బస్సులు, ఉద్యోగుల సంఖ్యను పెంచి ఆర్టీసీని బలోపేతం చేయాలి’’ – సీహెచ్ సుందరయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎస్‌డబ్యూఎఫ్ -
కండక్టర్, డ్రైవర్ మధ్య వాగ్వాదం
భిక్కనూరు, నిజామాబాద్ : ‘ప్రయాణికుల సేవయే మా కర్తవ్యం’ అని చెప్పే ఆర్టీసీ యాజమాన్యం సిబ్బంది ఆవేశం, నిర్లక్ష్యంతో ప్రయాణికులకు సేవలు చేయడం మాని ఇబ్బందులకు గురిచేస్తున్న సంఘటనలు గతంలో కొక్కొల్లోలు. భిక్కనూరు మండలం బస్వాపూర్ వద్ద కండక్టర్ డ్రైవర్ వాగ్వాదానికి దిగారు. దీంతో కండక్టర్ బస్సు నుంచి దిగిపోయాడు. ఫలితంగా అరగంట పాటు బస్సు రోడ్డు పక్క న నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. కామారెడ్డి డిపోకు చెందిన బస్సు (ఏపీ 26జడ్ 0049) మెదక్ జిల్లా రామాయంపేట నుంచి గురువారం రాత్రి 6–30 గంటలకు కామారెడ్డి కి ప్రయాణికులతో బయలు దేరింది. బస్సు లో ప్రయాణికులు భారీగా ఉంది. దీంతో కం డక్టర్ బస్సును నిలిపివేస్తే టిక్కెట్లు ఇస్తానని డ్రైవర్‌కు చెప్పాడు. ఉక్క పోస్తుంది బస్సును మెల్లిగా నడుపుతా అంటూ బస్సును మెల్లిగా నడిపించాడు. ఈ క్రమంలో బస్సు భిక్కనూ రు మండలం బస్వాపూర్ గ్రామ శివారులోని జైకా హోటల్ సమీపంలోకి 6.40 గంటలకు చేరుకుంది. డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ ఈ విషయమై తిరిగి గొడవ పడ్డారు. దీంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. కండక్టర్ వెంటనే టిక్కెట్ల మిషన్ క్యాష్ బ్యాగ్ తీసుకుని బస్సు దిగి కొద్దిదూరం వెళ్లి కామారెడ్డి వైపు వెళ్లె వాహనాలను ఆపేందుకు యత్నించాడు. వెంటనే డ్రైవర్ కూడా బస్సు దిగి కండక్టర్‌తో తిరిగి వాగ్వాదానికి దిగాడు. ఇరువురు మరోసారి గొడవ పడ్డారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. పలువురు ప్రయాణికులు డ్రైవర్ కండక్టర్లను సముదాయించారు. కండక్టర్ డైవర్లు బస్సు ఎక్కారు. కండక్టర్ డ్రైవర్ల వాగ్వాదాంతో అరగంటపాటు ప్రయాణికులు రోడ్డుపై నిలుచోవాల్సి వచ్చింది. -
ఆర్టీసీ వర్సెస్ పోలీస్
పోలీసులను వారె ంట్, టికెట్లు అడుగుతున్న కండక్టర్లు ఓవర్‌లోడ్ పేరుతో బస్సులకు జరిమానా విధిస్తున్న పోలీసులు బద్వేలు అర్బన్: బద్వేలులో ఆర్టీసీ కార్మికులు, పోలీసుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం మొదలైనట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన సంఘటనతో నిజమేననే భావన కలుగుతోంది. ఈ నెల 6న ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఓ ప్రైవేటు బస్సుపై దాడి జరిగిన ఘటనలో పోలీసులు 20 మందిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. ఇదే సమయంలో బద్వేలు డిపోలోని బస్సులలో ప్రయాణిస్తున్న పోలీసులను కండక్టర్లు వారెంట్ ఉందా, లేక టికెట్ తీసుకుంటారా అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పోలీసులు కూడా ఓవర్‌లోడుతో ప్రయాణిస్తున్న బస్సులను ఆపి జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో గురువారం బద్వేలు నుంచి కడపకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులను అట్లూరు సమీపంలో అక్కడి పోలీసులు ఆపి తనిఖీలు చేయడంతో పాటు ఏపీ04 డబ్ల్యు 1889 నంబరు గల ఆర్టీసీ బస్సుకు ఒక్క ప్రయాణికుడు ఎక్కువగా ఉన్నాడనే కారణంతో రూ.100లు జరిమానా విధించారు. అలాగే ఏపీ29 జడ్ 3106 నంబరు గల బస్సును సైతం ఆపి పరిమితికి మించి ప్రయాణికులు ఉన్నారని రూ.2,000లు జరిమానా చెల్లించాలని సుమారు అర గంట పాటు బస్సును నిలిపివేశారు. చివరకు డీఎం జోక్యం చేసుకుని అక్కడి పోలీసులతో మాట్లాడడంతో బస్సును పంపినట్లు తెలిసింది. అలాగే బుధవారం రాత్రి కూడా ఏపీ28 జడ్ 5547 నంబరు గల ఆర్టీసీ బస్సును సైతం అట్లూరు సమీపంలో అరగంట పాటు ఆపి బస్సు డ్రైవర్ లెసైన్స్‌తోపాటు ప్రయాణికుల సంఖ్యను తనిఖీ చేసినట్లు తెలిసింది. మొత్తమ్మీద సమ్మె కాలంలో జరిగిన ఘటన ఆర్టీసీ సిబ్బందికి, పోలీసులకు నడుమ పెద్ద సమస్యగా మారింది. డీఎం ఏమన్నారంటే: ఈ విషయంపై ఆర్టీసీ డిఎం సుధారాణిని వివరణ కోరగా ఆర్టీసీ బస్సులకు జరిమానా విధించే అధికారం పోలీసులకు లేదని డ్రంక్అండ్ డ్రైవ్, డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడ్‌తో వాహనం నడపడం వంటి వాటిపై పోలీసులు తనిఖీ చేసే అధికారం ఉందని తెలిపారు. ఆర్టీసీ బస్సులు స్టేజీ కేరియర్లు కావని ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని ఆయన పేర్కొన్నారు. సీఐ ఏమన్నారంటే: ఆర్టీసీ బస్సులలో ఓవర్‌లోడ్‌గా ప్రయాణికులను ఎక్కించినా, రోడ్డుకు అడ్డంగా బస్సును ఆపినా, యూనిఫాం లేకున్నా సంబంధిత డ్రైవర్‌కు, కండక్టర్‌కు జరిమానా విధించే అధికారం పోలీసులకు ఉందని తెలిపారు. -
మూడో రోజూ ఆర్టీసీ సమ్మె
ఎంసెట్‌కు సహకరించిన కార్మికులు రీజియన్ పరిధిలో 827 సర్వీసులు నడిపిన అధికారులు కార్మిక సంఘాలకు మద్దతు తెలిపిన కాంట్రాక్ట్ కార్మికులు పట్నంబజారు(గుంటూరు) : ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం కూడా కొనసాగింది. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) చేపట్టిన సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలిపిన విషయం విదితమే. రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన కార్మిక సంఘాల నేతలు, కార్మికులు ఎంసెట్‌ను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం ఎటువంటి ఆందోళన చేపట్టకుండా విద్యార్థులకు సహకరించారు. ప్రయాణికులు, విద్యార్థులను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదనిపలు కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. శనివారం నుంచి సమ్మెను యథాతథంగా నిర్వహిస్తామని వివరించారు. సమ్మె కారణంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ అధికారులు రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 827 సర్వీసులు నడిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు గురువారం రాత్రే బస్టాండుకు చేరుకుని అక్కడే బస చేశారు. పోలీసులు హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీసీ రీజనల్ మేనేజర్ పీవీ రామారావు విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా బస్‌స్టాప్‌ల వద్ద మార్గ నిర్దేశం చేశారు. బస్సులు సరిపోకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎంసెట్ పరీక్ష కేంద్రాలకు సైతం బస్సులను ఏర్పాటు చేశారు. కార్మిక సంఘాలకు కాంట్రాక్ట్ కార్మికుల మద్దతు కేవలం ఒక్కరోజు పని చేస్తే కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని చెప్పి ఆర్టీసీ అధికారులు గురువారం ప్రకటించారు. అధికారులు ఎర వేసినా కాంట్రాక్టు కార్మికులు మాత్రం కార్మిక సంఘాలకే బాసటగా నిలిచారు. రీజియన్ పరిధిలో 242 మంది కాంట్రాక్ట్ డ్రైవర్లు, 60 మంది కండక్లర్లు ఉన్నారు. అయితే కేవలం 10 మంది కాంట్రాక్టు డ్రైవర్లు, ఇద్దరు కాంట్రాక్టు కండక్టర్లు మాత్రమే విధులకు వెళ్లడం గమనార్హం. బస్సులను అడ్డుకున్న కార్మికులు పిడుగురాళ్ల డిపోలో శుక్రవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమ్మె చేస్తున్న కార్మికులను పట్టించుకోకుండా డిపో గేట్లు తీసి ప్రైవేట్ వ్యక్తులతో బస్సులను బయుటకు తెచ్చేందుకు పోలీసులు, ఆర్టీవో ప్రయుత్నించారు. దీన్ని ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో పోలీసులు, కార్మికుల వుధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
ఆగిన రథచక్రాలు..
స్తంభించిన ఆర్టీసీ బస్సుల రాకపోకలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణికులు స్పందించని ప్రభుత్వంపై మండిపడ్డ కార్మికులు అనంతపురం రూరల్ : కార్మికుల సమ్మెతో ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోయాయి. దీని కారణంగా వందలాది బస్సులు రోడ్డెక్కలేదు. ప్రజానీకం గమ్యస్థానాలు చేరడం కోసం నానా అవస్థలు పడ్డారు. అసలే వేసవి కాలం కావడంతో బస్సుల కోసం గంటలతరబడి నిరీక్షించి అలసిపోయారు. లక్షల మంది ప్రయాణాలను విరమించుకున్నారు. అదే స్థాయిలో ప్రైవేట్ వాహనాల్లో ఇబ్బందులు పడుతూ భయం గుప్పిట్లో ప్రయాణించారు. జిల్లాలోని 12 డిపోల్లో సమ్మె తీవ్రంగా సాగింది. అనంతపురంతో పాటు, హిందూపురం, పెనుకొండ, గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ, కళ్యాణదుర్గం, ధర్మవరం, రాయదుర్గం, పుట్టపర్తి, మడకశిర, కదిరి డిపోల్లో ఆర్టీసీ కార్యకలాపాలు స్తంభించాయి. నిత్యం ప్రయాణికులతో కిక్కిరిసిపోయే బస్టాండ్లు వెలవెలబోయాయి. గత్యంతరం లేక రైలు, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ప్రైవేట్ వాహనదారులు దోపిడీకు ప్రజలు బలయ్యారు. ప్రయాణికుల అవసరాన్ని ఆసరాగా తీసుకున్న జీపులు, వ్యాన్లు, బస్సుల నిర్వాహకులు అధిక రేట్లతో బస్సులు తిప్పారు. ఇదిలా ఉండగా అధికారులు బస్సులు తిప్పేందుకు ప్రయత్నించగా ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, కార్మికులు తిప్పికొట్టారు. బస్సులకు అడ్డంగా పడుకుని అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వం సైతం ఎక్కడా ఆస్తి నష్టం కల్గకుండా ప్రత్యేక పోలీసులు బలగాలను రంగంలోకి దింపారు. ఘర్షణలకు దారితీయకుండా పోలీసులు సమన్వయం పాటించారు. అధికారులు కార్మికుల కన్నుగప్పి హైర్ బస్సులను దొంగగా తిప్పారు. ఊరి సరిహిద్దు ప్రాంతాల నుంచి బస్సులను తిప్పారు. ఇది తెలుసుకున్న నేతలు పాతవూరు, కళ్యాణదుర్గం బైపాస్, కలెక్టరేట్ వద్ద బస్సులను ఆపారు. బస్సులు తిప్పతే ఉపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. అల్లాడిపోయిన ప్రజానీకం సమ్మె కారణంగా వేలాది మంది ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. అసలే వేసవి సెలవులతో పాటు, పెళ్లిళ్ల సందడి కారణంగా ఆర్టీసీకు మంచి సీజన్ సమయంలో బస్సులు ఆగిపోయాయి. ప్రయాణికులు ఎప్పుడెప్పుడు బస్సు వస్తుందా అంటూ ఎదురు చూసినా ఫలితం లేకుండా పోయింది. ప్రయాణికులతో బస్టాండ్ కిక్కిరిసిపోయింది. తల్లిదండ్రులు చిన్నపిల్లలను వెంటబెట్టుకుని బస్టాండ్‌లో గంటల తరబడి నిలుచుండిపోయారు. ఇక ఎంతో మంది చేసేది ఏమీ లేక ఇళ్లకు వెళ్లారు. ప్రైవేట్ వాహనాలకు భలే గిరాకీ ఆర్టీసీ సమ్మె కావడంతో ప్రైవేట్ వాహనాలకు మంచి గిరాకీ లభించింది. ప్రైవేట్ ట్రావెల్స్తో పాటు మినీ వ్యాన్లు, డీజిల్ ఆటోలు, సూమోలు వివిధ ప్రాంతాలకు తిప్పారు. సందట్లో సడేమియా అంటూ డబ్బులు ఇష్టారాజ్యంగా వసూలు చేశారు. ప్రయాణికులు గత్యంతరం లేక అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని ప్రైవేట్ వాహనాల్లో వెళ్లారు. కిక్కిరిసిన రైల్వే స్టేషన్ ఆర్టీసీ బస్సులు తిప్పకపోవడంతో ప్రయాణికులు రైళ్లను ఆశ్రయించారు. అనంతపురం, గుంతకల్లు, తాడిపత్రి, ధర్మవరం, గుత్తి, పెనుకొండ రైల్వే స్టేషన్లలో వేలాది మంది ప్రయాణికులు తరలివచ్చారు. రైళ్లలో సీట్లు దొరక్క నానా తంటాలు పడ్డారు. అందులోనూ అడ్వాన్స్డ్ రిజర్వేషన్ కావడంతో పెద్ద తలనొప్పిగా మారింది. రైల్లో కిందనే కూర్చుని మరీ వెళ్లారు. డిపో ముందు ఉద్రిక్తత హైదరాబాద్ నుంచి బస్సులు తిప్పడానికి స్పెషల్ ఆఫీసర్‌గా శ్రీహరి వచ్చారు. ఈయన ఆధ్వర్యంలో డిప్యూటీ సీటీఎం మధుసూదన్, సీఎంఈ శ్రీలక్ష్మి, డీఎం రమణ బస్సులు తిప్పేందుకు రంగం సిద్దం చేశారు. మొదట గుత్తికు రెండు సర్వీసులు తిప్పాలని చూశారు. డిపో ముందు బస్సులు పెట్టేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కార్మికులు రెచ్చిపోయారు. తమపై ఎక్కించి మరీ బస్సులు తిప్పాలన్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుపడడంతో కార్మికులు లోపలికి వెళ్లలేదు. పోలీసుల పహారా: డీఎస్పీ మల్లికార్జున వర్మ నేతృత్వంలో త్రీటౌన్, వన్‌టౌన్ పోలీసులతో పాటు రోప్‌పార్టీ, స్పెషల్ పార్టీ పోలీసులతో డిపో ఆవరణం నిండిపోయింది. ఎక్కడ బస్సులు ధ్వంసం చేస్తారేమోనని ముందస్తుగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెకు మద్దతు...సమ్మె చేపడుతున్న ఆర్టీసీ ఈయూ, ఎన్ఎంయూకు ఏఐటీయూసీ, కాంగ్రెస్ పార్టీ, వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపాయి. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలన్నారు. వివిధ పార్టీ నేతలు జాఫర్, దాదా గాంధీ, తదితరులు మద్దతు తెలిపారు. బంద్ ఎఫెక్ట్‌పై ప్రయాణికుల అభిప్రాయాలు... ఉదయం నుంచి వేచి ఉన్నాం - కల్పన(అనంతపురం): తాడిపత్రిలో మా బంధువుల పెళ్లికి వెళ్లాలి. ఉదయం నుంచి వేచి ఉన్నాం. ఒక్క బస్సు రాలేదు. ప్రైవేట్ వాహనాల్లో ఏవిధంగా వెళ్లాలి. సమస్యను పరిష్కరించి త్వరగా బస్సులు తిప్పాలి. ఇక్కడొచ్చి ఇరక్కపోయాం - హబీబా(ధర్మవరం) : ధర్మవరం నుంచి పొద్దునే వచ్చాం. గుంతకల్లు దర్గాకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు తిప్పరంటున్నారు. ఏం చేద్దాం పిల్లోలను వేసుకుని ఉంటున్నాం. ఎవరు పట్టించుకోవడంలేదు. చివరి చూపు చూస్తానో లేదో - చెన్నమ్మ(అనంతపురం): మా అల్లుడు చనిపోయాడు. వాళ్లది పెనుకొండ. అక్కడకు వెళ్లాలి. ఇక్కడేమో బస్సులు రావన్నారు. చివరి చూపు చేస్తానో లేదో. కార్మికుల అభిప్రాయాలు... ప్రభుత్వమే బాధ్యత వహించాలి - భాస్కర్‌నాయుడు(ఎన్ఎంయూ): సమ్మె జరగడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణం. ప్రయాణికులు, కార్మికులు రోడ్డుపాలు కావడానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కార్మిక చట్టాలను విస్మరిస్తున్నారు. 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించాలి - గోపాల్(ఎన్ఎంయూ): ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాల్సిందే. అందరితో ధీటుగా పనిచేస్తూ...ప్రజలకు సేవలందిస్తున్నాం. మాకే ఇవ్వకపోతే ఎలా..? డిమాండ్లు నెరవేరాకే బస్సెక్కుతాం. ఒక్క బస్సు తిరగనివ్వం - వైకే మూర్తి(ఎన్ఎంయూ): ఒక్క బస్సు బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. కార్మికులంటే అంత చుకలనా. ప్రభుత్వం అండగా ఉంటామని చెప్పి ఇవాల మాట మారుస్తున్నారు. దీనికి మూల్యం చెల్లించక తప్పదు. మారిన బాబు అంటే ఇదేనా - రామిరెడ్డి(ఈయూ): నేను మారాను. అందరి కష్టాలను తీరుస్తానంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...మారడమంటే ఇదేనా.. కార్మికులతో ఆడుకుంటున్నావ్. లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా...నీకు కన్పించలేదా...ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయ్ మాట తప్పడం బాబు నైజం - కొండయ్య(ఈయూ): చంద్రబాబు నాయుడుకు మాట తప్పడం అతని నైజం. కార్మికులతో ఆడుకుంటున్నారు. ఎన్నికల ముందు ఓ మాట ఇప్పుడోమాట మాట్లాడుతున్నారు. మా ఆగ్రహానికి గురికాక తప్పదు. -
రోడ్డెక్కని ఆర్టీసీ
సమ్మెకు దిగిన 6400 మందికి పైగా కార్మికులు,ఉద్యోగులు జిల్లావ్యాప్తంగా నిలిచిపోయిన 1100 బస్ సర్వీసులు రోజుకు రూ.కోటికి పైగా నష్టం ఆందోళనలో అధికారగణం పట్నంబజారు (గుంటూరు) : సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మెబాట పట్టారు. ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) ఇచ్చిన పిలుపునకు అన్ని యూనియన్లు మద్దతు ఇవ్వడంతో జిల్లాలోని ప్రగతి చక్రాలకు బ్రేకులు పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమకు కూడా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెకు పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సమ్మెకు ఎన్ఎంయూ సైతం మద్దతు ప్రకటించింది. దీంతో బుధవారం తెల్లవారు జాము నుంచి జిల్లాలోని ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం మధ్య జరిగిన చర్చలు విఫలం కావటంతో సమ్మె అనివార్యమైందని ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మంగళవారం తెలిపారు. ఆర్టీసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు బాసటగా నిలవటంతో, డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె విరమించే ప్రసక్తే లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. రోజుకు రూ. కోటి నష్టం... గుంటూరు రీజియన్ పరిధిలోని ఉద్యోగులు, కార్మికులు మొత్తం 6400 మందికి పైగా ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. సమ్మె కారణంగా సంస్థకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నప్పటికీ భవిష్యత్ దృష్ట్యా తప్పటం లేదని యూనియన్ నాయకులు చెబుతున్నారు. రీజియన్ పరిధిలో ఆర్టీసీకి రోజుకు రూ. కోటి మేర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. పలు సంఘాల మద్దతు ... నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తున్న కార్మికుల విషయంలో యాజమాన్యం, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఈయూ సమ్మెకు పిలుపునిచ్చింది. మరో ప్రధాన యూనియన్ నేషనల్ మజ్దూర్ (ఎన్ఎంయూ)తో పాటుగా అన్ని సంఘాలు మద్దతు ప్రకటించాయి. నిత్యం రీజియన్ పరిధిలోని 13 డిపోల నుంచి 1275 సర్వీసులు తిరుతున్నాయి. కార్మికులు సమ్మెకు దిగుతుండటంతో సుమారు 1100 పైగా బస్సులు నిలిచిపోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 6,400 మంది కార్మికుల్లో ఈయూలో 2, 800 మంది, ఎన్‌ఎంయూలో 2,700 మంది ఉండగా, మిగిలిన వారు వివిధ సంఘాల్లో ఉన్నారు. ఈయూ నాయకులు గత నెల 2వ తేదీన సమ్మె నోటీసులు జారీ చేశారు. సమ్మెలో 13 డిపోల కార్మికులు, నాయకులు పాల్గొనాలని తీర్మానించారు. దీంతో పూర్తి స్థాయిలో బస్సులు నిలిచిపోయే అవ కాశం కూడా ఉంది. ప్రత్యామ్నాయం కోసం అధికారుల ప్రయత్నాలు...? కార్మికులు సమ్మెకు సిద్ధం కావడంతో బస్సులు నడపటం కోసం ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కార్మిక సంఘాల నేత లు మాత్రం ఒక్క బస్సును కూడా డిపోల నుంచి కదలనివ్వబోమని తేల్చిచెప్పారు. -
ఆర్టీసీ సమ్మె యోచన వాయిదా
హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యం కార్మికుల కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ(సీసీఎస్) నిధులను తిరిగి చెల్లించేందుకు అంగీకరించడంతో సమ్మెను వాయిదా వేసుకోవాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించారు. రూ.253 కోట్ల సీసీఎస్ నిధులను ఇప్పటి వరకు ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. వీటిని వెంటనే చెల్లించాలని కొంత కాలంగా కార్మికులు ఆందోళనలకు దిగినా.. యాజమాన్యం స్పందించకపోవడంతో శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఆర్టీసీ యాజమాన్యం హడావుడిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను సంప్రదించి సమ్మె విరమింపజేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులను చర్చలకు పిలిపించింది. ఈ నెల 20 నాటికి సీసీఎస్ నిధులను చెల్లించేందుకు సిద్ధమని ప్రకటించింది. దీంతో ఇరు ప్రాంతాల్లో సమ్మె యోచనను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ శుక్రవారం రాత్రి ప్రకటించింది. కాగా, సీసీఎస్ రుణాల అంశంపై స్పష్టత రావడంతో సమ్మె యోచనను విరమించుకున్న ఎంప్లాయీస్ యూనియన్ ఇతర డిమాండ్లపై శనివారం మరో సమ్మెకు సంబంధించి నోటీసు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, డీఏ బకాయిల చెల్లింపు తదితర అంశాలపై ఆర్టీసీ యాజమాన్యం స్పందించని నేపథ్యంలో సమ్మెకు ఉపక్రమించాలని నిర్ణయించింది.